E-Paper
Advertisement

Kedarnath Temple:ఏప్రిల్ లో తెరుచుకోనున్న కేథార్ నాథ్ తలుపులు

Kedarnath Temple:ఏప్రిల్ లో తెరుచుకోనున్న కేథార్ నాథ్ తలుపులు

Kedarnath Temple:ఉత్తరాఖండ్‌లోని ప్రధాన పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్ ధామ్ తలుపులు తెరుచుకోబోతున్నాయి. ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయం నుంచి బాబా ధామ్ పోర్టల్స్‌ను తెరవనున్నట్లు అధికారులు ప్రకటించారు. కేదార్‌పూర్‌ ప్రాంతంలో శీతాకాలపు నిల‌యమైన ఓంకారేశ్వర్ ఆలయంలో రక్షక్ భైరవనాథుని ఆరాధన ఏప్రిల్ 20న పూర్తవుతుంది. తర్వాత కేదార్‌నాథ్ పంచముఖి డోలి ఏప్రిల్ 21 న కేదార్‌నాథ్‌కు బయలుదేరుతుంది. ఆ రోజున పంచముఖి డోలి విశ్వనాథ్ ఆలయం గుప్తకాశీలో విశ్రాంతి తీసుకుంటుంది. దీని తరువాత డోలీ ఫాటా ఏప్రిల్ 22 రాత్రికి చేరుకుంటుంది.

ఏప్రిల్ 23న పంచముఖి డోలి ఫాటా నుండి రాత్రి విశ్రాంతి కోసం గౌరీకుండ్ చేరుకుంటుంది.ఏప్రిల్ 24 న పంచముఖి డోలి గౌరీకుండ్ నుండి కేదార్‌నాథ్ ధామ్‌కు చేరుకుంటుంది.ఆ తర్వాత ఏప్రిల్ 25 మంగళవారం ఉదయం 6.20 గంటలకు కేదార్‌నాథ్ ధామ్ తలుపులు భక్తుల కోసం తెరుస్తారు. బద్రీనాథ్,కేదార్‌నాథ్ ఆలయ కమిటీ, కేదార్‌నాథ్ తీర్థ పురోహిత్ సమాజ్ మరియు భక్తులతో సహా పంచగై హక్-హకుక్‌ధారీలు, స్థానిక పరిపాలన సమక్షంలో కేదార్‌నాథ్ ధామ్ తలుపులు తెరవడానికి ఆచార్య వేదపతిలు తేదీని నిర్ణయించారు. 25 ఏప్రిల్ 2023న ఉదయం 6.20 గంటలకు తలుపులు తెరుస్తారు.

ప్రతి సంవత్సరం శీతాకాలంలో విపరీతమైన హిమపాతం చలి కారణంగా, కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి మరియు యమునోత్రి తలుపులు భక్తుల కోసం మూసివేస్తారు.త‌దుప‌రి ఏడాది ఏప్రిల్-మేలో మళ్లీ తెరుస్తారు.బద్రీనాథ్ ధామ్ తలుపులు ఈ సంవత్సరం ఏప్రిల్ 27న తెరవనున్నారు. సాంప్రదాయకంగా శ్రీ గంగోత్రి-యమునోత్రి ధామ్ తలుపులు అక్షయ తృతీయ నాడు తెరవనున్నారు.ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ 22 న జ‌ర‌గ‌నుంది.తలుపులు తెరిచే తేదీలను గంగోత్రి-యమునోత్రి ఆలయ కమిటీలు ప్రకటిస్తాయి.

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×