EPAPER

Sravan Shivratri 2024: శ్రావణ శివరాత్రి ఎప్పుడు ? పూజ తేదీ, శుభ సమయం, ప్రాముఖ్యత ఏమిటి ?

Sravan Shivratri 2024: శ్రావణ శివరాత్రి ఎప్పుడు ? పూజ తేదీ, శుభ సమయం, ప్రాముఖ్యత ఏమిటి ?

Sravan Shivratri 2024: హిందూ మతంలో శివరాత్రి ఉపవాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మత విశ్వాసాల ప్రకారం, ప్రతి నెల కృష్ణ పక్షం చతుర్దశి రోజున శివరాత్రి ఉపవాసం పాటించడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుందని భక్తుల అపారమైన నమ్మకం. హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం ఇప్పటికే ప్రారంభమైంది. కానీ తెలుగు క్యాలెండర్ ప్రకారం మాత్రం ఆగస్టు 5వ తేదీ నుండి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. ప్రతీ నెల శివరాత్రి ఉపవాసం చాలా ముఖ్యమైనదిగా శివయ్య భక్తులు భావిస్తారు. ముఖ్యంగా శ్రావణ శివరాత్రి రోజున మహా దేవుని పూజించడం వల్ల సంతోషం, శ్రేయస్సు మరియు సంపదలు లభిస్తాయని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో శ్రావణ శివరాత్రి ఉపవాసం, పూజ సమయం మరియు ప్రాముఖ్యతకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


శ్రావణ శివరాత్రి తేదీ

శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి తిథి ఆగస్టు 2వ తేదీన మధ్యాహ్నం 3:24 గంటలకు ప్రారంభమవుతుంది. తిరిగి ఆగస్టు 3వ తేదీన మధ్యాహ్నం 3:45 గంటలకు ముగుస్తుంది. శివరాత్రి ఉపవాసం రోజున అర్ధరాత్రి శివుడిని పూజిస్తారు. అటువంటి పరిస్థితిలో శ్రావణ శివరాత్రి ఉపవాసం ఆగస్టు 2న ఆచరిస్తారు. ఈ రోజున పూజకు అనుకూలమైన సమయం మధ్యాహ్నం 12:10 నుండి 12:50 వరకు ఉండనుంది.


ముహూర్తం

శివరాత్రి ఉపవాసం రోజున బ్రహ్మ ముహూర్త సమయం తెల్లవారుజామున 4:30 నుండి 5:10 వరకు ఉంటుంది. దీంతో విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:40 నుంచి 3:35 వరకు ఉంటుంది. నిశిత ముహూర్తం ఉదయం 12:10 నుండి 12:50 వరకు ఉంటుంది. ఈ రోజున సర్వార్థ సిద్ధి యోగం కూడా ఏర్పడుతోంది. ఇది ఆగస్టు 2వ తేదీ ఉదయం 10:55 నుండి మరుసటి రోజు ఆగస్టు 3వ తేదీ ఉదయం 6:05 వరకు ఉంటుంది. ఈ శుభ సమయాలన్నీ పూజకు ఉత్తమమైనవి.

ప్రాముఖ్యత

సనాతన ధర్మంలో శివరాత్రి ఉపవాసం చాలా ముఖ్యమైనది. మత విశ్వాసాల ప్రకారం, శివరాత్రి వ్రతాన్ని ఆచరిస్తే శివుని అనుగ్రహాన్ని పొందుతారని చెప్పబడింది. అలాగే జీవితంలో వచ్చే అనేక రకాల సమస్యలు దూరమవుతాయి. దీనితో పాటు, శివరాత్రి వ్రతాన్ని ఆచరించడం ద్వారా బలం, తెలివి, జ్ఞానం, సంపద, ఐశ్వర్యం మొదలైనవి లభిస్తాయని భక్తులు నమ్ముతారు. మరోవైపు జాతకంలో గ్రహ దోషం ఉన్నవారు కూడా శివరాత్రి వ్రతం రోజు పూజ చేయడం వల్ల ప్రయోజనం కలుగుతుందని శాస్త్రం చెబుతుంది.

Related News

Horoscope 8 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి పండగే.. పట్టిందల్లా బంగారమే!

Ganesh Chaturthi 2024: అప్పుల బాధ తొలగిపోవాలంటే.. గణపతిని ఇలా పూజించండి

Lucky Zodiac Signs: సెప్టెంబర్ 18 నుంచి వీరికి డబ్బే.. డబ్బు

Horoscope 7 September 2024: నేటి రాశి ఫలాలు.. గణపతిని పూజిస్తే విఘ్నాలు తొలగిపోతాయి!

Ganesh Chaturthi: గణేష్ చతుర్థి నాడు ఇలా చేస్తే దురదృష్టం దూరం అవుతుంది..

Trigrahi Rajyog Horoscope: మిథున రాశి వారిపై త్రిగ్రాహి యోగంతో ఊహించని మార్పులు జరగబోతున్నాయి

Ganesh Chaturthi 2024: వినాయక చవితి స్పెషల్.. మీ స్నేహితులకు, బంధువులకు ఇలా విష్ చేయండి..

Big Stories

×