EPAPER

Triangle Fight in Kavali Politics: కావలిలో ముక్కోణపు పోటీ.. కింగ్ ఎవరు..?

Triangle Fight in Kavali Politics: కావలిలో ముక్కోణపు పోటీ.. కింగ్ ఎవరు..?

Triangle Fight in Kavali Politics: నామినేషన్ల ఘట్టానికి టైం దగ్గర పడుతుండటంతో నెల్లూరు జిల్లాలో రాజకీయాలు రంజుగా మారాయి. అటు కావలి నియోజకవర్గంలో అయితే అభ్యర్థుల మాటలతూటాలతో ప్రచారం రోజురోజుకి పొలిటికల్ హీట్ పెంచుతుంది. మరోవైపు ఈసారి కావలిలో ముగ్గురు బలమై అభ్యర్థులు పోటీ పడుతుండడంతో ఈ ముక్కోణపు పోటీలో విజయం ఎవరిని వరిస్తుందన్న చర్చ రాజకీయ వర్గాలో జోరుగా సాగుతోంది. మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనుండడంతో కావలి కింగ్ ఎవరనేది ప్రజల్లో ఉత్కంఠ రేపుతోంది.


నెల్లూరు జిల్లా కావలి నియోజవర్గం లో ఎన్నికల దగ్గర పడుతుండడం రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ఈసారి జరిగే ఎన్నికల్లో ఇక్కడ ముగ్గురు బలమైన అభ్యర్ధుల మధ్య పోటీ నెలకొంది. అభ్యర్థులు ప్రచారాల్లో తలమునకలై ఉన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈసారి కూడా వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పోటీలో ఉన్నారు. ఈయన 2009 లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు కావలి లో రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పట్లో పీఆర్పీ అభ్యర్ధిగా పోటీ చేసి. టీడీపీ అభ్యర్థి బీద మస్తాన్‌రావు చేతిలో ఓడిపోయారు. రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

తరువాత రామిరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తదనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణమాలతో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్థాపించిన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీలో చేరి 2014 ఎన్నికల్లో పోటీ చేసి టీడీపీ నుంచి మరోసారి పోటీ చేసిన అప్పటి ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావుపై స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు. అసెంబ్లీలో అడుగుపెట్టిన రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి 2014 లో టీడీపీ అధికారంలోకి వచ్చినా పార్టీ మారకుండా వైసీపీలోనే కొనసాగారు.


Also Read: Janasena Rebels: పొత్తు చిత్తు.. సేనానిపై తిరుగుబాటు..

2019 కూడా ముక్కోణపు పోటీ జరిగింది. వైసీపీ తరఫున రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ మరో సారి పోటీలో నిలిచి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థిగా కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, జనసేన నుండి పారిశ్రామికవేత్త పసుపులేటి సుధాకర్ పోటీ చేశారు. ఈ పోటీలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 13 వేల మెజారిటీతో గెలుపొందారు. రెండవ స్థానంలో టీడీపీ అభ్యర్థి కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి 81వేల పై చిలుకు ఓట్లు తో రెండోస్థానం లో నిలిచారు. జనసేనపార్టీ తో రాజకీయ అరగ్రేటం చేసిన పసుపులేటి సుధాకర్ 10 వేల ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు.

2014, 2019 లో విజయం సాధించిన రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి హ్యాట్రిక్ విజయంపై కన్నేసి ముందుకుసాగుతున్నారు. అయితే ఈ సారి ఆయన గెలుస్తారా? లేదా? అన్న అన్న అనుమానాలు వైసీపీ వర్గాల్లోనే వ్యక్తమవుతున్నాయి 2019 లో జనసేన అభ్యర్ధిగా పోటీ చేసిన పసుపులేటి సుధాకర్ జనసేనకి రాజీనామా చేసి బీజేపీ లోకి వెళ్లి అతి కొద్ది కాలంలోనే ఆ పార్టీకికూడా రాజీనామా చేశారు. టికెట్ ఇస్తారు అని ఆశతో టీడీపీలోకి వచ్చినా దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి రెడీ అయి ప్రచారం చేసుకుంటున్నారు.

Also Read: Stone Politics In AP: రాయి పడుద్ది!.. ఏపీలో…

ఇక టీడీపీ అభ్యర్ధి కావ్య కృష్ణారెడ్డి అన్ని వర్గాలను ఆకట్టుకుంటూ ప్రచారంలో దూసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. అధికార వైసీపీపై ఉన్న వ్యతిరేకత, రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యేపై ఉన్న నెగిటివ్‌ని ను తనకు అనుకూలంగా మలుచునే ప్రయత్నాల్లో భాగంగా ఆయా ప్రాంతాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ కావలి కింగ్ తానేనని ధీమాతో అన్ని వర్గాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ట్రయాంగిల్ ఫైట్‌తో కావలి రాజకీయం ఒకసారిగా వేడెక్కడంతో పాటు రోజుకో మలుపు తిరుగుతుంది. రామిరెడ్డిపై వ్య‌తిరేక‌త వుంద‌నే కార‌ణంతో అభ్య‌ర్థిని మారుస్తార‌నే ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఆయ‌న్నే వైసీపీ బ‌రిలో నించడంతో పలువురు స్థానిక నేతలు ఆయనకు సహకరించడం లేదన్న టాక్ వినిపిస్తోంది.

మరోవైపు టీడీపీలోనూ వ‌ర్గ విభేదాలున్నాయి. కావలి టీడీపీ ఇన్‌చార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి, బీద ర‌విచంద్ర ఈ సీటును ఆశించి భంగ‌ప‌డ్డారు. ఆ క్రమంలో విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి ఇటీవ‌ల జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేర‌డంతో రామిరెడ్డి ప్ర‌తాప్‌కుమార్‌రెడ్డి అది తనకు ప్లస్ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. అలాగే టీడీపీ నుంచి వైసీపీలో వెళ్లి రాజ్య‌స‌భ స‌భ్యత్వం దక్కించుకున్న కావలి మాజీ ఎమ్మెల్యే బీద మ‌స్తాన్‌రావుకు ఆ నియోజ‌క‌వ‌ర్గంలోని మ‌త్స్య‌కారుల‌తో మంచి సంబంధాలున్నాయి.

Also Read: కుటుంబం.. అన్నగారి కుటుంబం!

ప్రస్తుత ఎన్నికల్లో మరోసారి టీడీపీని ఢీకొన్న పోతున్న ప్రతాప్ కుమార్ రెడ్డి ముచ్చటగా మూడో విజయం పై కన్నేశారు. అయితే ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నియోజకవర్గ పరిధిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయనపై 2019లో వైసీపీకి అధికారం వచ్చాక వ్యతిరేకత పెరిగిందన్న భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతుంది. నిత్యం ప్రజల్లో ఉంటున్నప్పటికీ కావలి నియోజకవర్గ పరిధిలో చోటు చేసుకున్న వివిధ రాజకీయ ఘటనల నేపథ్యంలో ఎమ్మెల్యే వ్యవహార శైలిపై గతంలో స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు కూడా స్పష్టం చేస్తున్నారు.

మాజీ ఏఎంసి చైర్మన్ మన్నెమాల సుకుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి గతంలో రామలక్ష్మణుల్లా కలిసి నడిచారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య దూరం పెరిగింది. దాంతో సుకుమారుడు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. దానికి ఎమ్మెల్యేనే కారణమని అప్పట్లో సుకుమార్ రెడ్డి బహిరంగంగానే ఆరోపణలు చేశారు. అయితే ప్రస్తుతం వారిద్దరు మధ్య సయోధ్య కుదిర్చి సుకుమార్ రెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకున్నారు. మరిద్దరి రామలక్ష్మణుల బంధం ఎంత వరకు కొనసాగుతుందనేది చర్చనీయాంశంగా మారింది.

Also Read: ఉండి.. రాజుల్లారా ఉండండి..

టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న కావ్య కృష్ణారెడ్డి గతంలో కాంగ్రెస్ నుంచి జలదంకి మండల ఎంపీపీగా పనిచేశారు. తరువాత సొసైటీ అధ్యక్షుడిగా పనిచేసి వైసీపీలో చేరారు. 2023లో టీడీపీలోకి వచ్చి ప్రస్తుతం కావలి అభ్యర్ధిత్వం దక్కించుకున్నారు.. ఈ ఎన్నికలో రామిరెడ్డి , కావ్య, పసుపులేటి వీరి ముగ్గురిలో గెలుపు ఎవరిది అన్న ఉత్కంఠ సెగ్మెంట్లో నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యేపై వ్యతిరేకత తనకు కలిసి వస్తుందని కృష్ణారెడ్డి ధీమాగా కనిపిస్తున్నారు. అయితే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నపసుపులేటి సుధాకర్ చీల్చే ఓట్లు నిర్ణయాత్మకంగా మారే పరిస్థితి కనిపిస్తోంది.

Related News

Kadapa Reddamma: జగన్ అడ్డాలో టీడీపీ అభ్యర్థి విజయం.. కడప రెడ్డమ్మ అంటూ చంద్రబాబు కితాబు!

Somireddy Chandramohan Reddy: జాక్ పాట్ కొట్టిన సోమిరెడ్డి.. నెక్ట్స్ ప్లానేంటి..?

Jagan Record : ప్రతిపక్ష హోదా పోగొట్టుకుని జగన్ రికార్డ్.. టీమ్ 11 ఆడుదాం ఆంధ్ర

BIG TV Exit Polls Survey: జనం నాడి పట్టుకున్న బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్స్.. ఆ పార్టీ నేతల్లో వణుకు

Nellore Constituency: నెల్లూరు లో షాకింగ్ సర్వే.. గెలిచేది ఎవరంటే..

Chandrababu Majority In Kuppam: కుప్పంలో చంద్రబాబు మెజార్టీ ఎంతంటే..?

Tough Fight In Vizag: బొత్స ఝాన్సీని ఢీకొట్టే సత్తా.. బాలయ్య అల్లుడు శ్రీ భరత్ కి ఉందా..

Big Stories

×