BigTV English

Gopuram : గోపురం ఎత్తుగానే ఎందుకుండాలి?

Gopuram : గోపురం ఎత్తుగానే ఎందుకుండాలి?
Gopuram

Gopuram : దేవాలయం ఒక వ్యక్తికీ ఒక కుటుంబానికీ సంబంధించి వుండదు. సార్వజనిక ఆస్థిగా పరిగణింపబడుతూ, పోషింపబడుతూ, రక్షింపబడుతూ, దర్శింపబడుతూ వుండాలి. దాతలేవరైనా దేవాలయానికి దానాదికాలను చేయవచ్చు. పోషకులుగా వుండవచ్చు. వేశ్యలు కూడ దేవాలయాలను కట్టించి దాఖలాలు ఎన్నో వున్నాయి. సర్వజనానీకానికీ, పొరుగు ఊరి నుంచి వారికీ ఇతర దేశీయులకి, కొత్తగా వచ్చిన వారికీ దేవాలయం ఎక్కడ ఉందో సులభంగా తెలుసుకోవటానికి ఆలయగోపురం ఎత్తుగా వుండాలి.


దేవాలయ గోపురమే కాదు దేవాలయం కూడా ఎత్తుమీద వుండటం మంచిది. అందుకే ఎన్నో దేవాలయాలు కొండలు గుట్టలు చూచుకొని మరీ నిర్మిస్తారు. ఎందుకంటే, మానవు డెంతటి తెలివికలవాడై ప్రకృతిని జయించగల శక్తివంతుడు కాలేదు! వరదబీభత్సాల తుఫానులు మొదలైన ప్రకృతి వైపరీత్యాలకు మనిషి భయపడి తీరవలసిందే. అటువంటి ప్రకృతి ప్రళయ సమయాలలో ప్రాణాలు కాపాడగల్గిన స్థలం దేవాలయమే!

దేవుడు సర్వోన్నతుడు! ఈ సర్వోన్నత భావం దేవాలయాన్ని దర్శించిన ప్రతిసారీ మనిషికి, మనస్సుకీ బోధపడటానికి దేవాలయాన్నీ దేవాలయగోపురాన్నీ ఎంత వీలైతే అంతగా ఎత్తుకి నిర్మిస్తారు. హిందూ దేవాలయాలేకాదు. మసీదుకి కూడా పొడవైన స్తంభం నిర్మిస్తారు. చర్చికి కూడా ముందు భాగంలో ఎత్తుగా దూరానికి కన్పించే విధంగా అంతస్థు నిర్మించి గంటను కడతారు.


Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×