Big Stories

10 Types Of Sins : 10 రకాల పాపాలు తొలగిపోయే రోజు

10 Types Of Sins : మనిషి జీవితంలో పాపాలు పుణ్యాలు చేస్తుంటాడు. ఒక్కోసారి తెలియకుండానే కొన్ని తప్పులు చేసి పాపాలను మూటగట్టుకుంటాడు. అలాంటి పాపాలను తొలగించుకునేందుకు కొన్ని పరిహారాలు ఉన్నాయి. దశపాపాహర దశమి రోజు గురించి రకరకాల వాదనలు ఉన్నాయి . ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. కాశీలోని గంగానది నీళ్లను తీసుకుని శివార్పణం అని ఈశ్వర సన్నిధానంలో అభిషేకం నిర్వహించాలని శాస్త్రం చెబుతోంది. దశ విధాలుగా చేసే పాపాలో కాయక అంటే శరీరంతో చేసేవి, మనసుతో చేసేవి, నోటితో చేసేవి, వ్యవహారాల ద్వారా చేసేవి, లేఖల ద్వారా చేసేవి ఇవి తెలిసి చేసేవి. తెలియకుండా చేసేవి ఐదు విధాలు కలిపితే మొత్తం పదిరకాలు పాపాలు నివృత్తి చేసుకునేందుకు పరిహారాన్ని శాస్త్రం సూచించింది.

- Advertisement -

పది రకాల పాపాలను చిన్న పరిహారం ఏంటంటే కేవలం నీటిని దానం ఇవ్వాలి. చలివేంద్రాల దగ్గర యధాశక్తి సహాయం చేయాలి. తెలిసీ తెలియక చేసిన పాపాలతో గడిపేస్తూ ఉంటారు. ఎవరి గురించో మాట్లాడిన ఒక మాట మరో చోట వ్యాపించి వారికి నష్టం జరిగితే దానికి ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది. అందుకే మౌనవ్రతం కూడా ఇందులో భాగమే అవుతుంది. మనదేశంలో 70శాతం నీరే ఉంటుంది. అందుకే ఇవాళ్టి రోజు గంగను పూజించాలి. మట్టికుండలో నీళ్లు నింపి యధాశక్తి పండ్లు, నైవేద్యం పెట్టి , దక్షిణం పెట్టి జల కుంభదానం చేయాలి.

- Advertisement -

ఇంటిని గంగాజలం సంప్రోక్షణ చేసుకోవాలి. నీటి నిల్వలను కాపాడుకోవాలి. జలం లేనిదే జీవితం లేదు. మనిషి మనుగడ ఉండదు. నీటి సంరక్షణ చర్యలు చేపట్టడానికి చర్యలు తీసుకోవాలి. దశపాపహర దశమి రోజు పూజతో మనకు మనం మంచి చేసుకోవడమే ఉద్దేశం.పదిరకాల పళ్లతో పూజ చేసిన వారికి ఏడాదంతా ప్రతీ విషయంలో మంచి ఫలితాలు కలుగుతాయి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రామసేతువు వంతెన పనులు ప్రారంభించిన రోజు కూడా ఇదే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News