EPAPER

Varalakshmi Vratam 2024: వరలక్ష్మీ వ్రతం ఏ తేదీన జరుపుకోవాలి ? పూజా విధానం..

Varalakshmi Vratam 2024: వరలక్ష్మీ వ్రతం ఏ తేదీన జరుపుకోవాలి ? పూజా విధానం..

Varalakshmi Vratam 2024: వరలక్ష్మీ వ్రతాన్ని శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజున ఆచరిస్తారు. సంపద శ్రేయస్సును కలిగించే లక్ష్మీ దేవి అవతారాల్లో ఒకటైన వరలక్ష్మీ దేవిని పూజించడానికి శ్రావణ శుక్రవారం ముఖ్యమైన రోజు. పురాణాల ప్రకారం క్షీర సాగరం నుంచి వరలక్ష్మీ అవతరించింది. వరలక్ష్మీని పూజించడం వల్ల ధన లాభం కలుగుతుందని అంతే కాకుండా సమృద్ధి లభిస్తుందని నమ్ముతారు. లక్ష్మీదేవిని గౌరవించడానికి వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. వివాహం అయిన స్త్రీలు తమ భర్త , కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం ఈ రోజున ఉపవాసాలు పాటిస్తారు.


తేదీ, వ్రత ముహర్తం: ఆగస్టు 16.
సింహ లగ్న పూజా ముహూర్తం ఉదయం 05:57 నుంచి 08:14 వరకు
మధ్యాహ్నం 12: 50 నుంచి 03: 08 వరకు
సాయంత్రం 06: 55 నుంచి 08:22 వరకు

వరలక్ష్మీ వ్రత ప్రాముఖ్యత:
దృక్ పంచాగం ప్రకారం వరలక్ష్మీ వ్రతం శ్రావణ శుక్ల పక్షం శుక్రవారం రోజు ఆచరిస్తారు. ఇది రాఖీ, శ్రావణ పూర్ణిమకు ముందు వస్తుంది. వరలక్ష్మీ వ్రతం సమయంలో ఆచరించే పూజ వల్ల అష్ట లక్ష్మీ అంటే సంపద, భూమి, అభ్యాసం, ప్రేమ, కీర్తి వంటి ఎనిమిది దేవతలను పూజించినట్లని నమ్ముతారు.ఈ వ్రతం అయితే వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసుకుంటే శుభఫలితాలుంటాయని పండితులు చెబుతుంటారు. ఈ మేరకు వరలక్ష్మీ వ్రతం ఎలా ఆచరించాలి. దాని విధి విధానాల గురించి తెలుసుకుందాం.


కావలసిన వస్తువులు:
పసుపు కుంకుమ, ఎర్రటి రవిక వస్త్రము, గంధము, పూలు ,పండ్లు, ఆకులు, వక్కలు వాయనముకు అవసరమైన వస్తువులు, టెంకాయలు, దీపపు కుందులు ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన పంచహారతి , దీపారాధనకు నెయ్యి, కర్పూరం, బియ్యం, శనగలు.

వ్రత విధానం:
వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 16 వ తేదీన జరుపుకోనున్నారు. వ్రతం ఆచరించే రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్ర పరచుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మండపంపైన బియ్యపు పిండితో ముగ్గు వేసి కళశాని ఏర్పాటు చేసుకోవాలి. దానిపై అమ్మవారి పటం ఉంటే అక్కడ అందంగా అమర్చుకోవాలి. పూజా సామగ్రి అంతా సిద్ధం చేసుకుని తోరణాలు ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. అక్షింతలు పసుపు గణపతిని సిద్ధం చేసుకోవాలి. తరువాత పూజను ప్రారంభంచాలి.

Related News

Horoscope 20 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే! శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం!

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Guru Vakri 2024 : మరో 20 రోజుల్లో బృహస్పతి తిరోగమనం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు

Budh Shani Yuti Horoscope: బుధ-శని సంయోగంతో ఈ 3 రాశుల వారు సంపదను పొందబోతున్నారు

Big Stories

×