Big Stories

Bhagini Hastha Bhojanam : భగినీ హస్త భోజనం చేస్తే కలిగే లాభం ఇదే!..

- Advertisement -

Bhagini Hastha Bhojanam : భారతీయ సంప్రదాయంలో రక్తసంబంధాలకీ, అనుబంధాలకీ ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ప్రాధాన్యతను ఇవ్వడమే కాదు, వాటిని కలకాలం నిలుపుకొనేందుకు చక్కటి ఆచారాలను కూడా అందించారు మన పెద్దలు. అందుకు గొప్ప ఉదాహరణే భాతృవిదియ! సోదరీ, సోదరుల ఆప్యాయతాను బంధాలకు అద్దంపట్టే ఒక సంప్రదాయం భగినీ హస్త భోజనం. భగిని అంటే సోదరి. ఆమె పెట్టే భోజనం కనుక భగినీ హస్త భోజనం అంటారు. అన్నా చెల్లెళ్లు ఎవరైనా సరే ఏడు సంవత్సరాలు కలుసుకోకుండా ఉంటే వారి మధ్య బంధం తెగిపోతాయి. అందుకే ఇలాంటి బంధాలు కొనసాగేలా చేసేందుకు మన పెద్దలు ఈ ఆచారాన్ని పండుగలా మలిచి మనకు పరిచయం చేశారు.

- Advertisement -

కార్తీక శుద్ధ విదియ అంటే దీపావళి వెళ్ళిన రెండో రోజు ఈ వేడుకను జరుపుకుంటారు. సోదరీ, సోదర ప్రేమకి అద్దం పట్టే పండుగ. అన్నదమ్ములు తమ తమ అక్కా చెల్లెళ్ళ ఇళ్ళకు బహుమానాలు తీసుకెళ్ళి వారి చేతి వంట తిని వారితో బొట్టు పెట్టించుకుంటారు. రక్షాబంధనంలో అన్నదమ్ములు తమ సోదరి రాఖీ కట్టినందుకు ఆమె యోగక్షేమాలు తాము చూస్తామని రక్షిస్తామని చెపుతారు.రాఖీ సోదరి క్షేమానికి సంబంధించినది. ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తారింటికి పంపినా.. ఆమెతో పుట్టింటి బంధం కొనసాగేందుకు కూడా ఈ ఆచారం పెట్టినట్టు మనం అర్ధం చేసుకోవచ్చు.

మన పురాణాల్లో కధ ప్రకారం యమధర్మరాజు సోదరి యమున.ఆమె వివాహమై వెళ్ళాక తన సోదరుడిని తన ఇంటికి ఎన్నో సార్లు రమ్మని పిలిచింది.కానీ యమధర్మరాజు వెళ్ళలేక పోయాడు.చివరికి ఒకసారి ఈ కార్తీక మాస విదియ రోజున యమున ఇంటికి వెళ్తాడు. సోదరుడు వచ్చాడని యమున సంతోషంగా పిండి వంటలతో భోజనం పెట్టింది. చాలా రోజుల తర్వాత అన్నాచెల్లెళ్లు కలుసుకోవటంతో ఇరువురూ సంతోషించారు.

ఆ సంతోషంతో యమధర్మరాజు యమునని ఏదైనా వరం కోరుకోమన్నాడు.వాళ్ళు దేవతలు కనుక వారు కోరే వరాలు కూడా జన ప్రయోజనాలుగా ఉంటాయి.ఆమె ఈ కార్తీక శుధ్ధ విదియనాడు లోకంలో ఎక్కడైనా సరే తన సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేసిన సోదరులకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని అడిగింది. ఈ కోరికకి యమధర్మరాజు సంతోషించి అలా వేడుక జరుపుకున్న వారికి అపమృత్యు దోషం లేకుండా ఉంటుంది.ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుంది అని వరాలిచ్చాడట.అందుకే ఈ ఆచారం ఆచరణలోకి వచ్చింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News