EPAPER
Kirrak Couples Episode 1

Sabarimala Devotees : శబరిమల వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు

Sabarimala Devotees : శబరిమల వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు

Sabarimala Devotees : అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమలకు వెళ్తున్న ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది.ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల అయ్యప్పభక్తులు శబరిమల రైల్వే టికెట్ల కోసం బుకింగ్ చేసుకుంటున్నారు.


డిసెంబర్‌, జనవరి నెలల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 38 శబరిమల ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇప్పటికే అటువైపే వెళ్లే రైళ్లన్నీ కిటకిటలాడుతుంటాయి. ఈనేపథ్యంలో

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే శాఖ శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. తాజాగా అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే శాఖ మరికొన్ని రైళ్లను ఏర్పాటుచేసింది.


హైదరాబాద్ – కొల్లాం: 07133 నంబర్‌ గల రైలు డిసెంబర్ 5, 12, 19, 26, జనవరి 2, 9 ,16 తేదీలలో హైదరాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు కొల్లాం చేరుకుంటుంది.
కొల్లాం – హైదరాబాద్ : 07134 నంబర్ గల ట్రైన్‌ డిసెంబర్ 6, 13, 20, 27, జనవరి 3, 10, 17 తేదీలలో కొల్లాం నుంచి బయలుదేరి మరుసటి రోజు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక

రైళ్లు సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడే, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు స్టేషన్లలో ఆగుతాయి.
నర్సాపూర్ – కొట్టాయం : 07119 రైలు సర్వీసు డిసెంబర్ 2, 9, 16, 30, జనవరి 6, 13 నర్సాపూర్ నుండి బయలుదేరి మరుసటి రోజు కొట్టాయం చేరుకుంటుంది.
కొట్టాయం – నరసాపూర్ : 07120 నంబర్‌ రైలు కొట్టాయం నుండి డిసెంబరు 3, 10, 17 31, జనవరి 7, 14 తేదీలలో బయలుదేరి మరుసటి రోజు నర్సాపూర్ చేరుకుంటుంది.

సికింద్రాబాద్ – కొట్టాయం : 07125 నంబర్‌ రైలు డిసెంబర్ 4, 11, 18, 25, జనవరి 1, 8 సికింద్రాబాద్ నుండి బయలుదేరి మరుసటి రోజు కొట్టాయం చేరుకుంటుంది.
కొట్టాయం – సికింద్రాబాద్ : 07126 నంబర్‌ రైలు కొట్టాయం నుంచి డిసెంబర్ 5, 12, 19, 26, జనవరి 2, 9 లలో బయలుదేరి మరుసటి రోజు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు చెర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడే, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, సేలం, ఈరోడ్, తిరుప్పూర్,

కోయంబత్తూరు, అలువా ఎర్నాకులం టౌన్‌ స్టేషనల్లో ఆగుతాయి.

Related News

Grah Gochar October 2024: అక్టోబర్‌లో ఈ రాశి వారి జీవితంలో డబ్బే డబ్బు.. ఇందులో మీ రాశి కూడా ఉందా ?

Shani Gochar 2024: శని-రాహుల కలయికతో అక్టోబర్‌ నెలలో ఈ రాశుల విధి మారబోతుంది

Plants For Home: ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే సంపదకు లోటుండదు

Do not Donate these 5 things: పొరపాటున కూడా ఈ 5 వస్తువులు ఎవరికీ దానం చేయకండి

Lord Vishnu Pooja: మీ ఇంట్లో సిరి, సంపదలు పెరగడం కోసం విష్ణువును ఇలా పూజించండి

Mool Trikon Rajyog Horoscope: ప్రత్యేక యోగంతో ఈ 3 రాశుల జీవితంలో అన్నీ అద్భుతాలే..

Samsaptak yoga 2024: అక్టోబర్‌లో సంసప్తక యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం

Big Stories

×