EPAPER
Kirrak Couples Episode 1

Spirituality: పంచ పునీతాలు గురించి మీకు తెలుసా.!

Spirituality: పంచ పునీతాలు గురించి మీకు తెలుసా.!

Spirituality: మనిషి తన జీవితంలో ఐదింటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. అవి..


  1. వాక్ శుద్ధి: వేలకోట్ల ప్రాణులను సృష్టించిన ఆ భగవంతుడు కేవలం మనిషికి మాత్రమే మాట్లాడే శక్తినిచ్చాడు. కనుక వాక్కును దుర్వినియోగం చేయకూడదు. పగ, కసి, ద్వేషంతో ఎవరినీ నేరుగా లేదా పరోక్షంగా నిందించరాదు. ప్రేమగా, ఆదరణగా అందరినీ పలకరించాలి. చెడు మాట్లాడేవారికి దూరంగా వెళ్లటం మంచిది.
  2. దేహశుద్ధి: మన శరీరం జీవాత్మ కొలువైన దేవాలయం వంటిదే. కనుక దానిని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు రెండుపూటలా స్నానం చేయాలి. ఉన్నంతలో మంచి బట్ట కట్టుకోవాలి. చిరిగిన, అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించరాదు.
  3. భాండ శుద్ధి: శరీరానికి కావలసిన శక్తిని ఇచ్చేది ఆహారం. అందుకే ఆ ఆహారాన్ని వండే, నిల్వచేసే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి. స్నానం చేసి, పరిశుభ్రమైన పాత్రల్లో వండిన ఆహారం అమృతతుల్యమైనది.
  4. కర్మశుద్ధి: చేపట్టిన కర్మను ఆచరించటం మనిషి బాధ్యత. ఆ పనిని మధ్యలో ఆపినవాడు అధముడు. అసలు పనినే ప్రారంభించనివాడు అధమాధముడు. తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తిచేసినవాడు ఉన్నతుడు.
  5. మనశ్శుద్ధి: మనస్సును ఎల్లప్పుడూ ధర్మ, న్యాయాల దిశగా నిలపాలి. మనస్సు చంచలమైనది కనుక అది చెడువైపు త్వరగా ఆకర్షితమవుతూ ఉంటుంది. దీంతో మనిషి కష్టాల పాలవుతుంటాడు. కనుక ఎవ్వరికీ హాని చేయని మనస్తత్వం కలిగివుండటమే మనఃశుద్ధి.


Related News

Sun Ketu Transit: 3 రాశుల జీవితంలో సూర్య, కేతు ప్రభావం.. ఇక అన్నీ అద్భుతాలే

Shash Rajyog Effect: దీపావళి తర్వాత ఈ 3 రాశుల వారు రాజ భోగాలు అనుభవించబోతున్నారు

Shiva Favourite Zodiac: శివుడికి ఇష్టమైన ఈ 5 రాశుల వారికి ప్రమాదాలు అస్సలు దరిచేరవు

Weekly Horoscope: వచ్చే వారం ఈ రాశులకు ధన లాభం-సంతోషం

October Horoscope Zodiacs: అక్టోబర్‌లో ఈ రాశుల వారికి వ్యాపారంలో అన్నీ విజయాలే

Shani Nakshatra Parivartan 2024: శతభిషా నక్షత్రంలోకి శని.. పూజకు ముందు ఈ రాశి వారికి అదృష్టం రాబోతుంది

Pradosh Vrat 2024: రెండవ ప్రదోష వ్రతం ఎప్పుడు ? తేదీ, శుభ సమయం, ప్రాముఖ్యత వివరాలు ఇవే

Big Stories

×