Joju George: ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రాకముందే దాని మీద రివ్యూలు ఇచ్చేస్తున్నారు రివ్యూవర్లు. దానివల్ల సినిమా రిజల్ట్‌పై భారీ ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి. అందుకే రివ్యూవర్లు అంటే నటీనటులకు నచ్చడం లేదు. చాలాసార్లు ఓపెన్‌గానే వీరిపై ఫైర్ అవుతున్నారు. అయినా కూడా రివ్యూవర్లు తమ పద్ధతిని మార్చుకోవడం లేదు. అలాగే తను నటించి, డైరెక్ట్ చేసిన మూవీకి నెగిటివ్ రివ్యూ ఇచ్చాడనే కోపంతో ఒక రివ్యూవర్‌ను బెదిరించడానికి సిద్ధపడ్డాడు ఒక మాలీవుడ్ స్టార్ హీరో. ఈ విషయాన్ని ఆ రివ్యూవర్ స్వయంగా బయటపెట్టగా అది నిజమే అని హీరో కూడా ఒప్పుకున్నాడు. అతడు మరెవరో కాదు.. మాలీవుడ్ స్టార్ జోజూ జార్జ్.
తొలిసారి దర్శకుడిగా
ఎన్నో ఏళ్లుగా మలయాళంలో హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. ఇలా ఎన్నో విధాలుగా ప్రేక్షకులను అలరించారు జోజూ జార్జ్ (Joju George). ఆయన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఇక ఇన్నేళ్లుగా తెరపై ఎన్నో వివిధ పాత్రల్లో నటించి అలరించిన ఈ నటుడు.. తొలిసారి దర్శకుడిగా మైక్రోఫోన్ పట్టుకున్నాడు. ‘పని’ (Pani) అనే థ్రిల్లర్‌ను డైరెక్ట్ చేయడమే కాకుండా.. అందులో తనే లీడ్ రోల్‌లో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇటీవల థియేటర్లలో విడుదలయిన ఈ సినిమా.. ఆడియన్స్‌ను అలరిస్తూ ముందుకెళ్తోంది. అయితే దీనిపై నెగిటివ్ రివ్యూ ఇవ్వడంతో జోజూ జార్జ్ తనను బెదిరించాడని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఒక రివ్యూవర్.
Also Read: పెళ్లికి సిద్ధమవుతున్న ‘పుష్ప’ నటుడు.. ఎంగేజ్మెంట్ ఫొటోస్ వైరల్..!
నేనేం భయపడను
ఆదర్శ్ అనే ఒక రివ్యూవర్.. తన ఫేస్‌బుక్‌లో ఒక వాయిస్ క్లిప్ పోస్ట్ చేశాడు. అందులో జోజూ జార్జ్ తనను బెదిరించాడని ఆరోపించాడు. ‘‘జోజూ జార్జ్ డైరెక్ట్ చేసిన సినిమాలోని రేప్ సీన్ గురించి నేనొక రివ్యూ పోస్ట్ చేశాను. అందుకే ఆయన నాకు ఫోన్ చేసి ఎదురుగా వచ్చి నిలబడే దమ్ముందా అని అడిగారు. ఆయన ముందు భయపడే ఎంతోమందిని జోజూ చూసుంటారు. కానీ నేను అలాంటి వాడిని కాదు. ఇలాంటి బెదిరింపులు ఇంకెవ్వరికీ ఇవ్వకూడదు అనే కారణంతోనే నేను ఈ వాయిస్ క్లిప్ షేర్ చేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చాడు ఆదర్శ్. అయితే ఈ ఆరోపణలపై జోజూ జార్జ్.. సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
ప్రేక్షకులను చూడనివ్వండి
‘స్పాయిలర్స్ ఇవ్వడం ఆపేయండి. అనవసరంగా ఒక మూవీని తక్కువ చేయడం మంచి పని కాదు. ప్రేక్షకులే సినిమాను చూసి వారికి నచ్చిన రివ్యూ ఇవ్వనివ్వండి. అనవసరంగా ద్వేషాన్ని పెంచొద్దు’’ అని చెప్తూ ఒక వీడియో విడుదల చేశారు జోజూ జార్జ్. దీన్ని బట్టి చూస్తే ఆయన నిజంగానే రివ్యూవర్‌ను బెదిరించినట్టుగా ఇన్‌డైరెక్ట్‌గా ఒప్పుకున్నారా అని ప్రేక్షకుల్లో అనుమానం మొదలయ్యింది. అయినా రివ్యూవర్లకు అలా చేయడమే కరెక్ట్ అని కొందరు భావిస్తున్నారు. ఈమధ్య కాలంలో రివ్యూల వల్ల చాలా సినిమాలు నష్టాల్లోకి వెళ్లిపోయాయి. ప్రేక్షకులకు నచ్చే వీలు ఉన్న చిత్రాలు కూడా నెగిటివ్ రివ్యూల వల్లే ఎఫెక్ట్ అవుతున్నాయని మూవీ లవర్స్ అంటున్నారు.