EPAPER

Types Of Gurus: గురువులు ఎన్నిరకాలు?

Types Of Gurus: గురువులు ఎన్నిరకాలు?

Types Of Gurus: సమాజానికి జ్ఞానాన్ని అందించే వాడే.. గురువు. అయితే.. గురువుల్లో అనేక రకాల వారు ఉన్నారు. మనిషి తన అవసరాలను బట్టి సంబంధిత గురువును ఆశ్రయించి.. జ్ఞానాన్ని ఆర్జించాలి. ఆ గురువుల వివరాలు..


1) సూచక గురువు : బాల్యం నుంచి.. పై చదువు వరకు చదువు చెప్పే గురువు. శిష్యుడికి మంచి చదువు, తద్వారా ఉపాధి, గుర్తింపును సాధించేందుకు అవసరమైన సలహాలను, సూచనలను ఇస్తాడు.

2) వాచక గురువు : ఏది ధర్మం? ఏది అధర్మం? ఏది మంచిది? ఏది కాదు? అనే తేడాలను వివరించటంతో బాటు బ్రహ్మచర్యము , గృహస్థాశ్రమము, వానప్రస్దం, సన్యాస ఆశ్రమాల్లో ఎలా జీవించాలో చెబుతాడు.


3) భోధక గురువు : కోర్కెలు తీర్చే మార్గాలను, మరణానంతరం మోక్షాన్ని అందించే మంత్రాలను ఉపదేశిస్తారు. ఈ గురువు మార్గదర్శకత్వంలో మనిషి.. లౌకిక మార్గం నుంచి అలౌకిక మార్గం వైపు అడుగులు వేస్తాడు.

4 ) నిషిద్ధ గురువు : వశీకరణాలు, చేతబడులు, తాంత్రిక విద్యలు నేర్పే గురువులను నిషిద్ధ గురువు అంటారు. వీరి వద్దకు వెళ్ళక పోవడమే మంచిది. వీరు చిత్తాన్ని శుద్ధిచేయక పోగా.. మీ జేబులోని విత్తాన్ని హరిస్తుంటారు. వీరి దగ్గర చేరిన వారి పతనం తప్పదు.

5 ) విహిత గురువు : లౌకికమైన విషయాలపై ఆసక్తిని తగ్గించి.. శాశ్వతమైన, నిత్యమైన, సత్యమైన అంశాల దిశగా తన శిష్యుడి మనసును మళ్లించేందుకు నిరంతరం ప్రయత్నిస్తాడు.

6) కారణ గురువు : ఇతను కేవలం మోక్షం గురించే బోధిస్తాడు. మనిషి భూమ్మీద ఎన్ని సుఖాలను అనుభవించినా..ఒకరోజు వీటిని వదిలేయాల్సిందేనని, కనుక ముందునుంచే మోక్షసాధన దిశగా మనిషి ప్రయత్నించాలని బోధిస్తుంటారు.

7) పరమ గురువు : వీరు సాక్షాత్ భగవంతుని స్వరూపం. తన అవసరం ఉన్న శిష్యుని కోసం వీరే వెతుక్కొంటూ వస్తారు. సృష్టిలోని చైతన్యాన్ని గుర్తించి, దానిని అనుక్షణం అనుభవంలో నిలుపుకోగలిగిన ఈ గురువులు.. స్పర్శమాత్రం చేత తమ శిష్యులకూ మార్గదర్శనం చేస్తారు. రామకృష్ణ పరమహంస వంటి వారంతా ఈ కోవకు చెందిన వారు. ఈ భూమ్మీదికి నీవు ఎందుకొచ్చావో తెలిపి.. మళ్లీ జన్మనెత్తాల్సిన అవసరం లేకుండా చేయగల మహిమాన్వితులు వీరు.

Related News

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Guru Vakri 2024 : మరో 20 రోజుల్లో బృహస్పతి తిరోగమనం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు

Budh Shani Yuti Horoscope: బుధ-శని సంయోగంతో ఈ 3 రాశుల వారు సంపదను పొందబోతున్నారు

Horoscope 19 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ధనలాభం!

Big Stories

×