Big Stories

Guru Pushya Yogam : ఏడాదిలో అక్షయ తృతీయను మించిన రోజు

Guru Pushya Yogam

- Advertisement -

Guru Pushya Yogam :ఈనెల 25కి పంచాంగం ప్రకారం ఒక ప్రత్యేకత ఉంది. అత్యంత అరుదుగా వచ్చి గురు పుష్య యోగం కలగబోతోంది. అదే రోజు రోహిణికార్తె కూడా మొదలవుతోంది. గురు పుష్యయోగం పూజను ఆచరిస్తే మీ ఇల్లంతా స్వర్ణమయమే. గురువారం పుష్యమి నక్షత్రం కలిసి వస్తే గురు పుష్య యోగం వస్తుంది. ఎప్పుడో ఒకసారి రెండు సార్లు మాత్రమే సంవత్సరంలో ఇలాంటి రోజు వస్తుంది. చాన్నాళ్ల నుంచి బంగారం కొన్నాలనా కొనలేకపోతున్న వారు ఇవాళ్టి రోజు పిసరంత బంగారం కొన్నా భవిష్యత్తులో మీ ఇల్లంతా బంగరామయం అవుతుంది జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. మే 25 న ఉదయం 5 గంటల 42 నిమిషాల నుంచి సాయంత్రం ఆరు లోపల మీకు స్థోమత ఉన్నంత వరకు చివరకు గుండు సైజులో ఉన్న బంగారం కొన్నా మీకు కలిసి వస్తుంది. ఆ తర్వాత రోజుల్లో మీ ఇంట్లోని బంగారం రెట్టింపవుతుంది.

- Advertisement -

ఇల్లు కట్టాలనుకున్న వాళ్ల మే 25న శంకుస్థాపన చేయడానికి మంచి ముహూర్తం.
త్వరగా ఇల్లు పూర్తి చేయడమే కాదు మంచి ఫలితాలు కలుగుతాయి. కొత్త ఇల్లు మారాలన్న గురు, పుష్యయోగం ఉన్న రోజు మారితే శుభం జరుగుతుంది. కొత్త ఇంటికి గృహప్రవేశం కూడా నిరంభ్యంతరంగా చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. కొత్త వాహనాలు కొనాలనుకున్నా వారు గురువారం అడ్వాన్స్ ఇచ్చినా, వాహనాన్ని తెచ్చుకున్నా మీకు అదృష్టాన్ని తీసుకొస్తుంది. లైఫ్ టర్నింగ్ ఉండే ఒప్పందాలను ఏవైనా సరే ఇవాళ చేసుకుంటే విశేషమైన ఫలితాలు కలిగే అవకాశాలున్నాయి.

గురు పుష్య యోగం రోజు శ్రీ మహా విష్ణువును పూజించాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మంచి జరుగుతుంది. ఇవాళ రోజు బట్టలు, అన్నదానం, డబ్బు దానం సర్వదా శ్రేష్టకరం. ఉదయం పూట బెల్లం, నీరు, నెయ్యి వీటిలో ఏది దానం చేసినా పుణ్య ఫలం కలుగుతుంది. గురు పుష్య యోగంలో మతపరమైన పుస్తకాలను కొనడం వల్ల ఖచ్చితంగా ప్రయోజనం పొందుతారు. గురు పుష్య యోగంలో శ్రీ యంత్రం, కుబేర్ యంత్రం లాంటివి కొని ఇంటికి తీసుకొని రావచ్చు. ఇనుప వస్తువుల, పదునైన ఆయుధాలు, కత్తులు లాంటివి ఇవాళ్టి రోజు కొనుగోలు చేయకుండా ఉంటే మంచిది. పెళ్లిళ్లకి సంబంధించి వస్తువులు కొనడానికి శుభసమయం కాదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News