EPAPER

Bhamakalapam 2 Review : భామాకలాపం 2.. కష్టాల్లో ఉన్న ప్రియమణి గట్టెక్కిందా ?

Bhamakalapam 2 Review : భామాకలాపం 2.. కష్టాల్లో ఉన్న ప్రియమణి గట్టెక్కిందా ?
Bhamakalapam 2 Review

Bhamakalapam 2 Review (film review):


చాలాకాలంగా సరైన సినిమాలు లేక.. చేసిన సినిమాలు కూడా ఫ్లాప్ లు అవుతున్న సమయంలో.. ప్రియమణి ప్రధాన పాత్రలో.. ఎంటర్టైనింగ్, సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన భామాకలాపం.. ఆహా వేదికగా విడుదలై మంచి ఆదరణ పొందింది. దానికి కొనసాగింపుగా వచ్చిన సీక్వెల్ భామాకలాపం 2. భామాకలాపం మొదటి పార్టులో అనుపమ (ప్రియమణి) తన వంటలతో యూ ట్యూబ్ లో ఫేమస్ అవ్వాలని తెగ ప్రయత్నిస్తుంటుంది. తన కారణంగా అనుకోకుండా ఒక వ్యక్తి చనిపోతాడు. ఆ విషయం పనిమనిషి అయిన శిల్ప (శరణ్య)తెలుసుకుంటుంది. తర్వాత ఏమైంది ? అన్నదే భామాకలాపం 2. దీనిని కూడా ఆహాలోనే విడుదల చేశారు. మరి ఈ సెకండ్ పార్ట్ ఎలా ఉందో, ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో తెలుసుకుందాం.

సినిమా – భామాకలాపం -2


నటీనటులు – ప్రియమణి, సీరత్ కపూర్, చైతు జొన్నలగడ్డ, శరణ్య ప్రదీప్, సుదీప్ వేద్, అనీష్ తదితరులు

సంగీతం – ప్రశాంత్ విహారి

సినిమాటోగ్రఫీ – దీపక్

ఎడిటింగ్ – విప్లష్ నైషధ్

రచన, దర్శకత్వం – అభిమన్యు

ఓటీటీ స్ట్రీమింగ్ – ఆహా

Read More :  ఏం డ్యాన్స్ చేసింది మామా.. ఎక్కడ చూసినా ఆమె రీల్సే.. దెబ్బకు OY డైరెక్టరే ఫిదా..

కథ

అనుపమ (Priyamani) యూట్యూబ్ ఛానెల్ పెట్టి వంటలు చేస్తుంటుంది. కోల్ కతా మ్యూజియంలో రూ.200 కోట్ల విలువైన కోడిగుడ్డు మాయం కావడంతో అనుపమ కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది. ఆ ఆపద నుంచి బయటపడిన ఆ కుటుంబం.. ఇల్లు మారడంతో పార్ట్-2 మొదలవుతుంది. ముందులా.. ఇతరుల విషయాలను పట్టించుకోనని తన భర్తకు మాటిచ్చిన అనుపమ.. యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చిన ఆదాయంతో ఒక హోటల్ ను స్టార్ట్ చేస్తుంది. ఇందులో పనిమనిషి శిల్ప (Saranya)ను పార్టర్నర్ ను చేసుకుంటుంది. ఇక అంతా బాగుంటుందనుకునేలోగా.. మరో సమస్య వచ్చిపడుతుంది.

ఆ సమస్యను పరిష్కరించుకునేందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ అధికారిని సంప్రదించగా.. ఆయన తొలుత ఓకే చెప్పి.. తర్వాత రెండు ఆప్షన్లు ఇచ్చి చావోరేవో తేల్చుకోమని చెప్తాడు. ఆ అధికారి ఎందుకలా మారాడు ?సహాయం చేస్తానని చెప్పి ఎందుకు అలా చేశాడు ? రూ.1000 కోట్ల విలువైన కోడిపుంజు బొమ్మను దొంగిలించే క్రమంలో అనుపమ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంది ? ఆ కోడిపుంజు బొమ్మలో ఏముంది? భామాకలాపం-2 లో జూబేదా (సీరత్ కపూర్) పాత్ర ఏంటి ? అన్న విషయాలు తెలియాలంటే.. ఈ సినిమాను ఓటీటీలో చూసేయండి.

Read More : ఓటీటీలోకి వచ్చేసిన షారుఖ్ ‘డంకి’.. సడన్ సర్ప్రైజ్ మామూలుగా లేదు..

ఎలా ఉంది ?

ఇటీవల కాలంలో వచ్చే సినిమాలైనా.. సిరీస్ లు అయినా.. వాటికి సీక్వెల్స్ ఉంటున్నాయి. చిన్న చిన్న సినిమాలను కూడా రెండేసి పార్టులుగా తీస్తున్నారు. ఒకే కథను రెండు, మూడు భాగాలుగా చిత్రీకరించడం ఒక ట్రెండ్ అయితే.. టైటిల్ ఒకటే పెట్టి కథల్ని మార్చడం మరొక ట్రెండ్. రెండో ట్రెండ్ కు చెందినదే భామాకలాపం. తొలి భాగం స్టోరీని కోడిగుడ్డు చుట్టూ అల్లిన డైరెక్టర్.. రెండో భాగంగా కోడిపుంజు బొమ్మ చుట్టూ కథను నడిపించాడు.

అనుపమ – శిల్ప ల కామెడీ అలరిస్తుంది. మరోవైపు జుబేదా గ్లామర్ ఆకట్టుకుంటుంది. కానీ.. అక్కడక్కడా కొన్ని సీన్స్ ల్యాగ్ చేశారేమో అన్నట్లుగా ఉంటుంది. అనుపమ యాక్సిడెంట్ చేయడంతో కథ మలుపు తిరుగుతుంది. విలన్ క్యారెక్టర్, ఎన్సీబీ అధికారులు, ఇటలీలో ఉండే ఆంటోనో లోబో, కోడిపుంజు బొమ్మను అమ్మేందుకు స్మగ్లర్లతో డీలింగ్ చేయడం.. వంటి అంశాలు తెరపైకి వచ్చే కొద్దీ.. తర్వాత ఏం జరుగుతుందా ? అన్న ఆసక్తి ప్రేక్షకుడిలో కలిగించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.

ప్లస్ పాయింట్స్

ప్రియమణి యాక్టింగ్

అక్కడక్కడా వచ్చే ట్విస్టులు

మైనస్ పాయింట్స్

మధ్యలో ల్యాగ్ అనిపించే సీన్స్

ప్రీ క్లైమాక్స్

చివరిగా.. భామాకలాపం -2 .. ప్రియమణి వన్ విమెన్ షో

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×