BigTV English

Vadi Biyyam:వడి బియ్యం …ఎందుకు

Vadi Biyyam:వడి బియ్యం …ఎందుకు

Vadi Biyyam:తెలంగాణ సంప్రదాయాల్లో ఒడిబియ్యం ఆచారం చానాళ్లుగా వస్తోంది. ఆడపిల్లలకు తన తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు ఈ ఒడిబియ్యం పోస్తుంటారు. పెళ్లి అనే బంధం కారణంగా ఆడపిల్ల సడెన్ గా తన తల్లిదండ్రులకు, తోడబుట్టినవారికి దూరంగా వెళ్లిపోవడమే కాకుండా కొత్తవారితో కలిసి కొత్త జీవితం ప్రారంభిస్తుంది. 20ఏళ్ల పెంచని కూతురు అత్తారింటికి వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు, పడే బాధ అంతా ఇంతా కాదు. వారి మధ్య దూరాన్ని తగ్గించే ప్రయత్నమే ఒడిబియ్యం. కూతురిని మళ్లీ మళ్లీ ఇంటికి పిలిపించి కనులారా చూసుకుని, మనసారా ఆశీర్వదించి… ఆమెకు ప్రీతి పాత్రమైన దుస్తులు, పసుపు-కుంకుమ పెట్టే అవకాశం కల్పించాలని ఒడిబియ్యం పోయడం అనే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.


ఒడిబియ్యం అంటే ఆడపిల్లను మహాలక్ష్మిరూపంలోపూజించటమే.. అలాగే పక్కనున్న భర్తను మహావిష్ణువులా భావించి సత్కారం చేయాలి. అమ్మలు చిన్నపిల్లలను ఒడిలో పెట్టుకుని కాపాడుకుంటారు.
ఒడి అంటేనే రక్షణ. ఒడిబియ్యం పోసే సమయంలో అమ్మాయిలను గమనిస్తే తెలుస్తుంది. వాళ్ళకు తెలియకుండానే మహాలక్ష్మిగా మారిపోతారు. మహాలక్ష్మి మొదటి లక్షణం రక్షించటం.
బిడ్డను రక్షించమని అల్లుడ్ని కోరుతూ తల్లిదండ్రులు చేసే మహాలక్ష్మి వ్రతమే ఒడిబియ్యం. ఒడిబియ్యంలో ఒక బియ్యమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు కూడా పోస్తారు. అలా వచ్చిన ఒడి బియ్యాన్ని పేరంటానికి పిలిచి అమ్మగారిచ్చిన సారెను ఐశ్వర్యాన్ని ఊరంతా పంచుతుంది.

Salakatla Teppotsavam:సాలకట్ల తెప్పోత్సవాల మహిమ


Tuesday:మంగళవారం ఈ ఒక్క పని చేయద్దు

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×