EPAPER

Dhanatrayodashi: ధన త్రయోదశి నాడు బంగారం లేదా వెండి ఏది కొంటే మంచిది?

Dhanatrayodashi: ధన త్రయోదశి నాడు బంగారం లేదా వెండి ఏది కొంటే మంచిది?
Dhanatrayodashi: ధన త్రయోదశి భారతదేశంలో మహిళలంతా ఇష్టంగా చేసుకునే పండుగ. ధన త్రయోదశి దీపావళి రాకను సూచిస్తుంది. ఆరోజు బంగారం, వెండి వంటి విలువైన లోహాలను కొనేందుకు ఇష్టపడతారు. ఎంతోమంది ధన త్రయోదశి నాడు బంగారం కొనాలా లేక వెండి కొనాలా అనే సందేహంలో తేలియాడుతూ ఉంటారు.


ధన త్రయోదశి ప్రాముఖ్యత
ధన త్రయోదశి లేదా ధంతేరాస్. ఇది ధన్వంతరి ఈ భూమిపై ఉద్భవించిన రోజు అని చెబుతారు. ధన్వంతరి అంటే అతను ఆయుర్వేద దేవుడు. ఈ ధన త్రయోదశి నాడు బంగారం, వెండి లేదా విలువైన వస్తువును కొనడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఇది ఇంటికి శ్రేయస్సును, సంపదను, అదృష్టం అందిస్తుందని సాంప్రదాయాల్లో భాగంగా నమ్ముతారు.

బంగారం కొంటే
భారతీయ సమాజంలో బంగారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది ఎంతో విలువైన లోహంగా కూడా పరిగణిస్తారు. సంపదకు, హోదాకు చిహ్నంగా బంగారాన్ని కొంటూ ఉంటారు. బంగారం ఆభరణాల రూపంలో, నాణేల రూపంలో, కళాఖండాల రూపాల్లో మారుతూ ఉంటుంది. అంతేకాదు బంగారం కరెన్సీ హెచ్చుతగ్గులకు కూడా కారణం అవుతుంది. అందుకే మన దేశంలో బంగారానికి విలువ ఎక్కువ. దీని దీర్ఘకాలంలో సురక్షితమైన పెట్టుబడిగా కూడా పరిగణిస్తారు. అందుకే పెట్టుబడిదారులు బంగారం పై పెట్టుబడులు పెట్టేందుకు ఇష్టత చూపిస్తారు. బంగారాన్ని ద్రవ రూపంలో కూడా మార్చి నిల్వ చేసుకోవచ్చు. ఆర్థిక మాంద్యం సమయంలో బంగారం ఎంతో ఉపయోగపడుతుంది. ఆర్థిక మాంద్యం వచ్చినా కూడా బంగారం రేటు అమాంతం తగ్గే అవకాశం లేదు. ఏదో కాస్త తగ్గే అవకాశం ఉంటుంది.

Also Read: దీపావళి రోజు 3 దీపాలతో ఈ పరిహారం చేస్తే.. మీ ఇంట్లో కనక వర్షమే !


వెండి కొంటే
బంగారంతో పోలిస్తే వెండి ధర చాలా తక్కువ. వెండిని కొనడానికి మీరు పెద్దగా కష్టపడక్కర్లేదు. తక్కువ సొమ్ముతోనే ఎక్కువ వెండిని కొనవచ్చు. వెండిని ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానల్స్ కొన్ని రకాల వైద్య పరికరాలు తయారీలో కూడా వాడుతూ ఉంటారు. దీన్ని కూడా పెట్టుబడి పరంగా కొంటూ ఉంటారు. అయితే వెండితో పోలిస్తే బంగారమే ఎక్కువ ధర పెరిగే అవకాశం ఉంది.

ఆభరణాల్లో కూడా వెండిని చాలా తక్కువగా వాడతారు. కేవలం వెండి పట్టీల కోసం తప్ప వెండిని మెడలో వేసుకునే వారి సంఖ్య తక్కువే. అలాగే ఇంట్లో వెండి వస్తువులను మాత్రం ఎక్కువగా వాడేందుకు ఉపయోగిస్తారు.

రెండిట్లో ఏది కొనాలి?
మీ దగ్గర ఉన్న డబ్బులను బట్టి ఏది కొనాలన్నది నిర్ణయించుకోండి. బంగారం, వెండి… ఈ రెండూ కూడా మీకు ఎలాంటి నష్టాన్ని కలగజేయవు. ధన త్రయోదశి నాడు బంగారం లేదా వెండిని కొనుగోలు చేయడం వల్ల ఒక వ్యక్తి జీవితం సవ్యంగా సాగుతుందని పురాణాలు చెబుతున్నాయి. బంగారం, వెండి ఈ రెండూ కూడా ఎప్పటికీ చెడిపోవు. ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటాయి. కాబట్టి మీకు కావాల్సిన వస్తువు ఏదో ఎంచుకోండి. అది మీ దగ్గర ఉన్న డబ్బులకు వస్తుందో రాదో నిర్ణయించుకొని… దాన్నిబట్టి వెండి కొనాలో, బంగారం కొనాలో నిశ్చయించుకోండి. మీ దగ్గర డబ్బు అధికంగా ఉంటే బంగారం కొనడమే ఉత్తమం. వెండి కంటే బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కొంత సమయం తర్వాత వెండి మసకబారే అవకాశం ఉంది. కానీ బంగారం మాత్రం ఎప్పటికీ ధర పెరుగుతూనే ఉంటుంది.

Related News

Horoscope October 30 : మేషం నుంచి మీనం వరకు అక్టోబర్ 30 వ తేదీ ఎలా ఉంటుందంటే ?

Dhanteras: ధనత్రయోదశి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకువస్తే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మిని తీసుకువచ్చినట్టే

Diwali Significance: 5 రోజుల దీపావళి పండగ ప్రాముఖ్యత.. దీని వెనక ఉన్న ఆసక్తికరమైన కథలను తెలుసుకోండి

Mercury Transit: నవంబర్‌లో ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారం.. మీ ఖజానాను నింపనున్న బుధుడు

Lakshmi Puja: దీపావళి రోజు వీటిని లక్ష్మీ దేవికి సమర్పిస్తే.. జీవితాంతం డబ్బుకు లోటుండదు

Horoscope 28 October 2024: ఈ రోజు ఏ ఏ రాశుల వారికి ఏలా ఉండబోతుందంటే..

Weekly Horoscope(27 Oct-03 Nov): ఈ వారం కొన్ని రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి

×