EPAPER
Kirrak Couples Episode 1

Gold : ఇంట్లో బంగారం నిల్వ ఉండాలంటే ఏం చేయాలి

Gold : ఇంట్లో బంగారం నిల్వ ఉండాలంటే ఏం చేయాలి
Gold stock

Gold : బంగారం లేని భారతీయుల గుమ్మం ఉండదు. ప్రపంచంలోనే బంగారాన్ని సెంటిమెంట్ గా భావించే దేశాల్లో మొదటి స్థానం మనదేశానిదే. ఇంట్లో ఏదైనా కష్టం వస్తే అమ్ముకోవడానికి ఉంటుందన్న ఆశతోనైనే జీవితంలో కష్టపడి సంపాదించిన డబ్బుతో తులమైనా, కాసు బంగారమైన నగలు రూపంలో ఇంట్లో పెట్టుకుంటారు.


ఆర్ధికపరమైన సమస్యలు వచ్చినప్పుడు ఆదుకునేది బంగారమే. ఒక్కోసారి కొంతమంది బంగారాన్ని అమ్మి అప్పులు తీర్చుకుంటారు. మరికొందరు తాకట్టు పెడుతుంటారు. అయితే ఆతర్వాత ఎంత ప్రయత్నించినా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోలేకపోతారు.అమ్మేసిన బంగారన్ని మళ్లీ కొనే పరిస్థితులు ఉండకపోవచ్చు.

ఏదో స్థలం కోసమే, ఇంటి కోసమే బంగారం అమ్మి కొని ఆ తర్వాత మళ్లీ బంగారం కొందామని అనుకుంటారు. ఒక్కోసారి పిల్లల చదువు కోసం కూడా బంగారన్ని కుదువ పెట్టాల్సి వస్తుంది. అసలు మన ఇంట్లో బంగారం బయటకిపోకుండా ఉండాలంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు అసలు బంగారం జోలికి ఆలోచన రాకూడదు. అలాంటి పరిస్థితి రాకూడదంటే ముందు మనకు అవసరమైన ఆదాయం వచ్చే మార్గం ఉండాలి.


ఇవన్నీ ఒకాదానితో ఒకటి ముడిపడ్డ సమస్యలనే చెప్పాలి. అందుకే కొన్ని విషయాల్లో గట్టెక్కడానికి చిన్న చిన్న తంత్రాలు పనిచేస్తాయి. మన దగ్గర ఉన్న బంగారం కనీసం నిలకడగా ఉండాలంటే ఒక నిమకాయ తీసుకుని సగానికి కోసం లవంగాలు పేర్చాలి. మొత్తం 9 లవంగాలను నిమ్మకాయ బద్ద చుట్టూ ఉంచాలి. అందులో ఒకదానిని మధ్యలో ఉంచాలి. దానికి కుంకుమ, పసుపు అద్ది మనం ఇంట్లో పూజ చేసే చోట పెట్టాలి .తర్వాత గిన్నె తీసుకుని నీళ్లు పోసి అందులో నగలును ఉంచి ఒక రాత్రి ఉంచాలి. అమావాస్యకు ముందుకు వచ్చే త్రయోదశి రోజున కాని, పౌర్ణమి ముందు వచ్చే త్రయోదశి నాడు కానీ సాయంత్రమే ఈ పనిచేయాలి. యధావిధిగా పూజచేసుకోండి.

తర్వాత రోజు నగలు శుభ్రం చేసి నైరుతి దిశలో ఉన్న బీరువాలో నగలు పెట్టుకుని వాడుకోవచ్చు. ఈ పరిహారం చేయడం వల్ల సమస్య వచ్చినప్పుడు నగలు అమ్ముకోవడమే, తాకట్టు పెట్టే అవకాశం రాదు.
మన బంగారం నిలకడగా ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు.

Related News

Weekly Horoscope: వచ్చే వారం ఈ రాశులకు ధన లాభం-సంతోషం

October Horoscope Zodiacs: అక్టోబర్‌లో ఈ రాశుల వారికి వ్యాపారంలో అన్నీ విజయాలే

Shani Nakshatra Parivartan 2024: శతభిషా నక్షత్రంలోకి శని.. పూజకు ముందు ఈ రాశి వారికి అదృష్టం రాబోతుంది

Pradosh Vrat 2024: రెండవ ప్రదోష వ్రతం ఎప్పుడు ? తేదీ, శుభ సమయం, ప్రాముఖ్యత వివరాలు ఇవే

Horoscope 28 September 2024: ఈ రాశి వారికి ప్రమోషన్ ఛాన్స్.. ఇష్టదైవారాధన శుభకరం!

Rahu In Saturn Till 10 November: నవంబర్ 10 వరకు శని, రాహువు సంచారంతో అదృష్టవంతులు కాబోతున్నారు

Hastrekha Shastra: మీ అరచేతిలో ఈ ‘లక్కీ మార్క్’ ఉందా.. అదృష్టం బంగారంలా మెరిసిపోతుంది

Big Stories

×