EPAPER

Daridra Yoga 2024: దరిద్ర యోగం.. ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి

Daridra Yoga 2024: దరిద్ర యోగం.. ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి

Daridra Yoga 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతిగ్రహం నిర్దిష్ట కాలం తరువాత తన రాశిని మార్చుకుంటుంది. గ్రహాల సంచారం వల్ల పలు రాశులకు శుభ, అశుభ యోగాలు కూడా ఏర్పడతాయి. శుక్రుడిని శుభ గ్రహంగా చెబుతారు. ఎందుకంటే శుక్రుడు సంతోషాన్ని, శ్రేయస్సును కలిగిస్తాడు. జాతకంలో శుక్రుడు మంచి స్థానంలో ఉంటే వ్యక్తి ఆనందం, శ్రేయస్సు, విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఇలా ఎవరి జీవితంలో ఎప్పుడూ శుక్రుడు అశుభ స్థానంలో ఉంటాడో వారి జీవితంలో గందరగోళం ఏర్పడుతుంది. వారు పేద వారిగా మారుతారు. అంతే కాకుండా అనేక సమస్యలను కూడా ఎదుర్కొంటారు.


ఆగస్టు 24న శుక్రుడు కన్య రాశిలోకి ప్రవేశించి నీచ యోగాన్ని సృష్టించనున్నాడు. దీనినే దరిద్ర యోగం, అశుభ యోగం అని కూడా అంటారు. ఈ అశుభ యోగం యొక్క ప్రభావం 12 రాశుల పైన ఉంటుంది. అయితే కొన్ని రాశులకు చెందిన వారు ఈ యోగం సమయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. లేకుంటే భారీ నష్టాలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఆగస్టులో కన్యా రాశులో శుక్రుడు సంచారం వల్ల ఏ రాశుల వారి జీవితంలో కష్టాలు ఎదురవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:
ఆగస్టు 24 తర్వాత మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. ఆగస్టు 24 న శుక్రుడు బలహీనమైన కన్య రాశిలోకి ప్రవేశించనున్నాడు. అంతే కాకుండా బృహస్పతి పన్నెండవ ఇంట్లోకి శుక్రుడు సంచరించనున్నాడు. కన్య రాశిలో ఏర్పడిన ఈ యోగం వల్ల ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది, ఈ కాలంలో ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. మీరు ఈ సమయంలో జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ కార్యాలయంలో కూడా సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మేషరాశి వారికి ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం కూడా ఉంది. ఈ నెలలో డబ్బులు కూడా కోల్పోతారు. పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఉండడం మంచిది. తరుచుగా ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా వస్తాయి.


కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి దరిద్ర యోగం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ కాలంలో ఆర్థిక విషయాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కునే ప్రమాదం ఉంది. కాబట్టి కర్కాటక రాశి వారు ఈ సమయంలో డబ్బులను పెట్టుబడి పెట్టడం తగ్గించుకోవడం మంచిది. డబ్బును తెలివిగా ఖర్చు చేయాలి. అంతే కాకుండా డబ్బుపై శ్రద్ధ వహించడం మంచిది. లేకపోతే మీ ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిపోయే ప్రమాదం ఉంది. దరిద్ర యోగం వల్ల మీ ఇంట్లో కలహాలు, పగలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ సమయంలో పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా ఉండటమే ఉత్తమం. కానీ దరిద్ర యోగం మీ ఆర్థిక పరిస్థితికి అంత మంచిది. కాదు ఈ కాలంలో గొడవలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే మీ కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపరచుకోవడానికి కృషి చేయండి.

Also Read:  ఈ 3 రాశుల వారు కుబేర సంపదను దక్కించుకోబోతున్నారు

మకర రాశి:
కన్య రాశిలో దరిద్ర యోగం ఏర్పడటం వల్ల చాలా సమస్యలు వస్తాయి. మకర రాశి వారు ఆఫీసులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యక్తులు మీకు వ్యతిరేకంగా పని చేసే ప్రమాదం ఉంది. కనుక మీరు మోసపోయే అవకాశాలు ఎక్కువ గా ఉన్నాయి. కాబట్టి మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే పనిపై మాత్రమే దృష్టి పెట్టడం మంచిది. ఈ కాలంలో మకర రాశి వారు తమ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఈ సమయంలో మీరు ప్రయాణం చేయాల్సి వస్తే చాలా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. పనుల విషయంలో అడ్డంకులు ఎదుర్కొంటారు. ఓపికగా ఉండడం అవసరం. కష్టపడి పని చేయండి. ఆఫీసులో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకోండి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Horoscope 20 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే! శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం!

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Guru Vakri 2024 : మరో 20 రోజుల్లో బృహస్పతి తిరోగమనం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు

Budh Shani Yuti Horoscope: బుధ-శని సంయోగంతో ఈ 3 రాశుల వారు సంపదను పొందబోతున్నారు

Big Stories

×