EPAPER

Pushkara Yogam:- పుష్కర యోగం అంటే ఏంటి…

Pushkara Yogam:- పుష్కర యోగం అంటే ఏంటి…


Pushkara Yogam:- ధర్మశాస్త్రం ఎన్నో విషయాలు చెబుతోంది. కొన్ని పనుల్ని కొన్ని సమయాల్లో చేయకూడదంటారు. కొన్ని సమయాల్లో చేసే పనులు చేస్తే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. అవి కూడా కొన్ని పనులు మాత్రమే. త్రిపుష్కర, ద్విపుష్కర యోగాల్లో కొన్ని వస్తువులు ఇచ్చినా నష్టాలు వస్తాయి. చివరకి డబ్బు ఇవ్వడం, రుణం తీర్చే పని కూడా మళ్లీ రిపీట్ అవుతూ ఉంటాయి. మన చేతిలో లేని నష్టాలు మొదలగువాని విషయం ఎలా ఉన్నా మనం చేసే పనుల్తో డబ్బు ఇవ్వడం, అప్పు తీర్చడం మొదలైనవి పునరావృతమైతే మళ్లీ మళ్లీ చేయాల్సి వస్తే కష్టమే. ద్విపుష్కర యోగ అనేది ఆదివారం, మంగళవారం, శనివారాలు. విదియ, సప్తమి, ద్వాదశి తిథులు. ధనిష్ట, చిత్త, మృగశిర నక్షత్రాలు కలిసినపుడు ఏర్పడుతుంది. ఈ రోజుల్లో వస్తువు పోయినా, లభించినా ఆ క్రియలు మళ్లీ జరుగుతాయి.

ఆదివారం, మంగళవారం,, శనివారాలు, విదియ, సప్తమి, ద్వాదశి తిథులు ఉండి, విశాఖ, ఉత్తర, పూర్వాభాద్ర, పునర్వసు, కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలు కలిస్తే త్రి పుష్కరయోగం ఏర్పడుతుంది. . ఈ రోజుల్లో మరణం, వస్తు లాభాలు, నష్టాలు ఏవైనాసరే మూడుసార్లు పునరావృతమవుతాయి. కాబట్టి ఆ రోజుల్లో మళ్లీ మళ్లీ జరగకూడదనుకునే పనులు చేయకుండా జాగ్రత్త పడాలి. ఈ యోగాలలో దాన ధర్మాలు చేయవచ్చు. ఈ రోజులలో అప్పిస్తే తిరిగిరాదు .పైగా మనమే మళ్లీ మళ్లీ ఇస్తుండాల్సి వస్తుంది. అత్యవసరమైతేనే మందులు వాడాలి. లేకపోతే వాటిని మళ్లీ మళ్లీ వాడక తప్పని పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రోజుల్లో ఆపరేషన్లు చేయించకుండా ఉంటే మంచిది.


అప్పు చేయడానికి సోమవారం మంచిది. త్రి పుష్కర, ద్వి పుష్కర యోగాలు లేని రోజు మంగళవారం అప్పు తీర్చడానికి మంచిది. మంగళవారం అప్పు తీర్చితే రుణ బాధలు తగ్గుతాయి. బుధవారం రుణం ఇవ్వడం, తీసుకోవడం మంచిది కాదు. అప్పు ఇస్తే తిరిగి వసూలు కావడానికి ఇబ్బంది కలిగే నక్షత్రాలు ఉత్తర, ఉత్తరాభాద్ర, ఉత్తరాషాఢ, పకృత్తిక, మఖ, ఆర్ద్ర,ుబ్బ, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, విశాఖ, రోహిణి, భరణి, ఆశ్లేష, మూల, జ్యేష్ఠ, స్వాతి.

Tags

Related News

Shukra Gochar 2024: తులా రాశితో సహా 5 రాశుల వారికి ‘శుక్రుడు’ అపారమైన సంపద ఇవ్వబోతున్నాడు

Shani Margi 2024 Effects: దీపావళి తరువాత కుంభ రాశితో సహా 5 రాశుల వారి జీవితంలో డబ్బే డబ్బు..

Shradh 2024: మీ పూర్వీకులు కోపంగా ఉన్నారని సూచించే.. 7 సంకేతాలు ఇవే

Vastu Tips: వంట గదిలో ఈ 2 వస్తువులను తలక్రిందులుగా ఉంచితే ఇబ్బందులే..

Bhadra Mahapurush Rajyog Horoscope: ఈ రాశి వారిపై ప్రత్యేక రాజయోగంతో జీవితంలో భారీ అభివృద్ధి

Dussehra 2024 Date: ఈ ఏడాది దసరా పండుగ ఏ రోజున జరుపుకుంటారు? శుభ సమయం, ప్రాముఖ్యత వివరాలు ఇవే

Sun Transit Horoscope: సూర్యుని దయతో ఈ రాశుల వారికి గోల్డెన్ టైం రాబోతుంది

Big Stories

×