EPAPER

Nayanthara: తెలివితక్కువ వారితో వాదించడం వేస్ట్‌..! ఆ వ్యక్తికి కౌంటరిచ్చిన నయనతార.. పోస్ట్ వైరల్..

Nayanthara: తెలివితక్కువ వారితో వాదించడం వేస్ట్‌..! ఆ వ్యక్తికి కౌంటరిచ్చిన నయనతార.. పోస్ట్ వైరల్..

Nayanthara latest controversy(Celebrity news today): సలహాలు ఇచ్చామంటే.. నలుగురు మెచ్చుకోవాలి. లేదా ఎవరైనా అడిగినప్పుడు సలహాలు ఇవ్వాలి. అంతేకాని అసలు పని మానేసి.. అంతంత మాత్రం జ్ఞానంతోటి సగం తెలిసి.. తెలియక సలహాలు ఇచ్చామంటే మొదటికే మోసం వస్తుంది అంటారు. ఇప్పుడు సమంత, నయనతార విషయంలో కూడా అదే జరిగింది. ఈ మధ్యనే సమంత.. నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి పీల్చడంవల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయని ఓ పోస్ట్ పెట్టింది. దీంతో సమంతపై ఫైర్ అయ్యారు ఓ డాక్టర్..


ఇప్పుడు నయనతారా విషయంలో కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రీసెంట్ గా నయనతార.. మందార పువ్వు టీ తాగి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటూ సోషల్ మీడియాలో ఇటీల  ఓ పోస్ట పెట్టింది. అయితే ఈ పోస్ట్ పై లివర్ డాక్టర్ విరుచుకుపడ్డాడు. ఆ వైద్యుడు ఎవరో కాదు.. ఈ మధ్యనే సమంతను విమర్శించిన డాక్టర్. లివర్ డాక్టర్  ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. మందార పువ్వుపై ఆమె తనకున్న 8.7 మిలియన్ల ఫాలోవర్స్ ను తప్పుదోవ పట్టిస్తుందంటూ ఫైర్ అయ్యారు. ఇటీవల సమంత తన ఫాలోవర్స్ ను తప్పుదోవ పట్టించిన దానికంటే రెండురెట్లు ఎక్కువగా నయనతారా ఆ పని చేస్తుందని మండి పడ్డారు.

మందార టీ బాగుంటుందని చెప్పి వదిలేసి ఉంటే అయిపోయేదని.. కానీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు చెప్పి మిడిమిడి జ్ఞానాన్ని జనాలకు కూడా పంచుతున్నారని ఆగ్రంహం వ్యక్తం చేశారు. మందార పువ్వు డయాబెటిస్, హైబీపీ, యాంటీ బాక్టీరియల్ అంటూ నయనతార చెబుతుందని, ఆమె చెప్పిన దానికి ప్రూఫ్ లేదని పేర్కొంటూ నయనతార పోస్ట్ పెట్టి ఆ ఫొటోలను షేర్ చేశారు. డాక్టర్ విమర్శలకు స్పందించిన నయనతారా “తెలివితక్కువ వారితో వాదించవద్దు”. ఆ విధంగా మిమ్మల్ని వారి స్థాయికి తీసుకెళ్లి ఓడిస్తారు. అని అమెరికన్ రచయిత మార్క్ ట్వైన్ సూక్తిని షేర్ చేసింది.


అయితే ఇందులో నేరుగా డాక్టర్ ని ప్రస్తావించనప్పటికి ఆయన్ని ఉద్దేశించే నయనతార ఈ వ్యాఖ్యలు చేసిందని అంటున్నారు నెటిజన్స్. కాగా నయనతార ఇటీవల మందార పువ్వు టీ అంటే చాలా ఇష్టమని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అంతే కాదు మందార పువ్వు టీ తాగితే ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుందని దీనిని ఆయుర్వేదంగా కూడా చాలా ఏళ్ల నుంచి వాడుతున్నారని తెలపింది. అందులోని యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు సంబంధిత వ్యాధులను దూరంగా ఉంటాయని, సీజనల్ ఇన్ ఫెక్షన్స్ నుంచి తగ్గించే యాంటీ బాక్టీరియల్ ఇది.. కాబట్టి ఈ టీ తాగండి.. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి అంటూ నయనతార సుదీర్ఘపోస్ట్ పెట్టింది.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×