EPAPER

Aditya Om : నీకంటే వాళ్లే బెటర్ కదయ్యా.. ఓ హీరో అయి ఉండి మరీ ఇంత నీచమా..?

Aditya Om : నీకంటే వాళ్లే బెటర్ కదయ్యా.. ఓ హీరో అయి ఉండి మరీ ఇంత నీచమా..?

Aditya Om : 2002లో హరికృష్ణ, సుమన్, రచన, వినీత్, సంఘవి, అంకిత ప్రధాన పాత్రల్లో వచ్చిన లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు యంగ్ హీరో ఆదిత్య ఓం. నటుడు, స్క్రీన్ ప్లే, రచయిత, దర్శకుడు, నిర్మాత ఇలా ఇండస్ట్రీలో ఉండే 24 ఫ్రేమ్స్ లలో అడుగుపెట్టాడు కానీ ఏ విభాగంలో కూడా సక్సెస్ పొందలేకపోయాడు. ముఖ్యంగా అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు కానీ అతడు నటించిన ఏ సినిమా కూడా అతడికి పెద్దగా గుర్తింపును అందివ్వలేదు. దీంతో ప్రేక్షకుల దృష్టిలో ఈయన గుర్తింపు లేని హీరోగా నిలిచిపోయారు.


ఆడపిల్లల ముందు పిల్లిగా మారిన ఆదిత్య..

నిజానికి 2002 నుండి ఇప్పటివరకు ఎన్నో చిత్రాలలో నటించినా.. ఆయన తొలి చిత్రం మాత్రమే ప్రేక్షకులకు గుర్తుంది. దీనిని బట్టి చూస్తే అతడి నటన ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేదు అనడంలో సందేహం లేదు. అయితే ఇటీవలే తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా హౌస్ లోకి అడుగు పెట్టారు ఆదిత్య. కనీసం ఇక్కడైనా తన టాలెంట్ ను ఉపయోగించుకొని టైటిల్ గెల్చుకుంటాడని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడ కూడా అతడి చెత్త నటన ప్రేక్షకులకు అర్థమయిపోయిందని చెప్పవచ్చు. ఆదిత్య టాస్క్ లలో ఆడకుండా.. పని మనిషి లాగ అందరి అటెన్షన్ లాగే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఐదు వారాలు హౌస్ లో ఉన్నప్పటికీ.. ఆడపిల్లలు అందరూ ఆడపులులమని పోటీపడుతూ టాస్క్‌లలో తమ మార్క్ క్రియేట్ చేస్తుంటే… ఇతడు మాత్రం వెనకే ఉంటూ తానేదో సైలెంట్ గా ఉంటూ ఆడియన్స్ లో అటెన్షన్ క్రియేట్ చేస్తున్నానని అనుకున్నారు.


తెలుగును హీనం చేసిన ఆదిత్య..

కానీ మన ఆడియన్స్ చాలా తెలివైన వాళ్ళు.. అతడు చేసే ప్రతి పనిని కూడా ఇట్టే ఐడెంటిఫై చేశారు. హౌస్ లో ఐదు వారాలు ఉన్నా.. ఏ ఒక్క వారం కూడా అతడి ఆట ప్రేక్షకులకు కనిపించలేదు. దీంతో దెబ్బకు ఎలిమినేట్ చేశారు. నిజానికి ఆదిత్య ఓం హౌస్ లో ఉన్నప్పుడు తెలుగు భాషను కూనీ చేశారు. వాస్తవానికి ఇతడు తెలుగు అబ్బాయి. అయితే తెలుగు మాత్రం వచ్చి రానట్టు మాట్లాడి అందరిని ఇబ్బంది పెట్టేశాడు. నిజానికి ఇతడి కంటే కన్నడ వారే బెటర్ అని చెప్పవచ్చు. ఇండస్ట్రీలోకి అవకాశాల కోసం వచ్చి తెలుగు స్పష్టంగా నేర్చుకొని, తెలుగు మాట్లాడుతూ తెలుగు వాళ్ళలాగే అనిపించారు. కానీ తెలుగువాడు అయ్యుండి కూడా ఆదిత్య తెలుగు సరిగా మాట్లాడకుండా తెలుగుని హీనం చేస్తూ తెలుగు సాంప్రదాయాన్ని అగౌరవపరిచాడు. ముఖ్యంగా ఇతడు చేసిన పనికి అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. మాతృభాష అంటే తల్లితో సమానం. అలాంటి మాతృభాషనే ఈయన అవమానించాడు అంటూ ఫైర్ అవుతున్నారు.

చెత్త తెలివితేటలతో బొక్క బోర్ల పడ్డ ఆదిత్య..

దీనికి తోడు పెద్ద అటెన్షన్ సీకర్ అనే పేరు కూడా సొంతం చేసుకున్నారు. ఏడ్చి గగ్గోలు పెట్టి తన బాధలు చెప్పుకుంటూ మణికంఠ సెంటిమెంటుతో ఆడియన్స్ హార్ట్ కొల్లగొడితే, ఇతడు మాత్రం ఇంట్లో పనిమనిషి లాగా అటు ఇటు పనులు చేస్తూ గేమ్స్ ఆడకుండా అయ్యో పాపం అని అనిపించుకునేలా చేయాలనుకున్నాడు. కానీ ఇతడి తెలివితేటలతో బొక్క బోర్ల పడ్డారు. ఒక హీరో అయి ఉండి ఇంత నీచంగా ఆట ఆడడం ఎప్పుడూ చూడలేదంటూ ఆడియన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. మొత్తానికైతే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయాడు ఆదిత్య. ఇతడి చెత్త తెలివితేటలు పక్కనపెట్టి ఇండస్ట్రీలో సరైన కథలు ఎంపిక చేసుకొని ఉండి ఉంటే నేడు కనీసం టైర్ 2 హీరోగా అయినా సెటిలైపోయేవారు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Related News

Vettaiyan : రజినీ సినిమాకు హాలిడేస్ ఇచ్చిన కంపెనీలు… కానీ భలే దెబ్బ పడింది

Viswam Movie First Review : విశ్వం మూవీ ఫస్ట్ రివ్యూ… ముగ్గురికి హిట్ వచ్చినట్టేనా…?

Viswam Movie Review : విశ్వం మూవీ రివ్యూ… గోపీచంద్‌కు బ్రేక్ వచ్చినట్టేనా…?

Nagarjuna: పిటీషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ.. కొలిక్కి రానుందా..?

Unstoppable with NBK : తండ్రితో గొడవలు… బన్నీతో షాకింగ్ నిజాన్ని బయట పెట్టించిన బాలయ్య

Ratan TATA: రతన్ టాటా నిర్మించిన వన్ అండ్ ఓన్లీ సినిమా ఏంటో తెలుసా?

Big Stories

×