EPAPER

Trishund Ganpati Temple : త్రిశుండ గణపతి ఆలయం చూశారా..?

Trishund Ganpati Temple : త్రిశుండ గణపతి ఆలయం చూశారా..?

Trishund Mayureshwar Ganpati Temple : కష్టాలను దూరంచేసి విజయాలను అందించే దైవం వినాయకుడు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే రూపం ఆయన సొంతం. ఎదుటి వారు చెప్పేది శ్రద్ధగా వినాలని సూచించే ఆయన పెద్ద చెవులు, దేనినైనా నిశితంగా పరిశీలించాలని చెప్పే ఆయన సూక్ష్మ నేత్రాలు, అటూ ఇటూ కదులుతూ అందరివాడిగా ఉండమని మనకు బోధించే ఆయన తొండం.. గణపయ్యను తలచుకోగానే మనకు ముందుగా గుర్తొస్తాయి. పలుచోట్ల వినాయకుడు అనేక రూపాల్లో కనిపించినా.. మూడు తొండాలతో గణపతి కొలువైన ఆలయం మాత్రం దేశం మొత్తంలో ఒక్కటే ఉంది. ఆ అరుదైన ఆలయ విశేషాలను, ఆ స్వామి మహిమను వివరంగా తెలుసుకుందాం.


త్రిశుండ్ మయూరేశ్వర గణపతి ఆలయంగా పిలిచే ఈ అరుదైన కోవెల పూణె‌లోని సోమవార్ పేటలో ఉంది. ఈ ఆలయానికి 250 ఏళ్ళకు పైగా చరిత్ర ఉంది. ఇండోర్‌ సమీపంలోని ధర్మపూర్‌కు చెందిన భీమ్‌జీగిరి గోసవీ అనే వ్యక్తి 1754లో ఈ ఆలయ నిర్మాణం ఆరంభించగా, 1770లో ఇక్కడ గణపతి ప్రతిష్ఠ జరిగింది.

ఇక్కడి వినాయకుడి మూర్తికి ఎన్నో విశిష్టతలున్నాయి. దేశంలో ఎక్కడా రీతిలో 3 తొండాలు, 6 చేతులు, ఒడిలో దేవేరితో, నెమలి వాహనం మీద ఈ స్వామి దర్శనమిస్తాడు. ఇక్కడి ఆలయాన్ని పూర్తిగా రాతితో నిర్మించారు. దీర్ఘ చతురస్రాకారంలోని పెద్ద పెద్ద పెద్దపెద్ద కృష్ణశిలలను చెక్కి, వాటిని ఒకదానిలో ఒకటి కలిసిపోయేలా కూర్చోబెట్టి.. ఆలయాన్ని నిర్మించారు. ఇంతపెద్ద రాళ్లను సిమెంటుగానీ, సున్నంగానీ వాడకుండా నిర్మించటం అబ్బురపరుస్తుంది.


Read More: అపార శక్తి కేంద్రాలు.. మన శక్తిపీఠాలు

పుణే పట్టణంలోని రైల్వేస్టేషన్‌కి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

స్వామివారిని దర్శించుకుని బయటికి వచ్చిన భక్తులకు ఆలయపు గోడలమీది పర్షియన్, దేవనాగరిలోపిలో ఉన్న శాసనాలు నాటి చరిత్రను వివరిస్తాయి. అలాగే.. ఈ గోడల మీది నెమళ్లు, చిలుకలు, ఏనుగులు, ఖడ్గమృగాల వంటి జంతువుల విగ్రహాలతో బాటు నాటి పురాణగాథలను వివరించే మనోహరమైన శిల్పాలు దర్శనమిస్తాయి. ముఖ్యంగా ఆలయానికి బయటవైపు ఒక తెల్లదొర ఖడ్గమృగాన్ని బంధిస్తున్నట్టున్నట్లు చెక్కిన శిల్పం భక్తుల దృష్టిని ఆకర్షిస్తుంది.

ఆలయంలోకి ప్రవేశించే భక్తులకు ప్రధాన ద్వారం మీద ఆసీనురాలైన గజలక్ష్మి ఆశీర్వదిస్తూ దర్శనమిస్తుంది. ఆమెకు నమస్కరించి కోవెలలోకి ప్రవేశించగానే, గర్భాలయంలో ఒంటినిండా సింధూరాన్ని పులుముకుని ముచ్చటగా నెమలి మీద ఆశీనుడైన గణపయ్య మూడు తొండాలతో దర్శనమిస్తాడు. ఈయనను ప్రార్థించిన వారికి ఎంతటి కష్టమైనా తొలగిపోయి, విజయం చేకూరుతుందని భక్తుల విశ్వాసం.

శిల్పకళా వైదుష్యం రీత్యా కూడా ఈ ఆలయానికి ఎంతో గుర్తింపు ఉందది. గర్భాలయంలోని గోడ మీద మూడు భాషల్లో శాసనాలు చెక్కి ఉన్నాయి. రెండు శాసనాలు సంస్కృతం (దేవనాగరి లిపి)లో ఉంటే, మూడో శాసనం పర్షియన్‌ లిపిలో ఉంటుంది. మొదటి శాసనంలో ఈ ఆలయ నిర్మాణ వివరాలు, రెండో శాసనంలో భగవద్గీత శ్లోకం, మూడో శాసనం మీద గురుదేవదత్త నిర్మాణానికి సంబంధించిన సమాచారం ఉంటుంది.

Read More: ఒకే రాశిలో సూర్యుడు, శని గ్రహాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే!

ఈ ఆలయ ప్రాంగణంలోనే కోవెలను నిర్మింపజేసిన భీమ్‌జీగిరి స్వామి సమాధి కూడా ఉంది. ఏడాదంతా కొలను నీటిలో ఈ సమాధి మునిగిపోయి ఉంటుంది. గురుపూర్ణిమకు ముందు కొలనులోని నీటిని తొలగించి ఆ సమాధిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తారు. వినాయకచవితి, సంకటహర చతుర్థి వేళ.. ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతారు.

ఇక త్రిశుండ గణపతిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఆలయానికి కొద్ది దూరంలోని రాష్ట్రకూటులు నిర్మించిన 8వ శతాబ్ద కాలం నాటి పాటలేశ్వర గుహాలయాలను, 1630లో ఛత్రపతి శివాజీ తండ్రి షహాజీ భోంస్లే నిర్మించి, నివసించిన లాల్ మహల్‌ని దర్శించుకుంటారు. అలాగే.. ఈ కోవెలకు సమీపంలోని శనివార్ వాడలోని కస్బా గణపతి ఆలయాన్ని కూడా భక్తులు దర్శించుకుంటారు. దేశ ప్రజలను స్వాతంత్రపోరాటంలో భాగస్వాములను చేసేందుకు నాడు బాల గంగాధర తిలక్ గణేశ నవరాత్రి ఉత్సవాలను ఈ కోవెలలోనే ప్రారంభించాడు.

Tags

Related News

Lucky moles: ధనవంతుల్ని చేసే పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసా? ఇప్పుడే చెక్ చేసుకోండి

Horoscope 18 october 2024: ఈ రాశి వారికి ఆదాయం కన్నా ఖర్చులే ఎక్కువ.. శనిశ్లోకం చదివితే శుభఫలితాలు!

Diwali Vastu Tips: దీపావళి రోజున శ్రేయస్సు కావాలని కోరుకుంటే వెంటనే ఇంట్లో నుండి ఈ వస్తువులను తొలగించండి

Karwa Chauth Vrat: ఈ స్త్రీలు కర్వా చౌత్ ఉపవాసాన్ని అసలు పాటించకూడదు..

Vastu Shastra: ఇంట్లో ఈ 5 విగ్రహాలు ఉంటే ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది !

Kartik Month 2024 Festival List: రాబోయే 30 రోజులలో వచ్చే పండుగలు, ఉపవాసాలు జాబితా ఇవే

Shani Margi 2024: శని ప్రత్యక్ష సంచారంతో ఈ రాశుల వారి జీవితంలో అత్యంత పురోగతి

Big Stories

×