EPAPER

Vijay The Goat Movie: ‘ది గోట్’ మూవీ కోసం AI దివంగత విజయకాంత్‌‌ సృష్టించారట!

Vijay The Goat Movie: ‘ది గోట్’ మూవీ కోసం AI దివంగత విజయకాంత్‌‌ సృష్టించారట!

Vijay The Goat Movie: కోలివుడ్ స్టార్ విజయ్ సినిమాలకు తెలుగులో మంచి డిమాండ్ ఉంది. తుపాకి సినిమా నుంచి విజయ్‌కి తెలుగులో మంచి మార్కెట్, ఆదరణ పెరుగుతోంది. గతేడాది విజయ్ – లోకేశ్ కనగరాజ్ కాంబోలో వచ్చిన ‘లియో’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఫస్ట్ నుంచి ఈ మూవీపై భారీ అంచనాలు ఉండటంతో ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీశారు. ఫస్ట్ షో పడిన తర్వాత ఈ సినిమా కోలీవుడ్‌లో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. కానీ తెలుగులో మాత్రం కొందరికే ఎక్కింది. మరికొందరు నిరాశతో బయటకు వచ్చారు. కానీ కలెక్షన్లలో మాత్రం ఈ సినిమా దూసుకుపోయింది. మొత్తంగా మిక్స్డ్ టాక్‌తో ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది. తాజాగా విజయ్ నటించిన కొత్త మూవీ ‘ది గోట్’ మూవీ ఈ సెప్టంబర్ 5న విడుదల కానుంది. ఈ మూవీకి నాగ చైతన్యతో కస్టడీ మూవీ చేసిన వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. అయితే, ఈ మూవీ విజయ్ కెరీర్‌లోనే కాకుండా సినీ పరిశ్రమలోనే కొత్త ట్రెండ్‌ను సృష్టంచబోతుంది. ఎందుకంటే ఈ మూవీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించడమే విశేషం. అలాగే ఈ మూవీ చాలా కొత్తగా ఉండబోతుందన్న టాక్ నడుస్తోంది. ఈ మూవీ గురించి డైరెక్టర్ వెంకట్ ప్రభు ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు.


Also Read: ‘విజిలేస్కో’ సాంగ్ రిలీజ్.. విజయ్ స్టెప్పులు ఏమున్నాయ్ గురు.. చూస్తే వావ్ అనాల్సిందే..

18ఏళ్ల వయస్సులో ఉన్న విజయ్‌గా..
విజయ్‌ లాంటి పెద్ద హీరోతో సినిమా చేసేందుకు మొదట్లో వెంకట్ ప్రభుకు భయం వేసిందట. స్ప్రై థ్రిల్లర్ మూవీ కాబట్టి లాస్ ఏంజిల్స్, రష్యా, ట్యునీషియా, ఆఫ్రికాలకు వెళ్లారట. నిజానికి ఈ మూవీలో స్ర్కిప్ట్ రాస్తున్నప్పుడు వెంకట్ ప్రభుకు యాంటి ఏజింగి టెక్నాలిజీ గురించి తెలియదు. అందుకే తండ్రీకొడుకు క్యారెక్టర్స్‌కు వేరే వేరే యాక్టర్స్‌ను అనుకున్నాడట. హాలివుడ్‌లో పనిచేసే తన ఫ్రెండ్ సలహామేరకు ఈ యాంటి ఏజింగ్ టెక్నాలజీతో విజయ్‌ను తండ్రీకొడుకుగా చూపించారట. మనం ఇప్పటి వరకు చాలా డ్యూయల్ రోల్ మూవీస్ చూశాం. అందులో తండ్రీకొడుకులుగా నటించి హీరోలు.. కొంచెం బాడీలోనూ, వారి ఆకారంలోనూ మార్పులు చేసి చూపించారు. అయితే ఇందులో మాత్రం ఒక విజయ్ పాత్రను ఏఐతో సృష్టించారట. ఈ మూవీలో విజయ్ ఒక రోల్‌లో సాధారణంగా కనిపించనుండగా.. మరో రోల్‌లో 18ఏళ్ల వయస్సులో ఉన్న విజయ్‌గా కనిపంచనున్నాడు.


ఏఐతో విజయ్‌కాంత్
ఈ మూవీలో దివంగత విజయ్‌కాంత్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడట. దీనికోసం కూడా ఏఐ టెక్నాలజీని వినియోగించారు. నిజానికి విజయ్‌కాంత్‌ను ఈ మూవీ అనుకున్నప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారట. సినిమాలో అతిథి పాత్ర చేసేందుకు ఒప్పుకున్నారట. కానీ, మూవీ పూర్తి చేసేలోపే చనిపోయాడు. దీంతో ఆయన్ను ఏఐ టెక్నాలజీతో చూపించేందుకు విజయ్‌కాంత్ కుటుంబ సభ్యుల అనుమతి తీసుకుని ఏఐ విజయ్‌కాంత్‌ను సృష్టించారట. మరి ఇంతలా ఏఐ టెక్నాలజీ వాడిన ఈ మూవీకి ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో సెప్టెంబర్ 5న చూడాల్సిందే.

 

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×