Big Stories

Foundation Stone : గృహానికి శంకుస్థాపనకి ఏ సమయం ఉత్తమమైంది.

- Advertisement -

Foundation Stone : నిలువ నీడ ఇచ్చే ఇంటికి కట్టుకునే ముందు హిందూమతంలో ముహూర్తాలకు ప్రాధాన్యం ఇస్తుంటారు. జీవితాంతం ఉండే ఇంటి పనులు ఏ ఆటంకం కలగకుండా సాఫీగా సాగాలని ప్రార్ధిస్తున్నారు. అన్ని సమకూర్చుకుని ఇల్లు కట్టడానికి సిద్ధమవుతారు. అయితే శంకుస్థాపన ముహూర్తాల విషయంలో ఉదయం వేళే శంకుస్థాపనలు చేయాలన్న భావన ఎక్కువమందిలో కనిపిస్తుంది. దీనిపై భిన్న వాదనలు ఉన్నాయి. ఇంటి నిర్మాణం అంతా వాస్తు శాస్త్రం ప్రకారం కడుతుంటారు. గృహ ప్రవేశం కూడా వాస్తు ప్రకారమే నిర్ణయిస్తారు.శంకుస్థాపన గృహప్రవేశంలాంటి కార్యక్రమాలు పగటి పూట మాత్రమే చేయాలని శాస్త్రం చెబుతోంది.

- Advertisement -

వీటికి ముహూర్తాలు కూడా తెల్లవారజాము నుంచే మొదలవుతుంటాయి. వేకువ జాము 3 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపలే వాస్తు కర్మలు పూర్తి చేయాలని శాస్త్రంలో పేర్కొన్నారు. కారణం వాస్తు కర్మలన్నీ విశేషమైనవి. కానీ చాలా మంది రాత్రిపూటే గృహ ప్రవేశాలకు ముహూర్తాలు చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే రాత్రి పూట శకునాలు అనేవి ఎదురుకావు. ముత్తదువులు, మంగళవాద్యాలు, బంధువులతో వెళ్లడానికి అనువైన సమయం కూడా. ఇవన్నీ తెలిసి కూడా మన రుషులు కొన్ని మంత్రాలు ఉపదేశించారు. వాటిని ఆ సమయంలో పటించడం వల్ల ఎలాంటి శకున దోషాలు కలుగవంటారు..

పెళ్లిళ్లయినా, గృహప్రవేశాలైనా కొన్ని సార్లు శకునాలు తప్పవు. మనకు తెలియకుండానే కొన్ని జరిగిపోతుంటాయి. వాటి నుంచి సమస్య రాకుండా ఉండేందుకే ఈ మంత్రాలు పటిస్తుంటారు. ఇలాంటి కారణాల వల్లే కొన్ని ప్రాంతాల్లో రాత్రి పూట గృహ ప్రవేశ ముహూర్తాలు చూసుకుంటారు. కానీ వాస్తు కర్మలు అనేవి పగటి పూట మాత్రమే చేయాలని గ్రంథాల్లో ప్రస్తావించారు. శంకుస్థాపనలు అనేవి ఉదయం 11.30 గంటల లోపలే చేయాలని శాస్త్రంలో చెప్పబడింది. అర్దరాత్రిళ్లు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని స్పష్టంగా చెప్పారు. రాత్రి పూట శంకుస్థాపన వల్ల యజమానురాలికి మంచిది కాదు. వారికి కీడు జరిగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News