EPAPER

Turmeric:పసుపు తెచ్చే ఎనర్జీ

Turmeric:పసుపు తెచ్చే ఎనర్జీ

Turmeric:ఒక్కోక్కరికి ఒక్కో రంగు ఇష్టం ఉంటుంది. అయితే కొన్ని రంగులు మన చుట్టూ ఉంటే మనకు ఎంతో మానసిక ప్రశాంతత, స్వాంతన, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అందులో పసుపు రంగు ఒక వ్యక్తిలో ఆహ్లాదకరమైన జ్ఞాపకాలను ప్రేరేపిస్తుందని మానసిక శాస్త్రవేత్తల అధ్యయనాల్లో తేలింది. పసుపు మెదడు కార్యకలాపాలను పెంచుతుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుందని శాస్త్రవేత్తల పరిశోధనల్లో నిర్దారణైంది. పసుపు రంగు చాలా లోతైంది. పసుపును ఎంచుకునే వ్యక్తులు త్వరగా అవసరమైన నిర్ణయం తీసుకుంటారు. అంతేకాదు చురుకుగా పనిచేయడం ప్రారంభిస్తారు. పసుపు ఒక శక్తివంతమైన వైబ్రేషన్ . ఇది తరచుగా ఆధ్యాత్మిక సందేశంగా కనిపిస్తుంది.


పసుపు పూలు
పసుపు శుభసూచకంగా భావిస్తుంటారు. ఇంట్లో పసుపు రంగు పూలని ఉంచడం వల్ల చాలా మంచిది. ఇది పాజిటివ్ ఎనర్జీని తీసుకు వచ్చి నెగిటివ్ ఎనర్జీని బయటకి పంపిస్తుంది. ఒక కళాకారుడికి లేదా నటుడ్ని మెచ్చుకునే సందర్భంలోను పసుపు పూలను కూడా ఇస్తుంటారు. మరింత చురుకుగా, ఉల్లాసంగా పనిచేస్తూ బలాన్ని విశ్వసించాలనుకుంటే పసుపు రంగులు లేదా తెలుపు రంగుని ఎంచుకోవాలి.

పసుపు రంగు
హిందూ సంప్రదాయాల ప్రకారం పసుపు శుభప్రదంగా భావిస్తుంటారు. .వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి గోడలకి పసుపు రంగు వేయడం కూడా మంచిది. వంట గదులు, భోజనాల గదులకు పసుపు రంగు వేస్తే గది వాతావరణం ఆహ్లాదాన్నిస్తుంది. ఇది బాధలని దూరం చేస్తుంది. ఇబ్బందుల్ని పోగొడుతుంది. తీసుకునే నిర్ణయాల్లో చురుకుదనం పెరుగుతుంది..


పూజ ఈ విధంగా చేయండి:

ప్రతి రోజు మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు పసుపు రంగు పూలను ఉపయోగించండి. ఇవి నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీ తీసుకువస్తాయి. అలానే పసుపు రంగు కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది. పసుపు రంగు పూలను, పసుపు రంగుని పడగ గదిలో కూడా ఉంచుకోవచ్చు. ఈ రంగు పూలతో వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

Related News

Horoscope 8 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి పండగే.. పట్టిందల్లా బంగారమే!

Ganesh Chaturthi 2024: అప్పుల బాధ తొలగిపోవాలంటే.. గణపతిని ఇలా పూజించండి

Lucky Zodiac Signs: సెప్టెంబర్ 18 నుంచి వీరికి డబ్బే.. డబ్బు

Horoscope 7 September 2024: నేటి రాశి ఫలాలు.. గణపతిని పూజిస్తే విఘ్నాలు తొలగిపోతాయి!

Ganesh Chaturthi: గణేష్ చతుర్థి నాడు ఇలా చేస్తే దురదృష్టం దూరం అవుతుంది..

Trigrahi Rajyog Horoscope: మిథున రాశి వారిపై త్రిగ్రాహి యోగంతో ఊహించని మార్పులు జరగబోతున్నాయి

Ganesh Chaturthi 2024: వినాయక చవితి స్పెషల్.. మీ స్నేహితులకు, బంధువులకు ఇలా విష్ చేయండి..

Big Stories

×