EPAPER
Kirrak Couples Episode 1

Nag Ashwin : ‘కల్కి 2’ తర్వాత ఆ స్టార్ హీరోతో నాగీ సినిమా?

Nag Ashwin : ‘కల్కి 2’ తర్వాత ఆ స్టార్ హీరోతో నాగీ సినిమా?

Nag Ashwin : ఈ ఏడాది వచ్చిన సినిమాలలో కల్కి సినిమా వేరయా.. ఇది ప్రభాస్ ఫ్యాన్స్, సినీ అభిమానులు అంటున్న మాట.. అది నిజమే కదా.. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకోవడం మాత్రమే కాదు. దాదాపు రూ. 1200 కోట్లకు పైగా వసూల్ చేస్తుంది. సాదారణంగా మొదటి పార్ట్ హిట్ అయితే రెండో పార్ట్ సినిమా కోసం ప్లాన్ చేస్తారు. ఇప్పటివరకు వచ్చిన స్టార్ హీరోల సినిమాలు పార్ట్ 2 కూడా చేస్తూ బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంటున్నారు.. ఇక కల్కి లాంటి సినిమాను మళ్లీ మళ్లీ చూడాలని అనుకోవడంలో తప్పు లేదు. జనాల్లో ఆ క్యూరియాసిటిని పెంచుతూ పార్ట్ 2 రాబోతుందని అనౌన్స్ చేశారు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని సినీ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.


ఇక డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమా కథను పూర్తి చేసే పనిలో ఉన్నారని టాక్ వినిపిస్తుంది. కల్కి సినిమా స్టోరీ మొత్తం పార్ట్ 2 లోనే చూపిస్తారని ఒక హిట్ జనాలకు ఇచ్చేశారు. దాంతో సినిమా అప్డేట్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా మొదలువ్వడానికి చాలా టైం పట్టేలా ఉందని తెలుస్తుంది. ఎందుకంటే పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం అర డజను సినిమాలను చేతిలో పెట్టుకున్నాడు. రాజా సాబ్, స్పిరిట్, సలార్ 2, హను రాఘవపూడితో ఓ సినిమా. ఇవన్నీ పూర్తి చేశాక కల్కి 2 సినిమా పై దృష్టి పెడతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్కో సినిమాకు ఏడాది పడుతుంది. అన్ని పూర్తి అవ్వాలి, రిలీజ్ అవ్వాలి అప్పుడే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అయితే నాగీ మామ మరో హీరోతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.. గత కొన్ని రోజులుగా నాగ్ అశ్విన్ ఆ హీరోకు కథను వినిపించేందుకు వెళ్ళారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ కథకు హీరో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ మూవీ పనులు మొదలు పెట్టనున్నారని సమాచారం. ఇంతకీ ఆ హీరో మరెవ్వరో కాదు. మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం ఆయన కల్కి 2 సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన చిరంజీవితో ఒక భారీ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇక వీళ్ళ కాంబినేషన్ లో మహానటి తర్వాతనే ఒక సినిమా రావాల్సింది.. కానీ కొన్ని కారణాల వల్ల ఈ కాంబినేషన్ అనేది సెట్ అవ్వలేదు. ఇక దాంతో నాగ్ అశ్విన్ ప్రభాస్ తో కల్కి సినిమా చేసి భారీ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక వీళ్ళ కాంబినేషన్ మీద ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తుంది. మరి దానికి తగ్గట్టుగానే ఆయన కూడా చిరంజీవితో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.. ఈ సినిమా గురించి పూర్తి వివరాలను త్వరలో ప్రకటించనున్నారని సమాచారం.. ఈ సినిమా ఎలాంటి కథతో రాబోతుందో అని మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.


Related News

Prithviraj : ఆ సినిమాకు ముందు నాకు అవకాశాలు లేవు, ప్రస్తుతం 23 సినిమాలు చేస్తున్నాను

Amaran: మేజర్ భార్యగా సాయి పల్లవి.. ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్..!

Koratala Siva: అసలు ఏమి స్కోప్ ఉందని “దేవర” పార్ట్ 2 అనౌన్స్ చేశారు

Allu Arjun: పుష్ప 2 సినిమాకు తప్పని తిప్పలు, మావల్ల కాదు బాబోయ్ అని తప్పుకుంటున్న ఎడిటర్స్

Kalki 2898 AD : రిలీజైన 5 నెలల తరువాత కల్కి ఖాతాలో అరుదైన ఘనత… ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో షోలు

Jani Master: నోరు విప్పిన జానీ మాస్టర్.. ఆ డైరెక్టర్ ను మధ్యలోకి లాగుతూ..!

Jani Master Case : జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్.. Big Tv తో జానీ మాస్టర్ భార్య అయేషా..

Big Stories

×