Big Stories

Nagula Panchami-Nagula Chavithi : నాగులచవితికి-నాగుల పంచమికి తేడా ఏంటి?

Nagula Panchami-Nagula Chavithi : దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రలోనే నాగుల చవితి జరుపుకుంటారు .హిందూ పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశంలోని చాలా దేవాలయాల్లో నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. అన్ని రకాల కాల్ప దోషాలు తొలగిపోతాయని…నమ్మకం. నాగేంద్రునికి పూజ చేస్తే సంతానం ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. పెళ్లి సంబంధాలు కుదరని పెళ్లికాని ప్రసాద్ లతోపాటు యువతులకు వివాహ యోగం ప్రాప్తిస్తుందని భక్తులు నమ్ముతుంటారు.

- Advertisement -

శ్రీమన్నారాయణుడికి ఆదిశేషుడు పాన్పుగా వెళ్లిన తిథి శ్రావణ మాసంలో శుక్ల పంచమి. అందువల్ల అది నాగపంచమిగా పిలుస్తుంటారు. కుమారస్వామి దేవసేనను పెళ్లిచేసుకోవాడనికి భూమిమీదకు వచ్చిన రోజుకూడా పంచమి. షష్ఠి తిథినాడు వల్లిని కుమారస్వామి పెళ్లాడాడు. సర్పరాజుల పూజల వెనుక ఇలా నాగుల చవితి, నాగుల పంచమి ఆచారాలు మొదలయ్యాయి.

- Advertisement -

శ్రావణ మాసంలో శుక్ల పక్ష పంచమిని నాగ పంచమి లేదా నాగుల పంచమిగా హిందువులు జరుపుకుంటారు. స్కంద పురాణంలో నాగ పంచమి విశిష్టతను సాక్షాత్తు ఆ పరమ శివుడే వివరించాడు. మహేశ్వరుని కోరిక మేరకు ఈ పంచమి నాగులను పూజించడం ఆనవాయితీగా వస్తుంది. సర్పాలను కూడా ఆరాధించే గుణం హిందువులకి మాత్రమే ఉంది. సర్పాలను పూజించడానికి మిగిలిన దేవతల్ని పూజించడానికి తేడా ఉంటుంది. పాములకు పోలు చేసి నువ్వులతో చేసిన చిమ్ని, మెత్తటి అరటి పండ్లు, బాగా పండిన సీతాఫల పండును నైవేద్యంగా సమర్పిస్తారు. నాలుకతో చప్పరించే పదార్ధాలను మాత్రమే నాగులకు నివేదన పెడుతుంటారు.పంటలు చేతికొచ్చే సమయానికి తోడు రంధ్రాల్లో ఉన్నపాములు బయటకు సమయం కూడా ఇదే . ఈ సమయంలో పాముల్ని చంపేయకుండా ఉండేందుకు మన పెద్దలు వాటిని పూజించాలని చెప్పారు. ఒక రకంగా ఇది పర్యావరణ హితమని కూడా చెప్పాలి. ఎందుకంటే ధాన్యం తినే ఎలుకలను పాములు వేటాడతాయి.

ఎలుకలు ఏడాదిలో మనిషి తినే దాని కన్నా ఎక్కువే తింటాయి. ఎలుకల్ని పూర్తిగా సంహరించడం పర్యావరణ సమతుల్యత కాదు. అవి ఏమేరకు ఉండాలో అంత వరకు ఉండవచ్చు. ఇలాంటి సమతుల్యతను పాములు ఎలుకల్ని వేటాడి బ్యాలెన్స్ చేస్తుంటాయి. ఎలుకలతోపాటు సర్పాలకు జీవించే హక్కు ఉంది. ఆ విధంగా నాగజాతిని కాపాడి పూజించడం చేయాలని మన పెద్దలు నాగుల చవితి ద్వారా చెప్పారు. పుట్ట మన్ను తీసుకొచ్చి పెట్టుకుంటే చెవులకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని మన పెద్దలు చెప్పే మాట.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News