EPAPER

Kovvur Assembly constituency: వేమిరెడ్డి VS వైసీపీ.. నెల్లూరులో పంతం నెగ్గేనా..?

Kovvur Assembly constituency: వేమిరెడ్డి VS వైసీపీ.. నెల్లూరులో పంతం నెగ్గేనా..?

Kovvur Assembly constituency Vemireddy Vs YCP: వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలకు జిల్లాకే తలమానికమైన జొన్నవాడ దేవస్థానంతో మంచి అనుబంధం ఉంది. ముందు నుంచి ఆ దంపతులు ఆలయం అభివృద్ధి పనులు, ప్రత్యేక పూజలతో కామాక్షితాయి భక్తులకు దగ్గరయ్యారు. ఆ దేవస్థానం కొవ్వూరు నియోజకవర్గం లో ఉండడం ప్రత్యక్ష ఎన్నికల్లో మొదటి సారి పోటీ చేస్తున్న వేమిరెడ్డి దంపతులకు అనుకూలంగా మారిందంటున్నారు. మరోవైపు వేమిరెడ్డి దంపుతులను నల్లపురెడ్డి పర్సనల్‌గా టార్గెట్ చేయడం కోవూరులో ఆయనకు కొంత మైనస్ అయిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.


వైసీపీలో ఉన్నప్పుడు వేమిరెడ్డి దంపతులను ఆదిదంపతులని కీర్తించిన నల్లపురెడ్డి.. తర్వాత వారిపై తీవ్ర స్థాయిలో వ్యక్తిగత విమర్శలకు పాల్పడటంతో .. ఎన్నికల ముందు వరకు ఆయన వెంట వైసీపీలో తిరిగిన బుచ్చిరెడ్డిపాలె కీలక నేతలు ఎర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డి, సురా శ్రీనివాసులు రెడ్డి, పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు, శివరామకృష్ణారెడ్డి లతో పాటు పలువురు తెలుగుదేశం బాట పట్టారు. నియోజకవర్గంలో అత్యంత ఎక్కువ ఓట్లు ఉన్న బుచ్చిరెడ్డిపాలెం మండలంలో వారి చేరికతో తెలుగుదేశం పార్టీకి బలం పెరిగినట్లైంది.

అలాగే నియోజకవర్గంలో బుచ్చిరెడ్డిపాలెం, కొడవలూరు, విడవలూరు, ఇందుకూరుపేట మండలాల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు వైసీపీని వీడి వేమిరెడ్డి బాట పట్టారు. నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు తమ బలం అని చెప్పుకున్న వైసీపీ.. కోవూరు నియోజకవర్గంలో వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతుంటే చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. వారందరి మద్దతుతో తన విజయం ఖాయమని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎందరు పార్టీ విడిచి వెళ్లినా సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని ప్రసన్నకుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Also Read: 600 కోట్లు!! జగన్‌కు కడప టెన్షన్!?

పోలింగ్ ముగిసాక కోవూరు నియోజకవర్గంలో ఫలితాలపై లెక్కలు మొదలయ్యాయి.. ఈ సారి అక్కడ 79.29 శాతం పోలింగ్ నమోదైంది .. గత ఎన్నికల్లో పోలైన ఓట్లకంటే సుమారు 20 వేల ఓట్లు అధికంగా పోలవ్వడంతో టీడీపీ శ్రేణులు ధీమాగా కనిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో పందాలు సైతం ప్రశాంతిరెడ్డి మెజార్టీ మీదే ఎక్కువగా జరుగుతుండటం విశేషం.

Tags

Related News

Kadapa Reddamma: జగన్ అడ్డాలో టీడీపీ అభ్యర్థి విజయం.. కడప రెడ్డమ్మ అంటూ చంద్రబాబు కితాబు!

Somireddy Chandramohan Reddy: జాక్ పాట్ కొట్టిన సోమిరెడ్డి.. నెక్ట్స్ ప్లానేంటి..?

Jagan Record : ప్రతిపక్ష హోదా పోగొట్టుకుని జగన్ రికార్డ్.. టీమ్ 11 ఆడుదాం ఆంధ్ర

BIG TV Exit Polls Survey: జనం నాడి పట్టుకున్న బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్స్.. ఆ పార్టీ నేతల్లో వణుకు

Nellore Constituency: నెల్లూరు లో షాకింగ్ సర్వే.. గెలిచేది ఎవరంటే..

Chandrababu Majority In Kuppam: కుప్పంలో చంద్రబాబు మెజార్టీ ఎంతంటే..?

Tough Fight In Vizag: బొత్స ఝాన్సీని ఢీకొట్టే సత్తా.. బాలయ్య అల్లుడు శ్రీ భరత్ కి ఉందా..

Big Stories

×