EPAPER

Alia Bhatt: రాహా కపూర్‌కు రామ్ చరణ్ స్పెషల్ గిఫ్ట్, చూడగానే షాకయిన ఆలియా భట్.. అదేంటో తెలుసా?

Alia Bhatt: రాహా కపూర్‌కు రామ్ చరణ్ స్పెషల్ గిఫ్ట్, చూడగానే షాకయిన ఆలియా భట్.. అదేంటో తెలుసా?

Alia Bhatt: గత కొన్నేళ్లలో బాలీవుడ్‌కు, టాలీవుడ్‌కు ఉన్న దూరం చాలావరకు తగ్గిపోయింది. తెలుగు మేకర్స్‌ను, తెలుగు సినిమాలను అమితంగా గౌరవించడం మొదలుపెట్టారు బాలీవుడ్ మేకర్స్. అంతే కాకుండా ఇరు ఇండస్ట్రీల నటీనటులకు కూడా మంచి సాన్నిహిత్యం పెరిగింది. అలాగే రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’లో హీరోయిన్‌గా నటించిన తర్వాత ఆలియా భట్ కూడా తెలుగు నటీనటులకు చాలా దగ్గరయ్యింది. అందులో హీరోలుగా నటించిన రామ్ చరణ్, ఎన్‌టీఆర్‌లను తన బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకుంటుంది. అదే సాన్నిహిత్యంతో ఆలియా కూతురికి ఒక స్పెషల్ గిఫ్ట్ పంపించాడు రామ్ చరణ్.


ఏ మార్పు లేదు

పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత ఆలియా భట్ కెరీర్‌లో పెద్దగా మార్పులు ఏమీ రాలేదు. రణబీర్ కపూర్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సినిమాల్లో అంతే బిజీగా ఉంటోంది ఆలియా. ఇక పాప పుట్టిన తర్వాత కూడా ఆలియా కెరీర్‌లో మార్పులు రాలేదు. ఒకవైపు ఫ్యామిలీ లైఫ్ మ్యానేజ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో బిజీగా గడిపేస్తోంది. తాజాగా ‘జిగ్రా’ అనే మూవీతో ప్రేక్షకల ముందుకు వచ్చింది ఆలియా భట్. ఈ సినిమా హిందీతో పాటు తెలుగులో కూడా విడుదలయ్యింది. తెలుగులో ఈ మూవీని విడుదల చేయడం కోసం సురేశ్ ప్రొడక్షన్స్ ముందుకొచ్చింది. సురేశ్ ప్రొడక్షన్స్‌తో తను పాల్గొన్న ఇంటర్వ్యూలో రామ్ చరణ్.. రాహా కపూర్ కోసం పంపిన స్పెషల్ గిఫ్ట్ గురించి షేర్ చేసుకుంది.


Also Read: ముగ్గురు హీరోల జీవితాలలో నిజమైన స్టార్ హీరోయిన్ సెంటిమెంట్.. క్రేజీ కదా..!

రాహాకు ఇష్టం

‘‘ఇది ఒక ఫన్నీ కథ. రాహా పుట్టిన ఒక నెలరోజుల తర్వాత అలా వాకింగ్ చేద్దామని బయటికి వెళ్లాను. సడెన్‌గా నా వెనక నుండి ఒకరు వచ్చి మేడమ్ రామ్ చరణ్ సార్ ఒక ఏనుగును పంపించారు అన్నాడు. నేను షాకయ్యాను. రేపటి నుండి నా బిల్డింగ్‌లో ఒక పెద్ద ఏనుగు తిరుగుతూ ఉంటుందేమో అనుకున్నాను. కానీ అది నిజమైన ఏనుగు కాదు. అది ఒక చెక్క బొమ్మ. రాహా పేరుతో రామ్ చరణ్.. అడవిలోని ఒక ఏనుగును దత్తతు తీసుకున్నాడు. అది చెప్పడానికి తనకు ఆ బొమ్మను పంపించాడు. తను చేసిన పని నాకు చాలా గొప్పగా అనిపించింది. తను పంపించిన బొమ్మకు మేము ఎలీ అని పేరు పెట్టుకున్నాం. ఆ బొమ్మ ఎప్పుడూ డైనింగ్ టేబుల్ దగ్గరే ఉంటుంది. రాహా దానితో బాగా ఆడుకుంటుంది’’ అని చెప్పుకొచ్చింది ఆలియా భట్.

అప్పుడే దగ్గరయ్యాం

ఈ ఇంటర్వ్యూలో ‘ఆర్ఆర్ఆర్’ అనుభవాల గురించి కూడా గుర్తుచేసుకుంది ఆలియా భట్. ‘‘తారక్, రామ్ చరణ్‌తో ఆర్ఆర్ఆర్ సెట్‌లో ఎక్కువ సమయాన్ని గడిపే అవకాశం నాకు రాలేదు. మేము వేర్వేరు షెడ్యూల్స్‌లో పనిచేసేవాళ్లం. కానీ ప్రమోషన్స్ సమయంలో మేము చాలా క్లోజ్ అయ్యాం’’ అని తెలిపింది. వసన్ బాలా దర్శకత్వంలో తెరకెక్కిన ‘జిగ్రా’ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమాలో తమ్ముడి కోసం ఏదైనా చేసే అక్క పాత్రలో ఆలియా భట్ కనిపించింది. ఇందులో తన తమ్ముడిగా వేదాంగ్ రైనా నటించాడు. మొత్తానికి ‘జిగ్రా’ హిందీలోనే కాదు తెలుగులో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించింది.

Related News

Hari Hara Veera Mallu: బాణాలతో వీరమల్లు.. బాహుబలిని గుర్తుచేస్తున్నాడే

Jani Master: జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు.. ఆసుపత్రికి తరలింపు

Game Changer: కొత్త డేట్ తో వచ్చేసిన గేమ్ ఛేంజర్.. ఇక పూనకాలే

RAPO22: మహేష్ బాబుతో రామ్ సినిమా.. ఈసారి హిట్ ఖాయమే.. ?

Allu Arjun: గొడవపై క్లారిటీ.. మెగావార్ ముగిసినట్టేనా..?

Unstoppable Season 4 Trailer: జై బాలయ్య.. దెబ్బకు థింకింగ్ మారి తీరాలా.. ట్రైలర్ అదిరిపోయింది

Big Stories

×