EPAPER

Akhil Akkineni: అఖిల్ పీరియాడికల్ డ్రామా, అయ్యగారికి వాళ్ళ అయ్యగారే ప్రొడ్యూసర్

Akhil Akkineni: అఖిల్ పీరియాడికల్ డ్రామా, అయ్యగారికి వాళ్ళ అయ్యగారే ప్రొడ్యూసర్

Akhil Akkineni: సిసింద్రీ సినిమాతో బాల నటుడుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు అఖిల్ అక్కినేని. చాలా చిన్న ఏజ్ లో తెలుగు ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేసాడు అని చెప్పొచ్చు. ఆ తర్వాత విక్రం కే కుమార్ దర్శకత్వం వహించిన మనం సినిమాలో కనిపించిన కాసేపు కూడా అద్భుతంగా అనిపించాడు. అక్కినేని నట వారసుల్లో అఖిల్ అద్భుతంగా సినిమాలు చేసి వారసత్వాన్ని నిలబెడతాడు అని అందరూ అనుకున్నారు. అఖిల్ హీరోగా పరిచయమైన సినిమా అఖిల్ (Akhil). ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని అందుకోలేదు.


అఖిల్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన అఖిల్, అక్కినేని హీరోలలా కాకుండా డాన్సులు మాత్రం అద్భుతంగా చేసాడు. మొదటి సినిమాతోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక మంచి నటుడు దొరికాడు అని కొంతమంది ద్వారా ప్రశంసలు కూడా అందుకున్నాడు. కానీ అఖిల్ కి సక్సెస్ మాత్రం అంత ఈజీగా రాలేదు. ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేసినా కూడా అవన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అంతంత మాత్రమే ఆడాయి. చివరికి మనం లాంటి సూపర్ హిట్ సినిమాను అక్కినేని ఫ్యామిలీకి అందించిన విక్రం కే కుమార్ హలో సినిమా కూడా ఊహించిన విజయాన్ని అఖిల్ కి ఇవ్వలేకపోయింది.

ఇకపోతే అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించి అఖిల్ ఖాతాలో ఒక హిట్ గా నిలిచింది. ఇక ఆల్మోస్ట్ అఖిల్ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేసాడు అనుకునే తరుణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ సినిమా తీవ్రమైన డిజాస్టర్ అయింది. ఇప్పటికీ ఓటిటి రిలీజ్ కూడా ఆ సినిమా నోచుకోలేదు. ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు ఒక సినిమా కూడా అఖిల్ చేయలేదు. అయితే అఖిల్ యూవీ క్రియేషన్స్ లో ఒక సినిమాను చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.


లేటెస్ట్ గా అఖిల్ మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మురళీ కిషోర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఒక పిరియాడికల్ డ్రామా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి నిర్మాతగా అక్కినేని నాగార్జున వ్యవహరించనున్నట్లు సమాచారం వినిపిస్తుంది. అతి త్వరలో దీని గురించి అధికార ప్రకటన రావాల్సి ఉంది.కిరణ్ అబ్బవరం హీరోగా చేసిన వినరో భాగ్యమే విష్ణు కథ అనే సినిమాకు దర్శకుడుగా పనిచేశాడు మురళీ కిషోర్. ఈ సినిమాను గీత ఆర్ట్స్ పై బన్నీ వాసు నిర్మించారు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు కానీ దర్శకుడుగా మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అయితే ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉన్నట్లు లీడ్ ఇచ్చారు. కానీ ఊహించిన స్థాయిలో సినిమా ఆడకపోవటం వలన ఆ సీక్వెల్ పక్కన పెట్టేసారని అర్థమవుతుంది.

Related News

Game Changer : ‘గేమ్ ఛేంజర్’ లో ఆ స్పెషల్ సాంగ్ కి అన్నికోట్లా ?

Rajinikanth : ఆ రెండు కథలు పూర్తిగా నాకెందుకు చెప్పలేదు

Trivikram Srinivas : గురూజీకి కథ చెప్పడం అంత తేలికా.?

Salman Khan : లారెన్స్ బిష్ణోయ్ కి సల్మాన్ మాజీ గర్ల్ ఫ్రెండ్ ఓపెన్ ఆఫర్

Karthik Subbaraj : ఫస్ట్ టైం ఒక లవ్ స్టోరీ తీస్తున్నాడు, ఎలా వస్తుందో ఏంటో.?

Sharukh Khan: చివరి కోరిక బయటపెట్టిన షారుక్.. కంగారులో ఫ్యాన్స్..!

Suriya: హీరోయిన్ జ్యోతిక ఎన్ని రూ.వందల కోట్లకు అధిపతో తెలుసా..?

Big Stories

×