EPAPER

Kaushiki Amavasya: సెప్టెంబర్ 2న కౌశికి అమావాస్య.. ఈ మూడు రాశులవారికి అన్నీ శుభాలే..

Kaushiki Amavasya: సెప్టెంబర్ 2న కౌశికి అమావాస్య.. ఈ మూడు రాశులవారికి అన్నీ శుభాలే..

Kaushiki Amavasya: కౌశికి అమావాస్య. ఈ ఏడాది సెప్టెంబర్ 2న కౌశికి అమావాస్య వస్తుంది. సాధారణంగా అమావాస్యను అంత మంచిరోజుగా భావించరు. కానీ.. మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కౌశికి అమావాస్య చాలా పవిత్రమైనది. ఈ రోజున మా కౌశికి దేవిని పూజిస్తారు. ఈ 3 రాశుల వారు ఆ తల్లిని పూజిస్తే.. అనుగ్రహాన్ని పొందుతారని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది.


మేషం

మేషరాశివారికి ఈ అమావాస్య చాలా శుభప్రదంగా ఉండనుంది. ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. కెరీర్ లో విజయాన్ని అందుకుంటారు. అలాగే సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులు సైతం లాభపడతారు.


మీనం

కౌశికి అమావాస్య తర్వాత ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి మారుతుంది. సంపద పెరుగుతుంది. అనూహ్యంగా లాభాలను పొందుతారు. వ్యాపారస్తులకు కలిసివస్తుంది. అన్నింటా అడ్డంకులను అధిగమించి పనులను పూర్తిచేసుకుంటారు.

కర్కాటకం

కర్కాటకరాశి వారు కౌశికి అమావాస్య తర్వాత అదృష్టవంతులుగా మారబోతున్నారు. శుభవార్తలను వింటారు. ఆదాయం పెరుగుతుంది. విదేశీయాన అవకాశం ఉంది. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు మంచి సమయం.

Also Read: రాఖీ పౌర్ణమి రోజు అద్భుతమైన యోగాలు.. ఈ రాశుల వారి కష్టాలు తొలగిపోయే టైమ్ వచ్చేసింది

కౌశికి అమావాస్యను ఎందుకు జరుపుకుంటారు ?

పూర్వకాలంలో శుంభ, నిశుంభ అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వారి వల్ల దేవతలు, మానవులు అంతా తీవ్రంగా బాధపడ్డారు. తమను రక్షించాలంటూ అంతా కలిసి దుర్గాదేవిని ప్రార్థించారు. అప్పుడు ఆ తల్లి తన శరీరంలోని ఒక కణం నుంచి శుంభ, నిశుంభలను అంతమొందించేందుకు ఒక అవతారాన్ని సృష్టించింది. ఆమెనే కౌశికి దేవి.

ఆ కౌశికి దేవి శుంభ, నిశుంభ, చంద్- ముండ్ అనే రాక్షసులను చంపి.. అందరినీ కాపాడింది. శాంతిని, ధర్మాన్ని పునః స్థాపించింది. ప్రపంచాన్ని అజ్ఞానమనే అంధకారం నుంచి మేల్కొలిపింది. రాక్షసుల బాధ తీరిపోవడంతో ప్రజలంతా దీపాలు వెలిగించి పండుగ చేసుకున్నారు. అదే కౌశికి అమావాస్య. అప్పటి నుంచీ శ్రావణ అమావాస్యను కౌశికి అమావాస్యగా జరుపుకుంటారు.

రాశులు, నక్షత్రాలు మారుతున్న గ్రహాలు

ఇక ఆగస్టు 25న శుక్రుడు కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. సింహం, మకరం, కన్యారాశుల వారికి మంచి ఫలితాలు కలగనున్నాయి. ఆగస్టు 23న బుధుడు కర్కాటకరాశిలోకి ప్రవేశిస్తాడు. దీని ఫలితంగా మేషం, సింహం, కర్కాటక రాశివారు లాభాలను చూస్తారు. ఇక రాఖీ పూర్ణిమ రోజున సర్బార్థ సిద్ధి యోగం, రవియోగం వంటి శుభయోగాలు ఏర్పడనున్నాయి.

ప్రస్తుతం రోహిణి నక్షత్రంలో సంచరిస్తున్న బృహస్పతి అక్టోబర్ 9 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 వరకూ తిరోగమనంలో ఉంటాడు. ఆగస్టు 20 వరకూ రోహిణి నక్షత్రంలో సంచరిస్తాడు. వృషభం, సింహం, ధనస్సు రాశులవారికి అప్పటి వరకూ మంచి ఫలితాలు అందుతాయి. డిసెంబర్ 2న నక్షత్రం మారిన తర్వాత వృషభం, తుల, మిథున రాశులవారికి శుభ ఫలితాలు కలుగుతాయి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనికి ఎలాంటి బాధ్యత వహించదు.)

 

 

Related News

Horoscope 20 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే! శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం!

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Guru Vakri 2024 : మరో 20 రోజుల్లో బృహస్పతి తిరోగమనం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు

Budh Shani Yuti Horoscope: బుధ-శని సంయోగంతో ఈ 3 రాశుల వారు సంపదను పొందబోతున్నారు

Big Stories

×