EPAPER

Miss World 2024 Winner: ప్రపంచ అందాల సుందరిగా క్రిస్టినా పిస్కోవా.. భారత్ నుంచి ఎవరు పాల్గొన్నారంటే..?

Miss World 2024 Winner: ప్రపంచ అందాల సుందరిగా క్రిస్టినా పిస్కోవా.. భారత్ నుంచి ఎవరు పాల్గొన్నారంటే..?


Miss World 2024: ప్రతి ఏడాది మిస్ వరల్డ్ పోటీలు జరుగుతుంటాయి. అయితే ఈ పోటీలు వేర్వేరు దేశాల్లో ఏర్పాటు చేస్తుంటారు. గత సంవత్సరం ఈ మిస్ వరల్డ్ పోటీలకు ప్యూర్టోరికో ఆతిథ్యాన్ని ఇచ్చింది. మిస్ వరల్డ్ 2022 పోటీల్లో పోలెండ్ సుందరి కరోలినా బిలావ్క్సా విజేతగా నిలిచారు.

అయితే ఈ సారి ఈ మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యాన్ని ఇచ్చింది. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం రాత్రి ఈ మిస్ వరల్డ్ పోటీలు అట్టహాసంగా జరిగాయి. ఎంతో కలర్‌ఫుల్‌గా సాగిన ఈ మిస్ వరల్డ్ 2024 ఫైనల్‌ పోటీల్లో చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవా 71వ మిస్ వరల్డ్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఈ కిరీటాన్ని ప్రస్తుత ప్రపంచ సుందరి కరోలినా బిలావ్క్సా.. క్రిస్టినా పిస్కోవాకు ధరింపచేశారు.


వరల్డ్ వైడ్‌గా మొత్తం 112 దేశాలకు చెందిన అందాల తారలు ఈ పోటీలో పాల్గొన్నారు. అందులో టాప్ 4లో క్రిస్టినా పిస్కోవా (చెక్ రిపబ్లిక్), యాస్మిన్ అజైటౌన్ (లెబనాన్), అచే అబ్రహాంస్ (ట్రినిడాడ్ అండ్ టుబాగో), లిసాగో చోంబో (బోట్స్వానా) వంటి తారలు నిలిచారు. ఇక ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ పోటీల్లో ఆఖరికి చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవా ఈ మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఇక లెబనాన్‌కు చెందిన యాస్మిన్ అజైటౌన్ రన్నరప్‌గా నిలిచారు.

READ MORE: పబ్‌లో సాయి పల్లవి.. మాస్ స్టెప్పులతో ఇరగదీసేసింది.. వీడియో వైరల్

అయితే ఈ పోటీలో ఈ సారి భారత్‌కు నిరాశే ఎదురైంది. ఇండియా నుంచి ప్రాతినిథ్యం వహించిన కన్నడ బ్యూటీ సినీశెట్టి టాప్-8 స్థానాన్ని దక్కించుకున్నారు. ఇకపోతే సినీ శెట్టి ఇతర దేశాల అందాల తారలకు గట్టీ పోటీ ఇచ్చిందనే చెప్పాలి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నీతా అంబానీ విచ్చేశారు. ఈ మేరకు నీతా అంబానీ.. మిస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డును అందుకున్నారు. కాగా మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్ ఉమెన్ జూలియా మోర్లీ ఈ మిస్ వరల్డ్ అవార్డును ప్రదానం చేశారు.

సాజిద్ నడియాడ్‌వాలా, పూజా హెగ్డే, జూలియా మోర్లీ, కృతి సనన్, హర్భజన్ సింగ్, అమృత ఫడ్నవిస్,రజత్ శర్మ, వినీత్ జైన్, జమీల్ సైది ఈ ప్యానెల్‌లో ఉన్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, మేగాన్ యంగ్ ఈ వేడుకను హోస్ట్ చేశారు. కాగా ఈ అందాల తారల పోటీలకు భారత్ 27 ఏళ్ళ తర్వాత వేదికగా మారింది. 1996లో మిస్ వరల్డ్ పోటీలను భారత్‌లో నిర్వహించారు.

READ MORE: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమా ట్రైలర్..

అయితే ఇప్పటివరకు భారత్ నుంచి సుమారు ఆరుమంది మిస్ వరల్డ్ టైటిల్‌ను గెలుచుకున్నారు. అందులో 1966లో రీటా ఫారియా తొలిసారిగా భారత్ తరఫున అందాల కిరీటాన్ని దక్కించుకున్నారు. 1994లో ఐశ్వర్య రాయ్ బచ్చన్, 1997లో ప్రియాంక చోప్రా, 1999లో యుక్తాముఖి, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు.

Tags

Related News

Samantha : ఫైనల్‌గా కెమెరా ముందుకు వచ్చిన సామ్… ‘కల…’ అంటూ ఎమోషనల్ పోస్ట్

Ruksana Bano: ప్రముఖ సింగర్ మృతి.. షాకింగ్‌లో ఫ్యాన్స్.. విషం ఇచ్చి హత్య!

Bollywood Actress : ఇక బాలీవుడ్ ఖాళీ… టాలీవుడ్‌పై కన్నెసిన జాన్వీ బెస్ట్ ఫ్రెండ్..

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Telugu Actress: ఎన్టీఆర్, ఏఎన్నార్ లనే ఢీ కొట్టిన నటి.. కానీ చనిపోతే మాత్రం.. !

Comedian Sapthagiri: ఇండస్ట్రీకి దూరమయ్యారా లేక దూరం పెట్టారా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Big Stories

×