EPAPER

12th Fail Telugu OTT: ఓటీటీలోకి 12th ఫెయిల్ తెలుగు వెర్షన్.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే..?

12th Fail Telugu OTT: ఓటీటీలోకి 12th ఫెయిల్ తెలుగు వెర్షన్.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే..?


12th Fail Movie Telugu Version in OTT: 12th ఫెయిల్.. ఈ సినిమా నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన సినిమా. ఎంతోమంది హృదయాలను కదిలించిన సినిమా. విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో విక్రాంత్ మస్సే ప్రధానపాత్రలో నటించిన ఈ సినిమా.. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూసిన వారంతా.. సినిమా చూసి చాలా స్ఫూర్తిదాయకంగా ఉందని కితాబిచ్చారు. అయితే.. తొలుత హిందీలో మాత్రమే ఓటీటీలోకి ఈ వచ్చిన ఈ చిత్రం.. ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లోనూ స్ట్రీమ్ అవుతోంది. డిస్నీ + హాట్ స్టార్ వేదికగా ఈ సినిమా ఇప్పుడు స్ట్రీమ్ అవుతుండటంతో సినీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చాలా చిన్న సినిమాగా, ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన 12th ఫెయిల్ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడమే కాకుండా.. ఎన్నో రికార్డులను సైతం సాధించింది. ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (IMDB) టాప్ 250 బెస్ట్ మూవీస్ లిస్టులో 50వ స్థానంలో నిలిచిన ఏకైక చిత్రంగా చరిత్ర సృష్టించింది. అంతేకాదు.. హాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కి నెట్టి 9.2 రేటింగ్ ను సాధించింది. ఆస్కార్ బరిలో నిలిచేందుకు పోటీ పడుతోంది. ఇప్పటికే ఆస్కార్ జనరల్ కేటగిరిలో ఇండిపెండెంట్ గా చిత్రబృందం నామినేషన్ వేసింది.


Read More: కత్రినా కైఫ్ తల్లి కాబోతోందా? వీడియో వైరల్

ఈ ఏడాది జనవరిలో జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ – 2024లో ఉత్తమ చిత్రం సహా 5 అవార్డులను సొంతం చేసుకుంది. బెస్ట్ డైరెక్టర్ గా విధు వినోద్ చోప్రా, బెస్ట్ యాక్టర్ గా విక్రాంత్ మాస్సే, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డులను అందుకుంది.

కథ విషయానికొస్తే.. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా అనురాగ్ పాఠక్ రాసిన ఓ పుస్తకం ఆధారంగా తీసిన సినిమా ఇది. మధ్యప్రదేశ్ లోని చంబల్ లోయ వద్దగల మౌర్యానాకు చెందిన మనోజ్ కుమార్ శర్మ (విక్రాంత్ మాస్సే)ది నిరుపేద కుటుంబం. తినేందుకు తిండి కూడా సరిగా లేని పరిస్థితి. మనోజ్ తండ్రి పనిలో నిజాయతీగా ఉండటంతో సస్పెన్షన్ కు గురవుతాడు. మనోజ్ చదువులో అంతంత మాత్రంగా ఉంటాడు. దాంతో పరీక్షల్లో కాపీ కొట్టాలని స్కూల్ ప్రిన్సిపలే ప్రోత్సహిస్తాడు. ఈ విషయం డీఎస్పీకి తెలియడంతో.. ఆ స్కూల్ ప్రిన్సిపల్ ను జైలుకు పంపుతాడు. అందరూ నిజాయితీగా ఉండాలని చెబుతాడు. ఈ క్రమంలో మనోజ్ 12వ తరగతి ఫెయిల్ అవుతాడు. డీఎస్పీ మాటలను స్ఫూర్తిగా తీసుకున్న అతను.. ఆ తర్వాత ఏం చేశాడు ? ఎలాంటి సమస్యలు, సవాళ్లను ఎదుర్కొని నిలబడ్డాడన్నదే సినిమా.

Tags

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×