EPAPER

Narasaraopet constituency: పేటలో పౌరుషం.. నీదా? నాదా? సై..

Narasaraopet constituency: పేటలో పౌరుషం.. నీదా? నాదా? సై..

Interesting Facts About Narasaraopet Assembly Constituency: నరసరావుపేట లోక్‌సభ సెగ్మెంట్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది.. లోకల్ , నాన్ లోకల్‌ల మధ్య ఫైట్ నడిచిన ఈ నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా జరిగిన హింసాకాండ కలకలం రేపింది .. పోలింగ్ శాతం పెరిగిన ప్రస్తుత ఎన్నికల్లో ఈ సారి లోక్‌సభలో అడుగుపెట్టెది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. అయిదేళ్లు వైసీపీ ఎంపీగా పనిచేసిన లావు కృష్ణదేవరాయలు గుడ్‌విల్‌తో ఈ సారి ఈజీగా గెలిచేస్తామని టీడీపీ భావిస్తుంది. నెల్లూరు సిటీ నుంచి ప్రమోషన్ పేరుతో వైసీపీ అభ్యర్ధిగా వచ్చిన అనీల్‌యాదవ్ గెలుపుని వైసీపీ ప్రెస్టేజ్‌గా తీసుకుంది. అయితే పోలింగ్ ముగిసాక టీడీపీ నేతలు జనంలో కనిపిస్తున్నప్పటికీ.. వైసీపీ నేతలు పత్తా లేకుండా పోవడం చర్చకు దారితీస్తుంది.


పల్నాడు జిల్లాలో పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసాకాండ తీవ్ర కలకలం రేపింది. రాష్ట్ర డీఐజీ, సీఎస్‌లను సీఈఓ ఢిల్లీ పిలిపించుకుని నిలదీసే వరకు వెళ్లింది పరిస్థితి. ఆ క్రమంలో నరసరావుపేట ఎంపీ స్థానంలో అభ్యర్థుల మధ్య గట్టి పోటీనే నడిచింది. సిట్టింగ్ ఎంపీగా నరసరావుపేట కోసం తాను చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని టిడిపి అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు కోరగా వైసీపీ పథకాలు తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని ఆ పార్టీ అభ్యర్ధి అనిల్ కుమార్ యాదవ్ ప్రచారం చేసుకున్నారు.

నరసరావుపేట లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క టీడీపీ ఎమ్మెల్యే కూడా లేకపోవడం మొత్తం వైసీపీ ఎమ్మెల్యేలే అవ్వడం అనీల్‌కు కలిసి వస్తుందన్న అభిప్రాయం ఉంది. ఎంపీగా ఈ అయిదేళ్లలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ది. ఎటువంటి ఆరోపణలు లేకుండా అన్ని పార్టీల వారితో ఉన్న సత్సంబంధాలు లావు కృష్ణదేవరాయులకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఆ క్రమంలో పల్నాడులో ఎవరిది గెలుపు అన్నదానిపై బెట్టింగ్ లు జోరుగా సాగుతున్నాయి.


గెలుపోటమలపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు .. అయితే పోలింగ్ తర్వాత ఒక్కసారి మీడియా ముందు కొచ్చి … పోలీసులు టీడీపీకి సహకరించారని ఆరోపించి  తర్వాత కనిపించకుండా పోయారు వైసీపీ అభ్యర్ధి అనీల్ యాదవ్  పోలీసు ఆంక్షల కారణంగా పల్నాడులో కనిపించకపోయినా.. కనీసం ఎక్కడున్నారో కూడా అంతుపట్టక పోతుండటం వైసీపీ నేతలన్నే గందరగోళంలోకి నెడుతుందంట.

Also Read: సీదిరికి సినిగిపోద్దా? సిత్తరాల సిరపడా!?

ఇక గొడవలు ఎక్కువగా జరిగిన నియోజకవర్గంగా మాచర్ల రికార్డులకు ఎక్కింది. పోలింగ్ తర్వాత కూడా మాచర్లలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి .. పోలీసు సోదాల్లో పెట్రోల్ బాంబులు, మారణాయుధాలు పట్టుపడుతున్నాయి. ఆ క్రమంలో అక్కడి వైసీపీ ఎమ్మెల్యే పినెల్లి రామకృష్ణారెడ్డిని గృహనిర్భంధంలో పెటితే ఆయన పోలీసుల కళ్లుగప్పి పరారవ్వడం కలకలం రేపుతోంది .. అరెస్ట్ భయంతో పారిపోవడానికి సిద్దమైన ఆయన దానికి ముందు పోలీసుల తీరునే తప్పుపట్టారు

అలా పల్నాడుకు చెందిన వైసీపీ ముఖ్యనేతలు పత్తా లేకుండా పోవడం ఆ పార్టీ శ్రేణులను తీవ్ర గందరగోళంలో పడేస్తుందంట.. పోలీసులు టీడీపీకి సహకరించారనడాన్ని లావు కృష్ణదేవరాయులు, మాచర్ల టీడీపీ అభ్యర్ధి జూలకంటి బ్రహ్మానందరెడ్డి తీవ్రంగా ఖండిస్తున్నారు. పోలింగ్ రోజు సమస్యాత్మక బూత్‌ల సమాచారం అందించినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. పిన్నెల్లి హౌస్ అరెస్టు నుంచి తప్పించుకు పోవటానికి సహకరించిన పోలీసుల పై చర్యలు తీసుకోవాలని. సీఎస్ జవహర్‌రెడ్డి నియమించిన సిట్ బ‌ృందంపై తమకు నమ్మకం లేదన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఓటమి భయంతోనే పోలింగ్ ముగిసాక కూడా దాడులు చేస్తున్నారని జూలకంటి మండిపడుతున్నారు .. పోలింగ్ బూతుల్లో చొరబడి ఈవీఎంలు పగలగొట్టినా పోలీసులు పట్టించుకోలేదని .. ఐదుగురు వ్యక్తులను కారుతో తొక్కించుకుంటూ వెళితే 306 కేసు కట్టి చేతులు దులుపుకున్నారని ఫైర్ అయ్యారు .. మాచర్లలో తాలిబన్ రాజ్యం నడుస్తుందని.. అలాంటి వారు పోలీసులు తమకు సహకరించారని ప్రచారం చేయడానికి సిగ్గుండాలని తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

మరిలాంటి సిట్యుయేషన్లో నరసరావుపుటలో దేవరాయులు రెండో సారి గెస్తారో? లేకపోతే అనీల్ యాదవ్ లోక్‌సభకు ఎంపికవుతారో? చూడాలి.

Related News

Kadapa Reddamma: జగన్ అడ్డాలో టీడీపీ అభ్యర్థి విజయం.. కడప రెడ్డమ్మ అంటూ చంద్రబాబు కితాబు!

Somireddy Chandramohan Reddy: జాక్ పాట్ కొట్టిన సోమిరెడ్డి.. నెక్ట్స్ ప్లానేంటి..?

Jagan Record : ప్రతిపక్ష హోదా పోగొట్టుకుని జగన్ రికార్డ్.. టీమ్ 11 ఆడుదాం ఆంధ్ర

BIG TV Exit Polls Survey: జనం నాడి పట్టుకున్న బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్స్.. ఆ పార్టీ నేతల్లో వణుకు

Nellore Constituency: నెల్లూరు లో షాకింగ్ సర్వే.. గెలిచేది ఎవరంటే..

Chandrababu Majority In Kuppam: కుప్పంలో చంద్రబాబు మెజార్టీ ఎంతంటే..?

Tough Fight In Vizag: బొత్స ఝాన్సీని ఢీకొట్టే సత్తా.. బాలయ్య అల్లుడు శ్రీ భరత్ కి ఉందా..

Big Stories

×