EPAPER

Saturn Remedies: శని ప్రభావం తొలగిపోవాలంటే.. ఇవి తప్పక చేయాల్సిందే..!

Saturn Remedies: శని ప్రభావం తొలగిపోవాలంటే.. ఇవి తప్పక చేయాల్సిందే..!
Shani Dev Remedies

Saturn Remedies : జ్యోతిషం ప్రకారం శని గ్రహానికి అధిపతి శనీశ్వరుడు. న్యాయానికి ప్రతీక అయిన శని.. చెడ్డ వారిపట్ల ఎంత కఠినంగా ఉంటాడో, మంచి వారికి అనేక శుభాలను, విజయాలను కలిగిస్తాడు. జాతకం ప్రకారం.. శని వక్రదృష్టితో చూసినప్పుడు ఆ మనిషి అనేక కష్టనష్టాలకు గురవుతాడు. ఈ సమయంలో వారు 11 శనివారాలు శనీశ్వరుడిని ఆరాధిస్తే.. మొత్తం శని ప్రభావం తొలగిపోకపోయినా.. కనీసం కొంత ఉపశమనం మాత్రం తప్పక లభిస్తుంది.


శనివారం రోజున మూగజీవాలకు ఆహారం అందించటం వల్ల శనీశ్వరుడి తీవ్ర ప్రతికూల ప్రభావం ఉపశమించి కొంత ఊరట కలుగుతుంది. శని ప్రభావం కారణంగా ఆర్థిక నష్టాలు ఎదురవుతున్న వారు.. శనివారం రోజున తలస్నానం చేసి, మనసులో శనీశ్వరుడిని స్మరించుకుని దోసిలి నిండా నల్ల నువ్వులు తీసుకుని కుటుంబ పెద్ద తలచుట్టూ మూడు సార్లు తిప్పి ఇంటికి ఉత్తరం వైపున విసిరేస్తే.. ధన సంబంధిత నష్టాలు తొలగిపోతాయి.

శనీశ్వరుడి శుభదృష్టి కలగాలంటే.. శనివారం రోజున దోసెడు నల్ల నువ్వులు, మినప్పప్పు నల్లని వస్త్రంలో కట్టి పేదలకు దానం చేసి, నమస్కరిస్తే.. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. శని ప్రభావం కారణంగా ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే.. అలాంటివారు శనివారం రోజున నల్ల నువ్వులు పాలలో కలిపి ‘ఓం నమో భగవేత వాసుదేవాయ’ అనే మంత్రాన్ని జపిస్తూ.. ఆ పాలను రావి చెట్టు మొదలులో పోస్తే సదరు పరిస్థితులు చక్కబడతాయి.


శనివారం రోజున ఆంజనేయుడిని పూజిస్తే శని ప్రభావం తొలగిపోయి.. సకల శుభాలు, గొప్ప మనోబలం చేకూరతాయి. శనివారం పూజానంతరం గోధుమలు, పప్పు, బెల్లం, నెయ్యి, ఉప్పు, పసుపుకొమ్ములు, బంగాళాదుంపలు, కూరగాయల్ని దానం చేయాలి.
శనివారం నాడు.. శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజించి, 19 వారాల పాటు శనివారం వ్రతం చేయటం వల్ల శని ప్రభావం ఉపశమిస్తుంది. శని ప్రభావంలో ఉన్నవారు శనివారం రోజున మినప్పప్పు, నల్ల నువ్వులు, వంకాయ‌లు, న‌ల్ల మిరియాల‌ను కొన‌టం గానీ, వాడటం గానీ చేయరాదు.

అయితే.. శనివారం రోజున మినుములను దానం చేయటం, దానితో వండిన పదార్థాన్ని కాకులకు పెట్టటం మంచిది. చివరగా.. ప్రస్తుతం పుష్యమాసం నడుస్తోంది. పుష్యమీ నక్షత్రంలో జన్మించిన శనీశ్వరుడికి ఈ నెల అంటే చాలా ఇష్టం. కనుక ఏలినాటి శనితో బాధపడేవారు ఈ నెలంతా శనిని పూజిస్తూ, పౌర్ణమినాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులు దానమివ్వాలి. అలాగే.. శనికి ఇష్టమైన నువ్వులు, బెల్లంతో చేసిన ప్రసాదాన్ని స్వీకరించాలి.

Tags

Related News

Horoscope 8 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి పండగే.. పట్టిందల్లా బంగారమే!

Ganesh Chaturthi 2024: అప్పుల బాధ తొలగిపోవాలంటే.. గణపతిని ఇలా పూజించండి

Lucky Zodiac Signs: సెప్టెంబర్ 18 నుంచి వీరికి డబ్బే.. డబ్బు

Horoscope 7 September 2024: నేటి రాశి ఫలాలు.. గణపతిని పూజిస్తే విఘ్నాలు తొలగిపోతాయి!

Ganesh Chaturthi: గణేష్ చతుర్థి నాడు ఇలా చేస్తే దురదృష్టం దూరం అవుతుంది..

Trigrahi Rajyog Horoscope: మిథున రాశి వారిపై త్రిగ్రాహి యోగంతో ఊహించని మార్పులు జరగబోతున్నాయి

Ganesh Chaturthi 2024: వినాయక చవితి స్పెషల్.. మీ స్నేహితులకు, బంధువులకు ఇలా విష్ చేయండి..

Big Stories

×