EPAPER

Sun Transit 2024: జులై 16 నుంచి ఈ రాశుల వారికి కష్టాలు.. జాగ్రత్త సుమా !

Sun Transit 2024: జులై 16 నుంచి ఈ రాశుల వారికి కష్టాలు.. జాగ్రత్త సుమా !

Sun Transit 2024: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు నిర్దిష్ట విరామం తర్వాత తన రాశిని మార్చుకుంటాయి. ఒక రాశి మరొక రాశిలోకి సంచరించడం వల్ల మేషం నుంచి మీనం వరకు 12 రాశుల మీద శుభ, అశుభ ప్రభావాలు ఉంటాయి. దృక్ పంచాంగం ప్రకారం సూర్యుడు 2024,జులై 16న కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. నెల రోజుల పాటు సూర్యుడు కర్కాటక రాశిలో ఉండి తన సొంత రాశి అయిన సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు.


ఈ రోజు నుంచి ఉత్తరాయణం ముగిసి దక్షిణాయన కాలం మొదలవుతుంది. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే వరకు దక్షిణాయనం ఉంటుంది. ఇప్పటికే కర్కాటక రాశిలో శుక్రుడు ఉన్నాడు. మరికొద్ది రోజుల్లో బుధుడు కూడా ప్రవేశించనున్నాడు. సూర్యుడి సంచారం తర్వాత కర్కాటక రాశిలో గ్రహాల అద్భుతమైన కలయిక ఏర్పడుతుంది. సూర్యుడు, బుధుడు, శుక్రుడి కలయిక బుధాదిత్య, శుక్రాదిత్య, లక్ష్మీ నారాయణ యోగాన్ని సృష్టిస్తోంది. ఈ యోగం కొన్ని రాశులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

సూర్యుడి సంచారం కొందరికి అద్భుతమైన ఫలితాలను కూడా ఇస్తుంది. అయితే కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారి జీవితంలో ఒడిదుడుకులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. సూర్య సంచారం తర్వాత ఏ రాశుల వారు అప్రమత్తంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సింహ రాశి :
సూర్యుడి సంచారం తర్వాత సింహ రాశి వారి జీవితాల్లో మానసిక చికాకులు పెరుగుతాయి. గత జ్ఞాపకాలు మనస్సును ఇబ్బంది పెడతాయి. తెలియని భయం వల్ల మనస్సు కూడా కలత చెందుతుంది. ఈ సమయంలో మీతో మీరు సమయం గడపండి. కోపం ఎక్కువగా రాకుండా చూసుకోండి. మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం మంచిది. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. వ్యక్తిగత వృత్తి జీవితంలో సమస్యలను తెలివిగా పరిష్కరించుకొని ఓపికగా ఉంటూ విజయం సాధించడానికి కష్టపడండి.
ధనస్సు రాశి :
సూర్యుడి గమనంలో మార్పు కారణంగా ధనస్సు రాశి వారి జీవితాల్లో అనేక మార్పులు వస్తాయి. మీరు ఎమోషనల్‌గా కనిపిస్తారు. పని ఒత్తిడి కూడా బాగా పెరుగుతుంది. ఏ పని చేయాలనే ఫీలింగ్ ఉండదు. ఆఫీసులో ప్రత్యర్థులు చురుకుగా కనిపిస్తారు. ఎవరైనా మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు. అందుకే ఆర్థిక విషయాల్లో తెలివిగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది . సమస్యలను తెలివిగా పరిష్కరించుకోవడం ఉత్తమం. పరిశోధన చేయకుండా పెట్టుబడి పెట్టకండి. లేదంటే నష్టపోవాల్సి వస్తుంది. ఆచి తూచి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది.


Also Read: ఏకాదశి నుంచి ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం !

కుంభ రాశి :
సూర్యుడు తన రాశిని మార్చుకున్న తర్వాత కుంభ రాశి వారు వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆఫీసులో చాలా బిజీ షెడ్యూల్ వీరికి ఉంటుంది. పని ఒత్తిడి కూడా పెరుగుతుంది. మీరు కొత్త పనులకు బాధ్యత వహిస్తారు. ఆఫీసులో పోటీ వాతావరణం ఉండడం వల్ల మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించలేకపోతున్నారు. ధైర్యంగా ఉండడం మంచిది. ఇబ్బందులకు భయపడకూడదు. కెరీర్‌కు సంబంధించిన నిర్ణయాలు ఆలోచనాత్మకంగా తీసుకోండి. సరైన నిర్ణయాలు తీసుకున్నప్పుడే మీరు ముందుకు రాణించగలుగుతారు. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి.

Tags

Related News

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Guru Vakri 2024 : మరో 20 రోజుల్లో బృహస్పతి తిరోగమనం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు

Budh Shani Yuti Horoscope: బుధ-శని సంయోగంతో ఈ 3 రాశుల వారు సంపదను పొందబోతున్నారు

Horoscope 19 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ధనలాభం!

Big Stories

×