EPAPER

Krishna to Karna:- కర్ణుడికి కృష్ణుడు చెప్పిన జీవిత సత్యం

Krishna to Karna:- కర్ణుడికి కృష్ణుడు చెప్పిన జీవిత సత్యం

Krishna to Karna:- మహాభారతం సూత్రధారి శ్రీకృష్ణుడు. అందులో దుర్యోధనుడి తర్వాత కీలకమైన వ్యక్తి కర్ణుడు. ఈ ఇద్దరి మధ్య ఒక విచిత్రమైన సంభాషణ జరిగింది. ఆ సమయంలో కృష్ణుడు చెప్పిన జీవిత సత్యం మన జీవితాలకు బాగా అన్వయిస్తుంది.


యుద్ధానికి ముందు కర్ణుడు కృష్ణుడుని అడిగాడు. తాను పుట్టీపుట్టగానే నన్ను నా తల్లి వదిలేసింది.. అశాస్త్రీయమైన జన్మను పొందడం అనేది నా తప్పా..కాదే..ద్రోణాచార్యులు నాకు విద్య నేర్పేటందుకు నిరాకరించారు..ఎందుకంటే నేను క్షత్రియుడ్ని కాను అన్న కారణంతో.. పరశురాముడు విద్యనైతే నేర్పారు కానీ నేను క్షత్రియుడిగా గుర్తింపబడేవరకూ ఆ విద్యనంతా మరిచిపోయేలా శాపం పెట్టారు. ద్రౌపదీ స్వయంవరంలో నాకు పరాభవం జరిగింది.. ఈనాడు కుంతీమాత వచ్చి నేను తన పుత్రుడిని అని నాకు నిజం చెప్పటం వెనకనున్న కారణం కేవలం ఆవిడ తన వేరే పుత్రులను కాపాడుకోవటం కోసమే..

నేనంటూ ఏదన్నా పొందాను అంటే అది దుర్యోధనుని దయాధర్మం వల్లే..అలాంటప్పుడు నేను దుర్యోధనుని పక్షాన ఉండటం తప్పెలా అవుతుంది అని కర్ణుడు శ్రీకృష్ణుడ్ని ప్రశ్నించాడు. దానికి కృష్ణుడు సమాధానంగా కర్ణునికి చెప్పాడు… నేను పుట్టడమే జైలులో పుట్టా. నా పుట్టుక కంటే ముందే నా చావు నాకోసం కాచుకుని కూర్చుంది. నేను పుట్టిన రాత్రే నా కన్న తల్లితండ్రి నుండీ దూరమయ్యాను.
చిన్నతనంలో నువ్వు రథాలు, కత్తులు, బాణాలు, గుర్రాలు ఇలాంటి శబ్దాల మధ్య పెరిగావు.. నేను గోశాలలో పేడ వాసనల మధ్యన పెరిగా. నా చిన్నతనంలో నన్ను చంపేందుకు నా పైన ఎన్నో దాడులు జరిగాయి..అప్పటికి నాకు నడిచే వయసు కూడా రాలేదు..కానీ ఎన్నో దాడులు ఎదుర్కున్నాను.. నాచుట్టూ ఉన్న వారు వారి సమస్యలకు నేనే కారణం అని నన్ను నిందించేవారు కూడా..
నాకు సైన్యమూ లేదు, విద్య కూడా లేదు..మీరందరూ మీ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని మీ ప్రతిభలకు మీ గురువుల నుంచీ అభినందనలు పొందే వయసుకి నేను విద్య నేర్చుకునేందుకు నోచుకోలేదు కూడా. సాందీపుని రుషి నా 16 ఏట నా చదువు ప్రారంభమైంది.


సరే ఇంతకీ దుర్యోధనుడు ఈ యుద్ధం గెలిచాడే అనుకో నీకు మంచిపేరు వస్తుంది…అదే ధర్మరాజు గెలిస్తే నాకేమీ రాదు…పైగా ఈ యుద్ధానికి సంబంధించిన సమస్యలకూ నేనే కారణం అన్న నింద అందరూ నాపైనే వేస్తారు కూడా. .ఒకటి గుర్తుంచుకో కర్ణా..జీవితంలో సమస్యలు, సవాళ్ళు అందరికీ ఉంటాయి..జీవితం ఏ ఒక్కరికీ పూలబాట కాదు..అన్నివేళలా అంతా సవ్యంగానే ఉండదు..దుర్యోధనుడు అవనీ యుధిష్టరుడు అవనీ అందరూ జీవితపు దెబ్బలు రుచి చూసినవారే.. ఏది సరైనదో ఏది ధర్మమో నీ మనసుకి నీ బుద్ధికి తెలుసు..మనకు ఎంత అన్యాయం జరిగినా..మనకు ఎన్ని పరాభవాలు జరిగిన..రావాల్సింది రాకపోయినా మనం ఆయా సమయాల్లో ఎలా ప్రవర్తిస్తామో అదే మన వ్యక్తిత్వం…అదే చాలా ముఖ్యమైనది..జీవితం ఆటుపోట్లు భరించామనో, మనకు చెడు అనుభవాలు ఎదురయ్యాయనో..అనే కారణాలు మనకు అధర్మమార్గంలో ప్రయాణించేందుకు అనుమతిగా అనుకోకూడదు..మనం బాధపడ్డామని జీవితాన్ని చెడు మార్గంలోకి నడిపించకూడదని కర్ణునికి కృష్ణుడు బోధించాడు..

Related News

Horoscope 9 october 2024: ఈ రాశి వారికి వివాహయోగం.. ఇష్ట దేవతారాధన శుభప్రదం!

Budh Gochar: అక్టోబర్ 10 నుంచి ఈ రాశుల వారు తస్మాత్ జాగ్రత్త

Grah Gochar: 3 గ్రహాల సంచారం.. వీరి జీవితంలో అద్భుతాలు జరుగుతాయ్

Horoscope 8 october 2024: ఈ రాశి వారికి ఊహించని ధనలాభాలు.. దైవారాధన మానవద్దు!

Durga Puja 2024: మహాషష్టి పూజ ఎప్పుడు ? తేదీ, పూజకు సంబంధించిన వివరాలు ఇవే

Astrology tips on Dussehra: దసరా నాడు ఈ పనులు చేస్తే త్వరలో మీరు కూడా ‘అదానీ-అంబానీ’లు కావచ్చు

Maha Ashtami 2024: మహా అష్టమి నాడు ‘మహా సంయోగం’.. 3 రాశులకు ఆర్థిక లాభాలు

×