EPAPER

68th Filmfare Awards South 2023: ఉత్తమ నటులుగా రామ్‌చరణ్, ఎన్టీఆర్..ఆర్ఆర్ఆర్ మూవీకి ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌

68th Filmfare Awards South 2023: ఉత్తమ నటులుగా రామ్‌చరణ్, ఎన్టీఆర్..ఆర్ఆర్ఆర్ మూవీకి ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌

68th Filmfare Awards South 2023(Latest news in tollywood): ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్-2023లో ఆర్ఆర్ఆర్ సినిమాకు అవార్డుల పంట పండింది. తాజాగా, 2023 సంవత్సరానికి గానూ 68వ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులను ప్రకటించారు. సౌత్ ఇండస్ట్రీలో నాలుగు భాషల్లో థియేటర్లలో విడుదలైన సినిమాలను పరిగణలోకి తీసుకుని అవార్డులు ప్రకటించగా..తెలుగులో బెస్ట్ ఫిల్మ్‌గా ఆర్ఆర్ఆర్ సినిమా ఎంపికైంది. ఈ సినిమాకు ఏకంగా ఏడు అవార్డులు దక్కాయి. దీంతోపాటు క్లాసిక్ హిట్ సీతారామం సినిమాకు 5 అవార్డులు, నక్సల్ నేపథ్యంలో వచ్చిన విరాటపర్వం సినిమాకు రెండు అవార్డ్స్ వచ్చాయి.


తెలుగులో ఉత్తమ సినిమాగా ఆర్ఆర్ఆర్ ఎంపికైంది. ఉత్తమ నటులుగా రామ్ చరణ్, ఎన్టీఆర్..ఉత్తమ దర్శకుడిగా ఎస్ఎస్ రాజమౌళికి అవార్డులు వరించాయి. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గానూ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ బెస్ట్ కొరియోగ్రాఫర్ పురస్కారం దక్కించుకున్నారు. ఇక, బెస్ట్ ఫిల్మ్(క్రిటిక్స్)గా సీతారామం నిలిచింది. ఇందులో ఉత్తమ నటిగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్,, బెస్ట్ యాక్టర్(క్రిటిక్స్)గా హీరో దుల్కర్ సల్మాన్‌కు వరించింది.

అలాగే, సపోర్టింగ్ రోల్ ఉత్తమ నటుడిగా రానా(బీమ్లా నాయక్), ఉత్తమ నటి(క్రిటిక్స్)గా సాయిపల్లివి(విరాటపర్వం), ఉత్తమ రచయితగా సిరివెన్నల(కానున్న కల్యాణం, సీతారామం)కి అవార్డులు వరించాయి. గతంలో ఆర్ఆర్ఆర్ సినిమాకి రిలీజ్ తర్వాత నుంచి ఇప్పటికీ ఏదో ఒక అవార్డ్ వస్తూనే ఉండడం విశేషం.


తెలుగులో 68వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్..

  • ఉత్తమ సినిమా – ఆర్ఆర్ఆర్
  • ఉత్తమ దర్శకుడు – ఎస్ఎస్ రాజమౌళి
  • ఉత్తమ మూవీ(క్రిటిక్స్) – సీతారామం
  • ఉత్తమ నటుడు – రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్(ఆర్ఆర్ఆర్)
  • ఉత్తమ నటుడు(క్రిటిక్స్) – దుల్కర్ సల్మాన్(సీతారామం)
  • ఉత్తమ నటి – మృణాల్ ఠాకూర్(సీతారామం)
  • ఉత్తమ నటి(క్రిటిక్స్) – సాయిపల్లవి(విరాటపర్వం)
  • ఉత్తమ సహాయ నటుడు – రానా దగ్గుబాటి(బీమ్లా నాయక్)
  • ఉత్తమ సహాయ నటి – నందితా దాస్(విరాటపర్వం)
  • ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ – కీరవాణి(ఆర్ఆర్ఆర్)
  • ఉత్తమ లిరిక్స్ – సిరివెన్నెల సీతారామశాస్త్రి(కానున్న కల్యాణం, సీతారామం)
  • ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్(మెన్స్) – కాల భైరవ(కొమురం భీముడో – ఆర్ఆర్ఆర్)
  • ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్(ఉమెన్స్) – చిన్మయి( ఓ ప్రేమ – సీతారామం)
  • ఉత్తమ కొరియోగ్రఫీ – ప్రేమ్ రక్షిత్(నాటునాటు – ఆర్ఆర్ఆర్)
  • ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – సాబు సిరిల్(ఆర్ఆర్ఆర్)

Tags

Related News

Ruksana Bano: ప్రముఖ సింగర్ మృతి.. షాకింగ్‌లో ఫ్యాన్స్.. విషం ఇచ్చి హత్య!

Bollywood Actress : ఇక బాలీవుడ్ ఖాళీ… టాలీవుడ్‌పై కన్నెసిన జాన్వీ బెస్ట్ ఫ్రెండ్..

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Telugu Actress: ఎన్టీఆర్, ఏఎన్నార్ లనే ఢీ కొట్టిన నటి.. కానీ చనిపోతే మాత్రం.. !

Comedian Sapthagiri: ఇండస్ట్రీకి దూరమయ్యారా లేక దూరం పెట్టారా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Pushpa 2: వార్నర్ మామ ఇండస్ట్రీ ఎంట్రీ,రీల్స్ నుంచి రియల్ సినిమాలోకి

Big Stories

×