Big Stories

Ram Charan: మా నాన్న జోలికి వస్తే ఊరుకోను: రామ్ చరణ్

Ram Charan: ‘‘చిరంజీవి మౌనంగా, సౌమ్యంగా ఉంటారని అందరికీ తెలుసు. అదే ఆయన మౌనం వీడి మాట్లాడితే ఏం అవుద్దో ఎవరికీ తెలియదు. గుర్తుపెట్టుకోండి’’ అంటూ రామ్‌చరణ్ వార్నింగ్ ఇవ్వడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కె.బాబీ ద్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. శృతిహాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో మాస్‌మహారాజ రవితేజ ప్రత్యేక పాత్రలో నటించారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను కూడా భారీగానే వసూల్ చేసింది. ఈ సందర్భంగా చిత్రబృందం హనుమకొండలో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు హీరో రామ్‌చరణ్ అతిథిగా హాజరయ్యారు.

- Advertisement -

ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘‘వాల్తేరు వీరయ్య సినిమా అభిమానులందరికీ పూనకాలు తెప్పించింది. రోల్‌రైడా పూనకాలు లోడింగ్ సాంగ్‌తో అభిమానులకు నిజంగానే పూనకాలు తెప్పించాడు. డైరెక్టర్ బాబి మా నాన్నగారిని నాకు నాన్నలా కాకుండా అన్నలా చూపించారు. రవితేజ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే పాటలు ఇచ్చారు. ఈ సినిమా ఈవెంట్‌కు నేను గెస్ట్‌గా రాలేదు అభిమానిగా వచ్చాను. సినిమాను ఎంతగా ఎంజాయ్ చేశానో చెప్పేందుకు వచ్చాను. చిరంజీవిని ఏమైనా అనగలిగే హక్కు కేవలం అభిమానులకు ఫ్యామిలీకి మాత్రమే ఉంది. ఆయన మౌనంగా, సౌమ్యంగా ఉంటారని అందరికీ తెలుసు. ఆయన సైలెంట్‌గా ఉంటేనే ఇలా ఉంది. అదే ఆయన మౌనం వీడి, మాట్లాడితే ఏం అవుద్దో ఎవరికీ తెలియదు. గుర్తుపెట్టుకోండి.. ఆయన సైలెంట్‌గా ఉంటారేమోకాని ఫ్యాన్స్‌గా మేము ఉండం. ఆయన్ను ఏమైనా అంటే ఊరుకునేదే లేదు’’ అని అన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News