EPAPER

Vijay Raaz: ‘హీరోగారికి నమస్కారం పెట్టలేదు అందుకే నన్ను తీసేశారు’.. ప్రముఖ నటుడి తీవ్ర ఆరోపణలు!

Vijay Raaz: ‘హీరోగారికి నమస్కారం పెట్టలేదు అందుకే నన్ను తీసేశారు’.. ప్రముఖ నటుడి తీవ్ర ఆరోపణలు!

Vijay Raaz| సినిమాల్లో ఒక నటుడి స్థానంలో మరో నటుడిని తీసుకోవడం.. డేట్లు సర్దుకాకపోవడం వల్ల సినిమా చేయలేక పోవడం జరుగుతూనే ఉంటాయి. కొన్ని సార్లు కథ విషయంలో డైరెక్టర్, హీరో మధ్య అభిప్రాయ భేదాల వల్ల సినిమాలు ఆగిపోయిన సందర్భాలున్నాయి. కానీ ఏకంగా హీరోనే తమకు అన్యాయం చేశాడని చెప్పి ఒక ప్రముఖ నటుడు ఆరోపణలు చేయడం చాలా అరుదు. అలాంటిదే ఒక ఘటన తాజాగా బాలీవుడ్ లో జరిగింది. ప్రముఖ సీనియర్ హీరో అజయ్ దేవ్ గన్ ముఖ్య పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.


గతంలో వచ్చిన సన్ ఆఫ్ సర్దార్ (తెలగులో మర్యాద రామన్న రీమేక్) కు సీక్వేల్ గా వస్తున్న ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ నటుడు విజయ్ రాజ్ ని సినిమా నుంచి నిర్మాతలు తప్పించారనే బాలీవుడ్ మీడియా కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో మీడియా కారణం తెలుసుకునేందుకు విజయ్ రాజ్ ను సంప్రదించింది.

ఈ వార్తలపై నటుడు విజయ్ రాజ్ స్పందిస్తూ.. ”ఇది నిజమే. నేనిక ఆ సినిమాలో నటించడం లేదు. సినిమా షూటింగ్ లండన్ లో జరుగుతున్నప్పుడు నేను లొకేషన్ కు ముందుగానే వెళ్లాను. అయితే నేను మిగతా స్నేహితులతో మాట్లాడుతున్న సమయంలో సినిమా హీరో అజయ్ దేవ్ గన్ వచ్చారు. కానీ నేను నా స్నేహితులతోనే మాట్లాడుతూనే ఉన్నాను. అజయ్ బిజీగా బిజీగా ఉన్నట్లు అనిపించడంతో నేను ఆయనకు నమస్కారం చేయలేదు. అరగంట తరువాత సినిమా నిర్మాత నా దగ్గరకు వచ్చి ‘మిమల్ని సినిమా నుంచి తీసేస్తున్నాం. మీ బిహేవియర్ సరిగా లేదు. మీరు వెళ్లవచ్చు’ అని చెప్పాడు. నా బిహేవియర్ బాగా లేదని చెప్పడానికి వాళ్ల దగ్గర ఉన్న ఒకే ఒక కారణం. నేను హీరోగారికి నమస్కారం చేయకపోవడం మాత్రమే. పైగా నాకు ఒక చిన్న హోటల్ రూమ్ ఇచ్చారు.” అని విజయ్ రాజ్ వివరించారు.


మరోవైపు ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ సహనిర్మాతగా వ్యవహరిస్తున్న కుమార్ మంగత్ పాఠక్ మాట్లాడుతూ విజయ్ రాజ్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. ”విజయ్ రాజ్ ను సినిమా నుంచి తొలగించింది. ఆయన బిహేవియర్ సరిగా లేకపోవడంతోనే. లండన్ లో హోటళ్ల ఖర్చు చాలా ఎక్కువ. ఆయనకు పెద్ద పెద్ద రూమ్ లు కావాలని, వ్యానిటీ వ్యాన్ కావాలని డిమాండ్లు చేశాడు. ఒక్కో స్పాట్ బాయ్ కు ఒక రాత్రి రూ.20 వేలు చెల్లించాలని అడిగాడు. అంత డబ్బు పెద్ద పెద్ద యాక్టర్లకు మాత్రమే ఇస్తారు. ఆయనకు లండన్ లో చాలా ఖర్చు అవుతుందని వివరించినా. విజయ్ రాజ్ మాట వినలేదు. కానీ ఆయన అందుకు అంగీకరించలేదు. పైగా ఆయనని మేము కోరి తెచ్చుకున్నామని దురుసుగా మాట్లాడాడు. అంతచెప్పినా తన ముగ్గురి స్టాఫ్ తో పాటు తనకోసం రెండు కార్లు ఏర్పాటు చేయమని అడిగాడు. ఆయన డిమాండ్లు తీర్చేలేక, ఆయన వ్యవహారం నచ్చక విజయ్ రాజ్ ని తొలగించాల్సి వచ్చింది,” అని చెప్పారు.

‘సన్ ఆఫ్ సర్దార్ 2’ సినిమాలో ముఖ్యపాత్రల్లో అజయ్ దేవ్ గన్, మృణాల్ ఠాకుర్, చంకీ పాండీ, దీపక్ డోబ్రియాల్ నటిస్తున్నారు.

Also Read: ప్రీతి జింటాను ప్రిగ్నెంట్ చేస్తానంటూ షారుఖ్ వ్యాఖ్యలు.. తర్వాత ఏం జరిగింది?

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×