Big Stories

Gandhari khilla : గాంధారి కోటలో జాతరకి ప్రత్యేకత ఏంటంటే….

- Advertisement -

Gandhari khilla : మంచిర్యాల జిల్లాలోని బొక్కలగుట్ట సమీపంలో గాంధారీ కోట ప్రకృతి సోయగాలకి కేరాఫ్ అడ్రస్. దట్టమైన అటవీ ప్రాంతంలోని ఇసుక రాతి కొండలపై ఉంది ఈ కోట. ఇక్కడ వేల మొక్కల జాతుల సంపద నెలకొంది. ఎన్నో రకాల ఔషధ మూలికలు ఈ ప్రాంతం సొంతం . ఈ కోటపై ఇప్పటికే కొంతమంది కన్ను పడింది. గాంధారి కోటలో రెండేళ్లకోసారి జరిగే మైసమ్మ జాతరకి ప్రధానంగా గిరిజనులే వస్తుంటారు. ఇక్కడ జరిగే క్వారీ జాతరకి. ఆంధ్ర, మహారాష్ట్ర, ఛతీస్ గఢ్ కు చెందిన గిరిజనులు కచ్చితంగా వస్తుంటారు.

- Advertisement -

జాతర సందర్భంగా కోటలో గిరిజనుల సంప్రదాయ నృత్యాలు, డోలు చప్పుళ్లు కొండ కోన పులకించేలా జరుగుతాయి. నాయక్‌పోడ్‌ గిరిజనులకి మాత్రమే ఈ జాతర నిర్వహించే అర్హత ఉంటుంది. మాఘమాసంలో ఏటా మూడు రోజులపాటు జాతర జరుగుతుంది. జాతరకు దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి ఆదివాసీ గిరిజనులు తరలివస్తుంటారు.. గాంధారి కోటను కాకతీయ పాలకుల సాయంతో గిరిజన రాజుల నిర్మించారని శాససనాలు చెబుతున్నాయి.

గాంధారి కోటలో మైసమ్మ దేవాలయంతోపాటు శివుడు, కాలభైరవుడు, ఆంజనేయుడి శిల్పాల సౌందర్యం మాటల్లో వర్ణించలేం. కోటను రక్షించేందుకు ఆ రోజుల్లో చేపట్టిన నిర్మాణాలు స్నానపు ట్యాంకులు వారి నైపుణ్యతకి ఉదాహరణగా భావించవచ్చు. ఔషధాలు, వనమూలికల నిలయమైన ఆ ఈ ప్రాంతాన్ని సందర్శించే వారి ఆరోగ్యాన్ని కాపాడుతుందని నమ్మకం. కోటలో జరిగే ఉత్సవాలకి వెళ్లవారికి కొత్త ఉత్సహాన్ని కలిగిస్తుంది. రైలు, రోడ్డు మార్గంలో కూడా ఈ కోటకు చేరుకునే సౌకర్యం ఉండటం కలిసొచ్చే అంశంగా చెప్పాలి. మంచిర్యాలకి సమీపంలోనే ఈ ప్రాంతం ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News