EPAPER

Sankarabharanam : శంకరాభరణంతో కొత్త చరిత్ర.. ఆ సినిమా విడుదలైన రోజే దివికేగిన కళాతపస్వి..

Sankarabharanam : శంకరాభరణంతో కొత్త చరిత్ర.. ఆ సినిమా విడుదలైన రోజే దివికేగిన కళాతపస్వి..

Sankarabharanam : శంకరాభరణం సినిమా.. కె. విశ్వనాథ్ కెరీర్ లో గొప్ప చిత్రంగా మిగిలిపోయింది. 1980 ఫిబ్రవరి 2న విడుదలైన ఈ చిత్రం తెలుగు చిత్రపరిశ్రమలో సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో స్టార్ హీరోలు లేరు. సోమయాజులుని శంకరశాస్త్రి పాత్ర కోసం తీసుకున్నారు. ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన మంజుభార్గవి కూడా అప్పటికి పేరున్న నటికాదు. సినిమా విడుదలైన తొలిరోజు ప్లాప్ టాక్ వచ్చింది. కానీ ఆ తర్వాత ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాను విపరీతంగా ఆదరించారు. శంకరాభరణం సినిమా కె. విశ్వనాథ్ ను మరోస్థాయిలో నిలబెట్టింది. ఈ సినిమా తర్వాతే ఆయన పేరు ముందు కళాతపస్వి వచ్చి చేరింది.


శంకరాభరణం’ సినిమాను కొనడానికి ఎవరూ ముందుకురాలేదు. దీంతో నిర్మాత ఏడిద నాగేశ్వరరావు డీలా పడిపోయారు. జనంలోకి వెళ్తే ఆదరణ లభిస్తుందని నమ్మకంతో విశ్వనాథ్ ఉన్నారు. ఎన్నో ప్రయత్నాలు చేసి చేసి ఏడిద నాగేశ్వరరావు ఎంతకో కొంతకి నష్టానికే కొన్ని జిల్లాలకు అమ్మేశారు. కొన్ని జిల్లాలు అమ్ముడు పోలేదు. అలా సినిమా విడుదలైంది.

శంకరాభరణం సినిమాకు ఓపెనింగ్స్ రాలేదు. మొదటివారం థియేటర్లు వెలవెల బోయాయి. చూసిన కొద్దిమంది మాత్రం బాగుంది అనేవారు. వారం గడిచేసరికి మౌత్ టాక్ ఈ సినిమాకు క్రమంగా హిట్ టాక్ ను తెచ్చింది. రెండో వారం నుంచి ఊపందుకుంది. ప్రేక్షకులు రెండోసారీ, మూడోసారి చూడటం మొదలుపెట్టారు. మూడో వారంలో బ్లాక్‌లో టిక్కెట్లు కొని మరీ చూశారు.


సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో ఎక్కడ చూసినా ‘శంకరాభరణం’ పాటలే వినిపించాయి. తమిళ, కన్నడ భాషల్లో కూడా బాగా ఆడింది. మలయాళంలో మాటలు డబ్‌ చేసి పాటలను తెలుగులోనే ఉంచి విడుదల చేశారు. అక్కడా సూపర్ హిట్ అయ్యింది. సినిమా తొలుత అమ్ముడుపోని జిల్లాల ద్వారా నిర్మాతకు కలెక్షన్ల పంట పండింది. థియేటర్‌కు వెళ్లిన ప్రతిసారి గుడికి వెళ్లిన భావన కలుగుతోందని ప్రేక్షకులు ఫీలయ్యారు. చాలా మంది చెప్పులు విడిచి మరీ ‘శంకరాభరణం’ చూశారంటే అతిశయోక్తికాదు. ఇలా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గొప్ప చిత్రంగా శంకరాభరణం నిలిచిపోయింది.

శంకరాభరణం విడుదలైన రోజే..
కె. విశ్వనాథ్ సినిమాల్లో ‘శంకరాభరణం’ అపురూప దృశ్యకావ్యంగా మిగిలిపోయింది. ఆ సినిమా 1980 ఫిబ్రవరి 2న విడుదలైంది. సరిగ్గా అదేరోజు కళాతపస్వి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

Related News

Ritika Singh: వెంకటేష్ హీరోయిన్ కూడా ఈ రేంజ్ గా చూపిస్తే.. కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే

Devara: కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలంటే ఇదేనేమో.. ఇదెక్కడి అరాచకంరా బాబు

Mirnalini Ravi: ఎట్టకేలకు ఒక ఇంటిదైన హాట్ బ్యూటీ.. తల్లిదండ్రులతో కలిసి..

Akkineni Family: అక్కినేని ఫ్యామిలీ ఫోటోలో ఆ స్టార్ హీరోయిన్ కూతురు.. ఎందుకు ఉన్నట్టు.. ?

Niharika Konidela: ఇంట గెలవలేక రచ్చ గెలవడానికి రెడీ అయిన మెగా డాటర్

Jani Master Case : కాపాడిన కల్తీ లడ్డూ… కొరియోగ్రాఫర్ జానీ సేఫ్..

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Big Stories

×