EPAPER

Bhale Unnade Movie Review: `భలే ఉన్నాడే` మూవీ రివ్యూ: ఇంతకీ సినిమాలో ఎలా ఉన్నాడు? రాజ్ తరుణ్‌కు హిట్ పడినట్లేనా?

Bhale Unnade Movie Review: `భలే ఉన్నాడే` మూవీ రివ్యూ: ఇంతకీ సినిమాలో ఎలా ఉన్నాడు? రాజ్ తరుణ్‌కు హిట్ పడినట్లేనా?

రాజ్‌ తరుణ్, మనీషా కంద్కూర్ జంటగా నటించిన తాజా చిత్రం ‘భలే ఉన్నాడే’.  శివసాయి వర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో , అభిరామి, సింగీతం శ్రీనివాస్, హైపర్ ఆది, సుదర్శన్, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్ సహా పలువురు కీలక పాత్రలు పోషించారు.


శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమాకు.. నగేష్ బానెల్లా సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. రవి కిరణ్ ఆర్ట్స్ బ్యానర్ లో ఎన్ వి కిరణ్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం  ఇవాళ(సెప్టెంబర్ 13న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకీ ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

యంగ్ హీరో రాజ్ తరుణ్ గత కొంతకాలంగా సినిమాల కంటే వివాదాలతోనే వార్తల్లో నిలుస్తున్నాడు. లావణ్య అనే అమ్మాయి సంచలన ఆరోపణలు చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కేసులు, కోర్టులు అంటూ పెద్ద వ్యవహారమే నడించింది.


ఈ వివాదాల నడుమ తను రీసెంట్ గా నటించిన ‘పురుషోత్తముడు’, ‘తిరగబడరసామి’ సినిమాలు డిజాస్టర్లుగా మిగిలాయి. మంచి హిట్టు కోసం ఎదురుచూస్తున్న రాజ్ తరుణ్  ‘భలే ఉన్నాడే’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎలా ఉంది? రాజ్ తరుణ్ ఖాతాలో హిట్ పడిందా? సో.. సో.. అనిపించిందా? అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

భలే ఉన్నాడే సినిమాకు బిగ్ టీవీ రేటింగ్: 2/5

Also Read: ఫుల్ రివ్యూ.. ‘మత్తు వదలరా 2’ మత్తు వదలించిందా? జోకొట్టించిందా?

సినిమా కథ ఏంటంటే?

రాధ (రాజ్ తరుణ్) విశాఖపట్నంలో శారీ డ్రేపర్ గా పని చేస్తుంటాడు. అంటే, చీరలు కట్టుకోవడం రాని వారికి చీరల కడుతాడు. అతడి తల్లి గౌరి(అభిరామి) బ్యాంకు ఉద్యోగిగా పని చేస్తుంటుంది. రాధ చాలా మంచి అబ్బాయి. ఎవరి జోలికి పోకుండా తన పని తాను చేసుకుంటాడు.

ఇంటి పనుల్లో తల్లికి హెల్ఫ్ చేస్తుంటాడు. వంటలు కూడా చేస్తాడు. తన తల్లి పని చేసే బ్యాంకులో కృష్ణ(మనీషా)అనే అమ్మాయి ఉద్యోగంలో చేరుతుంది.  కృష్ణ చాలా మోడ్రన్ అమ్మాయి. గౌరితో కొద్ది రోజుల్లోనే మంచి స్నేహం ఏర్పడుతుంది. ఆమె తెచ్చుకునే లంచ్ బాక్స్ కూడా తనే తినేది. వంటలు ఎవరు చేస్తారని గౌరిని అడిగితే మా అబ్బాయి రాధ చేస్తాడని చెప్తుంది.

అబ్బాయిని చూడకుండా, కేవలం వంట రుచి చూసి కృష్ణ రాధను ఇష్టపడుతుంది. లంచ్ బాక్సులలో లెటర్స్ పంపుకుంటూ ఒకరికొకరు దగ్గర అవుతారు. చివరకు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. ఓసారి కృష్ణ రాధతో చాలా చనువుగా దగ్గరైనా అతడు దూరం పెడతాడు.

అదే సమయంలో ఎంగేజ్మెంట్ వేడుకలో రాధ అమ్మాయిలకు దూరంగా ఉంటాడని కృష్ణ ఫ్రెండ్ చెప్పడంతో ఆమెలో లేని అనుమానాలు కలుగుతాయి. అతడికి లైంగిక పరీక్షలు చేయించాలని భావిస్తుంది. ఇంతకీ రాధ అమ్మాయిలకు ఎందుకు దూరంగా ఉంటాడు? అతడికి ఏమైనా ప్రాబ్లం ఉందా? ఇంతకీ రాధ, కృష్ణ పెళ్లి జరిగిందా? లేదా? అనేది సినిమాలో చూడాల్సిందే!

సినిమా ఎలా ఉందంటే?

సమాజంలో మంచి తనాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితులు ఉన్నాయని ఈ సినిమాలో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఎవరి జోలికి పోకుండా తన పని తాను చేసుకుపోతున్నా లేని అభండాలు వేస్తారని చూపించాడు. ఈ సినిమా స్టోరీ లైన్ బాగున్నా, ఆకట్టుకునేలా చెప్పడంలో దర్శకుడు సక్సెస్ కాలేకపోయాడని చెప్పుకోవచ్చు.

సినిమా ఫస్ట్ హాఫ్ లవ్, కామెడీతో ఫర్వాలేదు అనిపించింది. స్టోరీలోకి వెళ్లేందుకు చాలా సమయం పట్టింది. అంతేకాదు, అసలు కథ మొదలయ్యాక స్టోరీ లైట్ గా మారింది. క్లైమాక్స్ సన్నివేశాలు కూడా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. కామెడీతో పాటు ఎమోషన్స్ తో సినిమాను బ్యాలెన్స్ చేసే అవకాశం ఉన్నా దర్శకుడు సక్సెస్ కాలేకపోయాడు.

నటీనటులు ఎలా చేశారంటే?

ఎప్పటిలాగే రాధ పాత్రలో రాజ్ తరుణ్ ఒదిగిపోయి నటించాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో ఇంకా బాగా చేసే అవకాశం ఉన్నా చేయలేకపోయాడు. కృష్ణ తన క్యారెక్టర్ కు తగినట్టుగానే అందంగా, యాక్టివ్ గా కనిపించింది. రాజ్ తరుణ్ తల్లి గౌరి క్యారెక్టర్ లో అభిరామి అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో సింగీతం శ్రీనివాస్ క్యారెక్టర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

హైపర్ ఆది, సుదర్శన్ కామెడీ ఫర్వాలేదు అనిపించింది. గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక టెక్నికల్ గా చూస్తే, శేఖర్ చంద్ర సంగీత పెద్దగా వర్కౌట్ కాలేదు. పాటలు ఫర్వాలేదు అనిపించాయి. నగేష్ కెమెరాతో ఆకట్టుకున్నాడు. ఎడిటింగ్ కూడా ఇంకా ఇంఫ్రూవ్ చేసే అవకాశం ఉంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

రాజ్ తరుణ్ కు ఎదురు చూపులు తప్పవు!

గత కొంతకాలంగా నెలకో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న రాజ్ తరుణ్ కు.. గత రెండు సినిమాలతో పోల్చితే ఈ సినిమా ఫర్వాలేదు అనిపించింది. అయితే, సాలిడ్ హిట్ కోసం మరో మూవీ కోసం వెయిట్ చేయక తప్పదు.

 

Related News

Naga Chaitanya: టాటూపై దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన చైతూ.. సమంత గుర్తుకొస్తోంది అంటూ..?

Ram Charan : ఏంటయ్యా బుచ్చిబాబు.. మా చరణ్ ను ఏం చెయ్యాలనుకుంటున్నావ్..

Devara : ఎక్కడో కొడుతుంది శీనా… ఒక్కో లాంగ్వేజ్ కి మరీ ఇంత టైం మా..?

Jr NTR : డైరెక్టర్ సార్ ఒక్క ఛాన్స్ ప్లీజ్…‌ తారక్ ఈ పద్దతి ఇక మార్చుకోవా…?

Teja: డైరెక్టర్ తేజ కుమారుడు ఎంట్రీ కు సర్వం సిద్ధం, మొదటిసారి సైన్స్ ఫిక్షన్ జోనర్

Tammareddy Bharadwaj: త్రివిక్రమ్ పై పూనమ్ ఫిర్యాదు.. మేము ఏం చేయలేం

Singer Mano: సింగర్ మనో కొడుకులపై కేసు.. షాకింగ్ నిజాలు వెలుగులోకి

Big Stories

×