EPAPER
Kirrak Couples Episode 1

Satyavedu Politics: సత్యవేడు సిత్రాలు.. ఈ పోరులో సత్తాచాటేదెవరు ?

Satyavedu Politics: సత్యవేడు సిత్రాలు.. ఈ పోరులో సత్తాచాటేదెవరు ?

Satyavedu Politics in Elections 2024: ఉమ్మడి చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం రాజకీయం విచిత్రంగా కనిపిస్తుంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఇప్పుడు టీడీపీ అభ్యర్ధిగా పోటీలో ఉన్నారు. చిత్రంగా ఆ పార్టీ నుంచి అసలు పార్టీ సభ్యత్వమే లేని వ్యక్తి రెబల్ అవతారమెత్తి ప్రచారంలో దూసుకుపోతున్నారు. అసలు ఆయన ఎవరో ఎందుకు రెబల్ గా పోటీ చేస్తున్నారో టీడీపీ శ్రేణులకే అంతుపట్టడం లేదంట. మరో వైపు సిట్టింగ్ సీటు కాపాడుకోవాలని చూస్తున్న వైసీపీకి లోకల్, నాన్‌లోకల్ ఫీలింగ్ తలనొప్పిగా తయారైంది. ఆ క్రమంలో ఎవరికి వారు తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తూ ప్రచార హడావుడి కానిచ్చేస్తున్నారు.


తిరుపతి పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ నుంచి వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి అదిమూలం టికెట్ సంపాదించుకున్నారు. అదే సమయంలో జీడీ నెల్లూరు నియోజకర్గానికి చెందిన మాజీ మంత్రి కుతుహలమ్మ సమీప బంధువు నూకతోటి రాజేష్ వైసీపీ నుంచి పోటీకి దిగారు. అంతకు ముందు వైసీపీలో హైడ్రామా నడిచింది. తిరుపతి ఎంపి గురమూర్తిని సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా సత్యవేడు ఎమ్మెల్యే అదిమూలాన్ని తిరుపతి ఎంపి అభ్యర్ధిగా ప్రకటించారు జగన్.

ఈ నేపథ్యంలో తిరుపతి ఎంపిగా పోటీ చేయడానికి నిరాకరించిన ఆదిమూలం. ఇదంతా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుట్రని ఆయనపై తిరగబడ్డాడు. ఇదే సమయంలో జీడి నెల్లూరు వైసీపీ అభ్యర్థిగా నూకతోటి రాజేష్‌ను ప్రకటించారు. అయితే రాజేష్ వద్దంటు స్థానికులకు టికెట్ ఇవ్వాలని స్థానిక నేతలు గళమెత్తడంతో మళ్లీ ఈక్వేషన్లు మర్చేసిన వైసీపీ అధ్యక్షుడు రాజేష్‌ను సత్యవేడుకు షిఫ్ట్ చేశారు.


Also Read: అందరికీ రాయల్ ఛాలెంజేనా? ఇంకెవరూ లేరా?

అదిమూలంకు టికెట్ ఇవ్వక ముందు నియోజకవర్గం టిడిపిలో ఇద్దరు ఇన్చార్జులు మారారు. 019లో పోటీ చేసి ఓడిపోయిన జేడి రాజశేఖర్ కొంతకాలం ఇన్చార్జ్‌గా పనిచేసారు. తర్వాత పరిణామాలతో అయనను తప్పించి మాజీ ఎంఎల్ ఎ హేమలతా కుమార్తె డాక్టర్ హెలెన్‌ను నియమించారు. యితే అమెకు కాకుండా చివరి నిమిషంలో వైసీపీ నుంచి వచ్చిన ఆదిమూలం అభ్యర్థి అయ్యారు. ఆయన నామినేషన్‌ వేసి ప్రచారంలో దూసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు.

మరోవైపు టీడీపీ అభ్యర్థులుగా జెడ్డా రాజశేఖర్ తో పాటు యాతాటి రమేష్ నామినేషన్ దాఖలు చేసారు. జెడ్డా రాజశేఖర్‌ను అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే యాతాటి రమేష్ పార్టీ సభ్యుడు కూడా కాకపోవడంతో పెద్దగా పట్టించుకోలేదు. ఇదే సమయంలో టీడీపీలోని కొంతమంది రమేష్‌కు అనుకూలంగా పనిచేయడం మొదలు పెట్టారు. మేష్ కు అనుకూలంగా పనిచేస్తున్నారని అరుగురుని నియోజకవర్గంలో పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. అయితే తాను గత ఏనిమిది నెలల నుంచి టిడిపిలో టికెట్ కోసం ప్రయత్నించానని అయితే తనకు ఇవ్వక పోవడంతో స్వంతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసానని రమేష్ అంటున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన మీరు ఇక్కడ నుంచి ఎలా పోటీ చేస్తాన్నారని అంటే మంగళగిరిలో లోకేష్ లోకలా అని ప్రశ్నిస్తున్నారు.

Also Read: ముహూర్తం ఓకే, కడపకు రాహుల్, సీఎం రేవంత్

టిడిపి అభ్యర్థి ఆదిమూలం పార్టీ క్యాడర్‌ని పూర్తిస్థాయిలో కలుపుకుని పోవడంలో సక్సెస్ అవుతున్నారు. వైపు వైసీపీలోని ఓవర్గం ఆదిమూలంతో కలసి పనిచేస్తుంది. అయిదేళ్లు ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఉండటం ఆయనకు కలిసివచ్చిందంటున్నారు. రెబల్ అభ్యర్థి జేడీ రాజశేఖర్‌తో పాటు రమేష్ ఓట్లు చీల్చుతారన్న అంచనాలున్నాయి.. అయితే రెబల్ వర్గాలవెనుక వైసిపి ఉందని ఎవరెన్ని కుట్రలు చేసినా తన గెలుపు ఖాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడున్న సహాజ వనరుల మీద పెత్తనం కోసం మంత్రి పెద్దిరెడ్డి రెబల్స్‌తో నాటకానికి తెరలేపారని విమర్శిస్తున్నారు…తాను ఒక్కడే లోకల్ అని నాన్ లోకల్స్ వచ్చి ఇక్కడ హాడావుడి చేయడం ప్రజలంతా గమనిస్తున్నరని చెప్తున్నారు.

టీడీపీలోని లుకలుకలను ఎంజాయ్ చేయాలని చూస్తున్న వైసీపీ అభ్యర్ధి రాజేష్‌కు సొంత పార్టీ వారే ఆ ఛాన్స్ ఇవ్వడం లేదంట ఆయన్ని నాన్ లోకల్ సమస్య పట్టి పీడిస్తుంది. కతోటి రాజేష్‌ను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత .. నియోజకవర్గంలో మొత్తం వ్యవహారాన్ని మంత్రి పెద్దిరెడ్డి నడిపిస్తున్నారు. స్థానికంగా చాలామంది పెద్దిరెడ్డి పెత్తనం నచ్చక ఆదిమూలంతో టచ్‌లో వెళ్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. ఆ క్రమంలో సమస్యల పరిష్కారానికి క‌ృషి చేస్తానంటూ రాజేష్ తన ప్రచారం తాను చేసుకుంటున్నారు.

Also Read: Vijayawada East Politics: దేవినేని గద్దె నెక్కుతారా? తూర్పులో తోపెవరు?

మొత్తమ్మీద టీడీపీలోని అంతర్వర్ధంతో గెలవాలని వైసీపీ ప్రయత్నిస్తుంటే చంద్రబాబు ఇమేజ్, మిత్రపక్షాల సహకారం తనను గెలిపిస్తుందని ఆదిమూలం ధీమాతో కనిపిస్తున్నారు.స్వంతంత్ర అభ్యర్థులు గెలుపు ఓటములను ఏ మాత్రం ప్రభావితం చేయగలరన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ర్థిక వనరులు ఎన్నికలలో కీలక పాత్ర వహిస్తాయని అంటున్నారు.తమిళ తెలుగు సంప్రదాయం కలగలపి ఉన్న ఇక్కడ మెజార్టీ ఓటర్లు తమిళ మాలలే.అది ఆ వర్గానికి చెందిన ఆదిమూలానికి కలసి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.. మరి చూడాలి సత్యవేడు ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో?

Related News

Kadapa Reddamma: జగన్ అడ్డాలో టీడీపీ అభ్యర్థి విజయం.. కడప రెడ్డమ్మ అంటూ చంద్రబాబు కితాబు!

Somireddy Chandramohan Reddy: జాక్ పాట్ కొట్టిన సోమిరెడ్డి.. నెక్ట్స్ ప్లానేంటి..?

Jagan Record : ప్రతిపక్ష హోదా పోగొట్టుకుని జగన్ రికార్డ్.. టీమ్ 11 ఆడుదాం ఆంధ్ర

BIG TV Exit Polls Survey: జనం నాడి పట్టుకున్న బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్స్.. ఆ పార్టీ నేతల్లో వణుకు

Nellore Constituency: నెల్లూరు లో షాకింగ్ సర్వే.. గెలిచేది ఎవరంటే..

Chandrababu Majority In Kuppam: కుప్పంలో చంద్రబాబు మెజార్టీ ఎంతంటే..?

Tough Fight In Vizag: బొత్స ఝాన్సీని ఢీకొట్టే సత్తా.. బాలయ్య అల్లుడు శ్రీ భరత్ కి ఉందా..

Big Stories

×