EPAPER

Wedding Ring : ఎడమ చేతి వేలుకే ఉంగరాన్ని ఎందుకు పెట్టుకోవాలి?

Wedding Ring : ఎడమ చేతి వేలుకే ఉంగరాన్ని ఎందుకు పెట్టుకోవాలి?

Wedding Ring : ఉంగరం పెట్టుకునే ఒక్కో వేలికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఎక్కువమంది ఎడమచేతికి ఉంగరాన్ని ధరించాలంటారు. కారణం ఎడమ చేతి వేలుకి, మెదడులోని రక్తనాళాలకు అవినాభావ సంబంధం ఉంది. ఎడమ వేలికి ఉంగరం పెట్టుకోవడం వల్ల మెదడు చైతన్యవంతమై ఉత్సాహంగా మనల్ని నడిపిస్తుంది. నవరత్నాలు కలిగిన ఉంగరాన్ని ధరించడం వల్ల సూర్యునిలో శక్తిని గ్రహజం శరీరం ఉత్తేజితం అవుతుంది.


జీవితంలో ఒకసారి వచ్చే పెళ్లి వేడుకలో వధూవరులు ఒకరి చేతికి మరొకరు ఉంగరం తొడుగుతారు. అప్పుడు కూడా ఉంగరం వేలునే ఎంచుకుంటారు. అలా ఆ వేలుకు ఉంగరం పెడితే ఒకరి స్పందనలు ఒకరికి తాకుతాయని నమ్మకం.

శరీరంలో ఉండే ప్రతి భాగం అరికాలులో కనబడుతుంది అంటారు. ఏ భాగానికైనా నొప్పి ఉంటే అరికాలిలో నొక్కితే తగ్గుతుంది అంటారు. అలా చేతి ఉంగరపు వేలుకు, చెవికి మధ్య సంబంధం ఉంటుంది. ఒకసారి కుడిచేతి ఉంగరపు వేలును గట్టిగా నొక్కి చూడండి. దీని స్పందన కుడిచెవి దగ్గర ఉంటుంది. అలాగే ఎడమచేతి ఉంగరపు వేలుని నొక్కినా ఎడమచెవి దగ్గర ప్రతిస్పందిస్తాయి. అయితే మహిళలకు చెవులు కుట్టిస్తుంటారు. దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం చేతి నాలుగవ వేలుకి ఆభరణంగా ఉంగరం ధరించడం మొదలుపెట్టారు.


ఈ రోజుల్లో మగవాళ్లు కూడా చెవులు కుట్టించుకోవడం ట్రెండ్‌గా భావిస్తున్నారు. మరి ఉంగరం ఏ చేతి వేలుకి ధరించాలో అని సందేహంలో ఉన్నవాళ్లు చాలామందే ఉన్నారు. కొంతమంది కుడిచేతికి పెట్టుకోవడానికి మొగ్గుచూపుతారు. మరికొందరికి ఎడమ చేయి బాగుంటుందని దానికే పెట్టుకోవాలనుకుంటారు.

ఉంగరం ఎడమచేతికి ధరిస్తే గుండెకు మేలు జరుగుతుందని చెబుతున్నారు. పాత రోజుల్లో ఉంగరాన్ని కుడిచేతికే ధరించేవారు. అది కూడా రాగి ఉంగరాన్నే ఎంచుకునేవారు. చాలామంది కుడిచేతితోనే అన్నం తింటారు. అనుకోకుండా ఆహారం విషతుల్యం అయినప్పుడు రాగి ఉంగరం ధరించిన చేయి ఆహారంలో పెట్టగానే ఆ ఉంగరం కాస్త నీలిరంగులోకి మారుతుందట. దాంతో ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు అన్నది వారి అభిప్రాయం.

Tags

Related News

Horoscope 8 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి పండగే.. పట్టిందల్లా బంగారమే!

Ganesh Chaturthi 2024: అప్పుల బాధ తొలగిపోవాలంటే.. గణపతిని ఇలా పూజించండి

Lucky Zodiac Signs: సెప్టెంబర్ 18 నుంచి వీరికి డబ్బే.. డబ్బు

Horoscope 7 September 2024: నేటి రాశి ఫలాలు.. గణపతిని పూజిస్తే విఘ్నాలు తొలగిపోతాయి!

Ganesh Chaturthi: గణేష్ చతుర్థి నాడు ఇలా చేస్తే దురదృష్టం దూరం అవుతుంది..

Trigrahi Rajyog Horoscope: మిథున రాశి వారిపై త్రిగ్రాహి యోగంతో ఊహించని మార్పులు జరగబోతున్నాయి

Ganesh Chaturthi 2024: వినాయక చవితి స్పెషల్.. మీ స్నేహితులకు, బంధువులకు ఇలా విష్ చేయండి..

Big Stories

×