EPAPER

Akkineni Nagarjuna: దానికి పవనే అవసరం లేదు.. ఆయన ఫ్యాన్స్ చాలు

Akkineni Nagarjuna: దానికి పవనే అవసరం లేదు.. ఆయన ఫ్యాన్స్ చాలు

Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున పేరు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెల్సిందే. మంత్రి కొండా సురేఖ..  అక్కినేని కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం..  నాగార్జున ఆమెపై కేసు వేయడం.. ఇలా గత కొన్ని రోజుల నుంచి నాగ్ పేరు మారుమ్రోగుతూనే ఉంది. ఇక దీంతో ఆయన ఏది మాట్లాడినా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంది. ఈ వివాదాలన్నీ పక్కన పెడితే.. బిగ్ బాస్ కు మకుటం లేని మహారాజుగా ఏలుతున్నాడు నాగార్జున.  రెండు సీజన్స్ మినహాయించి 6 సీజన్స్ కు ఆయనే హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.


ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 రన్ అవుతున్న విషయం తెల్సిందే. నెల రోజుల తరువాత నిన్ననే హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీస్ ను పంపించారు.  సీజన్  8 కొత్తగా ఉంటుంది.. రీ బాండ్ అంటే ఏమో అనుకున్నారు కానీ.. అంతకు ముందు సీజన్స్ లో ఆడిన  కంటెస్టెంట్స్ ను రాయల్ కంటెస్టెంట్స్ పేరుతో లోపలికి పంపించారు. ఇక ఈ రాయల్ బ్యాన్ లో హరితేజ, టేస్టీ తేజ, నయని పావని,  గౌతమ్ కృష్ణ, మెహబూబ్, రోహిణి, గంగవ్వ ఉన్నారు.

ఇక ఒక్కొక్కరిని ఇంట్లోకి పంపించాకా నాగ్.. సెలబ్రిటీలను కూడా స్టేజి మీదకు పిలిచి.. రాయల్ బ్యాచ్ కు ఓజి బ్యాచ్ కు గేమ్స్ ఆడించే బాధ్యత వారికి అప్పగించడం జరిగింది. అలా మా నాన్న సూపర్ హీరో టీమ్..  స్టేజి మీద సందడి చేశారు. సుధీర్ బాబు, షాయాజీ షిండే తండ్రీకొడుకులగా నటించిన ఈ సినిమా అక్టోబర్ 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన టీమ్.. నిన్న బిగ్ బాస్ స్టేజిమీద సందడి  చేశారు.


ఇక ఈ స్టేజి మీద షాయాజీ షిండే గురించి సుధీర్ బాబు ఒక ఆసక్తికరమైన విషయాన్నీ పంచుకున్నాడు. షిండే.. ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా మొక్కలు నాటుతూ ఉంటాడని తెలిపాడు. అయితే అందుకు కారణం ఏంటి అని నాగ్ అడగ్గా షిండే మాట్లాడుతూ.. ”  మా అమ్మగారిని నేను ఎంత డబ్బు ఉన్నా కాపాడలేకపోయాను. ఆ సమయంలోనే అమ్మకు మాట ఇచ్చా. ఆమె ఎంత బరువు అయితే ఉన్నారో.. అంత బరువు ఉన్న విత్తనాలను నాటుతాను అని.  ఎందుకంటే.. ఆ విత్తనాలు.. మొక్కలుగా మారి.. చెట్లుగా ఎదిగి.. పూలు పూసి, కాయలు కాసి, ప్రజలకు నీడను ఇస్తాయి. అలా ఎదిగిన చెట్లలలో మా అమ్మను చూసుకుంటున్నాను.  మా అమ్మ తరువాత భూమాత కూడా అమ్మనే కదా. ఇక ఆలయాలుకు వెళ్ళిన భక్తులకు.. ప్రసాదం తో పాటు ఒక మొక్కను కూడా ఇవ్వాలని ఏపీ డిప్యూటీ స్మ్ పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలనుకుంటున్నాను” అని చెప్పుకొచ్చాడు.

ఇక షిండే చేస్తున్న మంచి పనిని నాగ్ ప్రశంసించాడు. మధ్యలో సుధీర్ బాబు మాట్లాడుతూ.. ఈ మొక్కలు ఇవ్వడం గురించి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కు చెప్తే చాలు అనగా.. నాగ్ సైతం పవన్ కళ్యాణ్ కు భారీ అభిమానులు ఉన్నారు.. మీరు ఆయన వద్దకు వెళ్లాల్సిన  అవసరం లేదు. ఆయన ఫ్యాన్స్ చాలు.. వారే ఆయన వద్దకు ఈ విషయాన్నీ తీసుకొని వెళ్తారు” అని తెలిపాడు. ప్రస్తుతం నాగ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Ka Mass Jathara: ‘క’మాస్ జాతర.. కిరణ్ అన్న డ్యాన్స్ కు పూనకాలు రావడం గ్యారెంటీ

Natty Kumar: పవన్ కాలి గోటికి కూడా ప్రకాశ్ రాజ్ సరిపోడు, మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఖండించలేదే.. నట్టి కుమార్ వ్యాఖ్యలు

Rashmika Mandanna: రష్మిక ఫస్ట్ ఆడిషన్ వీడియో.. ఇంతవరకు చూడని సరికొత్త లుక్!

NTR: రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్.. ఎన్టీఆర్ రియాక్షన్ ఇదే.. ?

IIFA awards 2024: ఉత్తమ నటుడిగా యంగ్ హీరో.. మరో ఫీట్ అందుకోనున్నారా..?

Prakash Raj: చీప్ రాజకీయాలు.. తిరుపతి లడ్డూ వివాదాన్ని వదలని ప్రకాష్ రాజ్

×