EPAPER
Kirrak Couples Episode 1

Srikanth About Varasudu Movie : ‘వారసుడు’ పండగలాంటి సినిమా – శ్రీకాంత్

Srikanth About Varasudu Movie : ‘వారసుడు’ పండగలాంటి సినిమా – శ్రీకాంత్
actor srikanth about varasudu movie

Srikanth About Varasudu Movie: దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం వార‌సుడు (త‌మిళంలో వారిసు). సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న సినిమా రిలీజ్ అవుతుంది. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్, పివిపి బ్యాన‌ర్స్‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌. హీరో శ్రీకాంత్ ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఆయ‌న మీడియాతో వార‌సుడు సినిమా గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలియ‌జేశారు.


విజయ్ ‘వారసుడు’ సినిమాతో మీ జర్నీ ఎలా మొదలైయింది ? సినిమా ఎలా వుండబోతుంది ?

నా కెరీర్‌లో తమిళ్ సినిమా చేయడం ఇదే తొలిసారి. దర్శకుడు వంశీ పైడిపల్లి వారసుడు కథ చెప్పారు. ఇందులో విజయ్ కి బ్రదర్‌గా కనిపిస్తా. చాలా కీలకమైన పాత్ర ఇది. ‘వారసుడు’ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌. అద్భుతమైన హ్యుమన్ ఎమోషన్స్ వుంటాయి. విజువల్స్ అద్భుతంగా వుంటాయి. తెలుగు, తమిళ్ రెండు భాషల్లో చేసినప్పటికీ ఇది పక్కా తెలుగు సినిమాలానే వుంటుంది. రష్మిక, జయసుధ గారు , నేను, కిక్ శ్యామ్ , శరత్ కుమార్, సంగీత, ప్రభు.. ఇలా అందరం తెలుగులో సినిమాలు చేసిన వారే వుండటంతో ఇది పూర్తి తెలుగు నేటివిటీ వున్న సినిమాలానే వుంటుంది.


*మీది పాజిటివ్ క్యారెక్టరా ? నెగిటివ్‌గా ఉంటుందా?

బ్రదర్స్ మధ్య జరిగే ఎమోషన్స్ ఇందులో వుంటాయి. బ్రదర్స్ మధ్య ఎలాంటి పరిస్థితులు ఉంటాయో …అన్నీ చక్కగా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌లా ఉంటుంది. వంశీ పైడిపల్లి సినిమాల్లో గ్రేట్ ఎమోషన్స్ వుంటాయి. ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. విజయ్‌కి అద్భుతమైన క్రేజ్ ఉంది. వుంది. ఈ మధ్య కాలంలో ఆయన కూడా ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ చేయలేదు. దర్శకుడు వంశీ పైడిపల్లి అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా వారసుడు సినిమాని తెరకెక్కించారు. ఇందులో నా పాత్ర మొదటి నుండి చివరి వరకూ వుంటుంది. విజయ్ లాంటి స్టార్ హీరోతో.. ఒక మంచి సినిమాతో తమిళంలో అడుగుపెట్టినందుకు చాలా ఆనందంగా వుంది.

విజయ్‌లో ఎలాంటి ప్రత్యేకతలు గమనించారు ?

ఇంతకుముందు కొన్ని వేడుకల్లో కలిశాను. కలిసి పని చేయడం ఇదే తొలిసారి. విజయ్ చాలా సైలెంట్‌గా ఉంటారు. ఎక్కువగా మాట్లాడరు. క్యారీవాన్ వాడరు. సెల్ ఫోన్ దగ్గర వుండదు. ఒకసారి సెట్‌లో అడుగు పెడితే ప్యాకప్ చెప్పినంత వరకూ అక్కడ నుండి కదలరు. చాలా అంకితభావంతో పని చేస్తారు.

‘వారసుడు’ సంక్రాంతి కి వచ్చే సినిమాలకి పోటీ అంటున్నారు ?

ఇప్పుడు సినిమాలన్నీ పాన్ ఇండియాలా అయిపోయాయి. మన తెలుగు సినిమాలు కూడా అక్కడ హిట్లు కొడుతున్నాయి. సంక్రాంతి సినిమాల పండగ కూడా. అన్ని సినిమాలని ప్రేక్షకులు ఆదరిస్తారు. వారసుడు ఫ్యామిలీ ఎంటర్ టైనర్. పండగకి పండగ లాంటి సినిమా.

డైరెక్టర్ వంశీ పైడిపల్లి తో పని చేయడం ఎలా అనిపించింది

వంశీ పైడిపల్లి చాలా క్లారిటీ వున్న దర్శకుడు. ఫిలిం మేకింగ్‌లో చాలా పెర్ఫెక్షన్ వుంటుంది. ఎక్కడా రాజీపడకుండా తీస్తారు.

నిర్మాత దిల్ రాజుతో పని చేయడం ఎలా అనిపించింది ?

ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో వున్నప్పటికీ దిల్ రాజు గారి ప్రొడక్షన్‌లో చేయడం ఇదే తొలిసారి. అలాగే శంకర్‌గారి సినిమాలో కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను.

అఖండ లో విలన్ గా చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీ రోల్ చేస్తున్నారు కదా.. ?

అఖండ తర్వాత డిఫరెంట్ గా వుండాలని ఈ పాత్ర చేశాను. అలాగే శంకర్ రామ్ చరణ్ సినిమా చేస్తున్నాను. అందులో మరో డిఫరెంట్ క్యారెక్టర్. డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలనే ఆలోచన వుంది. కథ, క్యారెక్టర్ నచ్చితే ఖచ్చితంగా చేస్తాను.

సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ?

సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అన్నీ సినిమాలు బాగా ఆడాలి. అదే హ్యాపీ సంక్రాంతి.

Tags

Related News

FNCC President: బయటికొచ్చిన ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ఎన్నికల ఫలితాలు.. భారీ మెజారిటీతో గెలిచిన సీనియర్ నిర్మాత

Jani Master: దానివల్లే దీనిగురించి మాట్లాడలేను.. జానీ మాస్టర్ కేసుపై ఎట్టకేలకు నోరువిప్పిన మంచు విష్ణు

Devara: ఆదివారం అయినా అందుకోవడం లేదు.. తారక్‌కు ఇది తప్పదా..

Kamal Haasan: ప్యాన్ ఇండియా మల్టీ స్టారర్‌కు రూట్ క్లియర్.. కమల్ హాసన్‌తో ఆ బాలీవుడ్ స్టార్ హీరో సినిమా

Jr NTR: పొలిటికల్ ఎంట్రీ పై తారక్ కామెంట్… మళ్లీ హీట్ పెంచాడు..

Ram Charan: మెగా కుటుంబంలో ఆనందమే ఆనందం.. మొన్న చిరు.. నేడు చెర్రీకి అరుదైన గౌరవం

Arshad Warsi: అప్పుడలా ఇప్పుడలా.. ప్రభాస్‌ విషయంలో ప్లేట్ మార్చిన బాలీవుడ్ నటుడు

Big Stories

×