EPAPER

Diwali Lakshmi Puja: దీపావళి రోజు లక్ష్మీ పూజ ఏ సమయానికి చేయాలి? జపించాల్సిన లక్ష్మీ మంత్రాలు ఏవి?

Diwali Lakshmi Puja: దీపావళి రోజు లక్ష్మీ పూజ ఏ సమయానికి చేయాలి? జపించాల్సిన లక్ష్మీ మంత్రాలు ఏవి?

Diwali Lakshmi Puja: దీపావళి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ. దేశం నలుమూలలా ఉన్న హిందూ ప్రజలు ఈ పండుగను సందడిగా నిర్వహించుకుంటారు. సంప్రదాయబద్ధమైన దుస్తులతో అనేక ఆచారాలతో లక్ష్మీ పూజను నిర్వహిస్తారు. అయితే ఈసారి దీపావళి ఏ రోజు పడింది, ఏ సమయానికి లక్ష్మీదేవి పూజని చేయాలో తెలుసుకోండి.


దీపావళి పూజ ముహూర్తం
హిందూ క్యాలెండర్ ప్రకారం దీపావళి నాడు లక్ష్మీ పూజ ఎన్ని గంటలకు చేయాలో పండితులు వివరిస్తున్నారు. దీపావళి ఈసారి అక్టోబర్ 31న వచ్చింది. ఆరోజు సాయంత్రం 6:52 నిమిషాల నుంచి 8:41 నిమిషాల మధ్య లక్ష్మీ పూజను చేయవచ్చు.

దీపావళి పూజలో లక్ష్మీదేవిని, గణేషుడిని కూడా పూజించాలి. ఆ రోజు లక్ష్మీదేవి భూమిపై దిగి ప్రతి ఇంటికి వస్తుందని పురాణాలు చెబుతాయి. ఆ మాతను ప్రసన్నం చేసుకోవడానికి, ఆశీర్వాదం పొందడానికి మీ ఇంటిని శుభ్రం చేసుకుని సిద్ధంగా ఉంచాలి. ఇంటిముందు దీపాలు పెట్టి ముగ్గులు వేసి, పువ్వులు జల్లి అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించాలి.


దీపావళి పూజా విధానం
దీపావళి పూజకు ఇంటిని శుభ్రం చేసి గంగాజలాన్ని చల్లాలి. ఇంటి ముందు మట్టి ప్రమిదలతో దీపాలు వెలిగించాలి. పూజ గదిలో ఎర్రటి క్లాత్ ను పరిచి దానిపై కొంత బియ్యాన్ని వేయాలి. ఆ బియ్యం మధ్యలో కలశంలో 75 శాతం నీరు వేసి పెట్టాలి. వెండి లేదా కాంస్య కలశాన్ని ఎంచుకోవచ్చు. ఆ కలశంలో ఒక  తమలపాకు, బంతి పువ్వు, ఒక నాణాన్ని, కొన్ని బియ్యం గింజలు వేయాలి. అలాగే ఐదు మామిడి ఆకులను కూడా ఉంచాలి. ఆ మామిడి ఆకుల మధ్యలో ఒక కొబ్బరికాయను పెట్టాలి. కలశానికి కుడివైపున గణేశుడు విగ్రహం లేదా ఫోటోను ఉంచాలి. లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా పక్కనే పెట్టాలి.

Also Read: ధనత్రయోదశి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకువస్తే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మిని తీసుకువచ్చినట్టే

ఇప్పుడు మీ అకౌంటింగ్ పుస్తకం, డబ్బు, మీ వ్యాపారానికి ఉద్యోగానికి సంబంధించిన వస్తువులను అమ్మవారి విగ్రహం ముందు ఉంచండి. లక్ష్మీదేవి గణేశులకు కుంకుమ పెట్టి పువ్వులను సమర్పించి దీపాన్ని వెలిగించండి. అరచేతిలో ఒక పువ్వును పట్టుకొని కళ్ళు మూసుకొని లక్ష్మీదేవి మంత్రాలను జపించండి. దీపావళి పూజ పుస్తకాలు బయట మార్కెట్లో దొరుకుతాయి. పుస్తకాలను కొని అందులో ఉన్న మంత్రాలలో జపించవచ్చు. అలాగే వండిన ప్రసాదాలను కూడా అమ్మవారికి సమర్పించాలి. పంచామృతాన్ని కూడా అమ్మవారికి సమర్పించాలి. అమ్మవారికి తమలపాకులో ఒక్క నాణెం, పండ్లు పెట్టి కొంత డబ్బును కూడా పెట్టి సమర్పించడం మర్చిపోవద్దు. అమ్మవారికి పెట్టే ప్రసాదాలలో కచ్చితంగా ప్రసాదం ఉండేలా చూసుకోండి.

లక్ష్మీ హారతి పాటను కూడా పాడాల్సిన అవసరం ఉంది. దీపావళి రోజు మీకు ఏ మంత్రాలు చదవాలి అర్థం కాకపోతే ఇక్కడ మేము ఇచ్చిన మంత్రాలను చదవండి. మీకు అంతా మేలే జరుగుతుంది. ప్రతి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మీకు ఆర్ధిక కష్టాలు, ఇంట్లో సమస్యలు రాకుండా ఉంటాయి.

1. ఓం శ్రీం మహా లక్ష్మీయే నమ:
ఓం హ్రీం శ్రీం క్లీం మహా లక్ష్మీ నమ:
…………….
2. ఓం శ్రీం శ్రీ అయే నమ:
…………
3. ఓం మహాదేవ్యేచ విద్మహే
విష్ణు పత్నీచ ధీమహీ
తన్నో లక్ష్మీ ప్రచోదయాత్

Related News

Lakshmi Devi: దీపావళికి లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించేందుకు ఐదు మార్గాలు.. ఇదిగో ఇలా చెయ్యండి

Horoscope October 30 : మేషం నుంచి మీనం వరకు అక్టోబర్ 30 వ తేదీ ఎలా ఉంటుందంటే ?

Dhanteras: ధనత్రయోదశి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకువస్తే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మిని తీసుకువచ్చినట్టే

Diwali Significance: 5 రోజుల దీపావళి పండగ ప్రాముఖ్యత.. దీని వెనక ఉన్న ఆసక్తికరమైన కథలను తెలుసుకోండి

Mercury Transit: నవంబర్‌లో ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారం.. మీ ఖజానాను నింపనున్న బుధుడు

Lakshmi Puja: దీపావళి రోజు వీటిని లక్ష్మీ దేవికి సమర్పిస్తే.. జీవితాంతం డబ్బుకు లోటుండదు

×