EPAPER

Venus Nakshatra Transit: పుష్య నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 3 రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

Venus Nakshatra Transit: పుష్య నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 3 రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

Venus Transit in Pushya Nakshatra: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు ఒక నిర్దిష్ట విరామం తర్వాత రాశులను మారుస్తుంటాయి. ఇది ప్రజల మనసుపై మంచి, చెడు ప్రభావం కూడా చూపుతాయి. శుక్ర గ్రహం సంపద, ఐశ్వర్యం విజయం, సంతోషకరమైన, వైవాహిక, జీవితం, భౌతిక సంపద, విలాసవంతమైన, జీవనశైలికి కారణంగా చెబుతారు. ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన ఈ అంశాలు శుక్రుడి కదలికలో చాలా మార్పును తెస్తాయి.


దృక్ పంచాంగం ప్రకారం సంపదను ఇచ్చే శుక్రుడు జూలై 9వ తేదీన మంగళవారం రాత్రి 9:40 గంటలకు పుష్య నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. జూలై 20 వరకు ఇదే నక్షత్రంలో శుక్రుడు ఉంటాడు. శుక్రుడి ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి మేలు జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. సంపదలో పెరుగుదల చాలా వరకు ఉంటుంది. ధన ప్రవాహం మెరుగుపడుతుంది. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు. శుక్రుడి గమనంతో ఏ రాశులకు లాభం చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి:
శుక్రుడు, పుష్య నక్షత్రంలోకి ప్రవేశించిన వెంటనే వృషభ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. వైవాహిక జీవితంలో సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ప్రేమ సంబంధంలో మాధుర్యం పెరుగుతుంది. ఆరోగ్యం మునుపటి కంటే చాలావరకు మెరుగ్గా ఉంటుంది. పూర్వీకుల ఆస్తి ద్వారా ఆర్థిక లాభం ఉంటుంది. ఆస్తి వివాదాలు కూడా పరిష్కారమవుతాయి. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అవివాహితులకు వివాహాలు అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారంలో చాలా పురోగతిని సాధించే అవకాశాలున్నాయి. మతపరమైన కార్యక్రమాలపై ఏకాగ్రత వహించడం మంచిది. లక్ష్మీ దేవి అనుగ్రహంతో మీ సంపద పెరిగే అవకాశం ఉంటుంది.
సింహ రాశి:
సింహరాశి వారికి శుక్రుడి గమనంతో మార్పు రావడం వల్ల సింహ రాశి వారికి సుఖ సంతోషాలు, అదృష్టం చాలా వరకు పెరుగుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. కోర్టు కేసుల్లో విజయం పొందే అవకాశాలున్నాయి. ఖర్చులను అదుపులో ఉంచుకోవడం మంచిది. కొత్త ఆదాయ వనరులు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుతారు. సామాజిక, హోదా ప్రతిష్ట కూడా పెరుగుతుంది. తల్లిదండ్రుల సహకారంతో డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు ఏర్పడతాయి. వ్యాపారంలో అధిక లాభాలు పెరుగుతాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సంబంధాలతో ప్రేమ, మాధుర్యం పెరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి కోసం ఒంటరి వ్యక్తుల అన్వేషణ ముగుస్తుంది.

Also Read: 12 ఏళ్ల తర్వాత రోహిణి నక్షత్రంలోకి గురుడు.. ఈ 3 రాశుల వారికి ధనలాభం


మకర రాశి:
పుష్య నక్షత్రంలోకి శుక్రుడి ప్రవేశం మకర రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సంపద, శ్రేయస్సు పెరుగుతుంది. వ్యాపార పరిస్థితి బలంగా ఉండేందుకు అవకాశాలున్నాయి. కెరీర్ లో అఖండ విజయాన్ని పొందుతారు. బాంధవ్యాల మాధుర్యం కూడా పెరుగుతుంది. భౌతిక సుఖాలు కలిగిన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. భూమి లేదా వాహనం కొనుగోలు చేయడంతో ఆనందంగా ఉంటారు. మీ పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుకునే అవకాశాలున్నాయి. సమాజం నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. జీవితంలోని ప్రతి రంగంలో ఆశించిన విజయాన్ని సాధిస్తారు.

Tags

Related News

Durga Puja Week Lucky Rashi: ఈ వారంలో లక్ష్మీ నారాయణ యోగంతో 5 రాశుల వారు అదృష్టవంతులు కాబోతున్నారు

Shani Transit: దీపావళి నుంచి ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారం

Mangal Gochar 2024: అంగారకుడి సంచారంతో ఈ 3 రాశుల వారికి అపారమైన సంపద

Weekly Horoscope: అక్టోబర్ 6 నుంచి 12 వరకు రాశిఫలాలు

Horoscope 6 october 2024: ఈ రాశి వారికి ఉద్యోగులకు పదోన్నతి.. లక్ష్మీదేవిని ధ్యానించాలి!

Budh Gochar: అక్టోబర్ 10 న ఈ రాశుల వారి జీవితాలు అద్భుతంగా మారబోతున్నాయి

Lucky Zodiac Signs For Money: మేష రాశితో సహా ఈ రాశుల వారు త్వరలో గొప్ప అదృష్టవంతులు అవుతారు

×