Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జునకు 2024 అంతగా కలిసిరాలేదు అని చెప్పొచ్చు. ఈ ఏడాది మొత్తం వివాదాల మధ్యనే అక్కినేని కుటుంబం నెట్టుకువచ్చింది. ముఖ్యంగా అక్కినేని నాగార్జునను అంతగా వివాదాల్లోకి లాగిన విషయం N కన్వెన్షన్ కూల్చివేత. హైడ్రా లో భాగంగా తుమ్ములకుంట చెరువును కబ్జా చేసి N కన్వెన్షన్ ను కట్టినట్లు ఆరోపణలు రావడంతో.. సీఎం రేవంత్ రెడ్డి దానిని కూల్చివేసిన విషయం తెల్సిందే. ఇదే నాగ్ కు పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు.
కొన్ని కోట్లు విలువ చేసే N కన్వెన్షన్ ను కూల్చివేయడంతో నాగ్ కు ఎంతో నష్టం చేకూరింది. అదే కనుక ఉండి ఉంటే.. ఇప్పటికీ ఎన్నో ప్రీ రిలీజ్ ఈవెంట్ లు, సక్సెస్ మీట్ లు అందులోనే జరిగాయి. అంతెందుకు నాగార్జున కొడుకు నాగ చైతన్య- శోభితల వివాహం కూడా అక్కడే జరిగి ఉండేది. చై.. శోభితాను రెండో వివాహం చేసుకుంటున్న విషయం తెల్సిందే. చై- సామ్ పెళ్లి గోవాలో జరిగినా.. రిసెప్షన్ మాత్రం N కన్వెన్షన్ లోనే జరిగింది.
Meenakshi Chaudhary: లక్కీ బ్యూటీని అలా ఎలా చేశారు.. ఆమె కోసమే మట్కా చూసేవాళ్ల పరిస్థితి ఏంటి.. ?
ఇక ఇప్పుడు చై- శోభితల వివాహాన్ని కూడా నాగ్.. N కన్వెన్షన్ లోనే చేయాలనీ చూశాడట. ముందు వీరి పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ అనుకున్నారట .. కానీ, కొన్ని కారణాల వలన దాన్ని విరమించుకున్నారని సమాచారం. ఇక తరువాత రాజస్థాన్ ప్యాలెస్ లో అనుకున్నారట. అది కూడా వద్దని హైదరాబాద్ లో చేద్దామనుకున్నారు. అప్పుడే నాగ్ కు N కన్వెన్షన్ గుర్తొచ్చిందని, అదే కనుక ఉండి ఉంటే అందులోనే చేయాలనీ అనుకున్నాడట. ఇది కేవలం నాగ్ మాత్రమే కాదు.. టోటల్ చిత్ర పరిశ్రమ మొత్తం మాట్లాడుకుంటున్నారు. ఆ కన్వెన్షన్ ఉంటే కచ్చితంగా నాగ్.. అక్కడే కొడుకు పెళ్లి చేసేవాడు అని చెప్పుకొస్తున్నారు.
ఇక అది ఇప్పుడు లేకపోవడంతోనే అన్నపూర్ణ స్టూడియోస్ లో చేయడానికి సిద్దమయ్యినట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. డిసెంబర్ 4న వీరి వివాహం జరగనుంది. అత్యంత సన్నిహితులు, బంధువులు మాత్రమే వీరి పెళ్ళికి హాజరవుతున్నారని తెలుస్తోంది. ఇక కేవలం చై మ్యారేజ్ మాత్రమే కాదు.. ఈ మధ్యకాలంలో జరిగిన సెలబ్రిటీల ఈవెంట్స్ కూడా N కన్వెన్షన్స్ లోనే జరిగేవి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి చై- శోభితా వివాహం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎంత గ్రాండ్ గా జరుగుతుందో చూడాలి.