EPAPER

20 years of ShankarDadaMBBS: రీమేక్ తో రికార్డ్స్ క్రియేట్ చేసారు

20 years of ShankarDadaMBBS: రీమేక్ తో రికార్డ్స్ క్రియేట్ చేసారు

20 years of ShankarDadaMBBS: ప్రతి స్టార్ హీరో కెరియర్లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలో ఉంటాయి. వాటిలో కొన్ని సినిమాలుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి మెసేజ్ తో పాటు ప్రాపర్ కమర్షియల్ సినిమాగా ఆ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు జయంత్.రాజ్ కుమార్ హిరానీ దర్శకుడుగా పరిచయమైన మున్నాభాయ్ ఎంబిబిఎస్ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా బాలీవుడ్ లో ఒక సంచలనం అని చెప్పాలి. ఈ సినిమా అక్కడ సంజయ్ దత్ కు మంచి కం బ్యాక్ అయింది. ప్రాపర్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఒక మంచి మెసేజ్ ను ఈ సినిమాలో పెట్టాడు దర్శకుడు.


ఒక దాదా కాలేజ్ లో జాయిన్ అయి ఎంబిబిఎస్ చదువుకుంటే ఎలా ఉంటుంది అని చూపిస్తూ వైద్య రంగంలో ఉన్న కొన్ని లోటుపాట్లను కూడా ఎత్తి చూపించాడు రాజ్ కుమార్ హిరానీ. ఇదే సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొన్ని మార్పులు చేసి రీమేక్ చేశారు. మామూలుగా రీమేక్ సినిమాలు ఒరిజినల్ కంటే కొంచెం తక్కువగా అనిపిస్తాయి. కానీ ఈ సినిమా విషయానికి వస్తే ఇది ఒక బెస్ట్ రీమేక్ సినిమా అని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే విధంగా ఈ సినిమాను రాశారు పరుచూరి బ్రదర్స్. ఈ సినిమాలోని మెగాస్టార్ చిరంజీవి టైమింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అన్ని అంశాలు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే సినిమాలు కొన్ని మాత్రమే వస్తాయి అలాంటి సినిమాలలో ఈ సినిమా కూడా ప్రథమ స్థానంలోకి వస్తుందని చెప్పాలి.

ముఖ్యంగా ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం మేజర్ ప్లస్ పాయింట్. కేవలం ఒక పాట మాత్రమే కాకుండా సినిమాలోని అన్ని పాటలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్. కొన్ని రోజులు పాటు ఈ పాటలు ఒక ఊపు ఉపాయని చెప్పాలి. ఈ సినిమా తర్వాత శంకర్ దాదా జిందాబాద్ అనే సినిమా వచ్చింది. అయితే ఆ సినిమా మాత్రం ఊహించని ఫలితాన్ని తీసుకురాలేకపోయింది. శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాకి క్రియేట్ అయిన మ్యాజిక్ జిందాబాద్ కి క్రియేట్ కాలేదు. ఇక రీసెంట్గా శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాను రీ రిలీజ్ కూడా చేశారు. అయితే ఈ సినిమాకి తెలుగు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. అలానే మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్, అలానే డాన్స్ పర్ఫామెన్స్ అన్నీ కూడా థియేటర్స్ లో రిక్రియేట్ కూడా చేశారు. ఈ సినిమా అప్పట్లోనే ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఒక రీమేక్ సినిమాతో ఇన్ని రికార్డ్స్ క్రియేట్ చేయొచ్చు అని మెగాస్టార్ చిరంజీవి ప్రూవ్ చేశారు. కొంతమంది ఒరిజినల్ కంటే కూడా ఈ సినిమా బాగుంటుంది అని ప్రశంసలు కూడా అప్పట్లో కురిపించారు. మెగాస్టార్ కెరియర్ లో ఈ సినిమాకి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. నేటికీ ఈ సినిమా విడుదలై 20 ఏళ్ళు అయింది.


Related News

Bhumika: కరీనా కపూర్ నా ఛాన్స్ లాగేసుకుంది.. భూమిక షాకింగ్ కామెంట్స్

Matthu Vadalara 2: చూసిన ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం తెలుస్తుంది ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా వేసుకున్నారు

Oviya: వీడియో లీక్ ఎఫెక్ట్.. బంఫర్ ఆఫర్ పట్టేసిన ఓవియా..

People Media Factory: ఫ్యాక్టరీ నుంచి సినిమాలు వస్తున్నాయి కానీ, లాభాలు రావట్లేదు

Puri Jagannath: పూరీ కథల వెనుక బ్యాంకాక్.. అసలు కథేంటి మాస్టారూ..?

OG : డీవీవీ దానయ్య కు విముక్తి, అభిమానులకు పండుగ

Big Stories

×